Guntur: డాబాపై నిద్రిస్తుండగా జననాంగాలు కోసేసిన యువతి - తల్లి ప్రియుడిపై కూతురు ఘాతుకం

Tenali News: తల్లితో ఎవరో పరాయి వ్యక్తి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే విషయం తెలిసి కూతురు సహించలేక పోయింది. ఏకంగా ఆ వ్యక్తి మర్మాంగాన్ని కోసేసింది.

FOLLOW US: 

Guntur District News: గుంటూరు జిల్లా తెనాలిలో ఓ యువతి దారుణానికి ఒడిగట్టింది. తన తల్లితో ఎవరో పరాయి వ్యక్తి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే విషయం తెలిసి సహించలేక పోయింది. తన తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని కూతురు ఏకంగా ఆ వ్యక్తి మర్మాంగాన్ని కోసేసింది. రాత్రి మద్యం తాగి వచ్చి డాబాపై నిద్ర పోతున్న సమయంలో కుమార్తె ఈ దారుణానికి ఒడిగట్టింది. వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి రామచంద్రా రెడ్డిపై కూతురు రాత్రి వేళ విచక్షణ రహితంగా దాడి చేసింది. తల్లి పక్కనే పడుకుని ఉన్న సమయంలో బ్లేడు‎తో మర్మాంగాన్ని కోసివేసింది. 

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె అతని మర్మాంగాన్ని కోయగానే, బాధితుడు పెద్దగా కేకలు వేశాడని తెలిపారు. వెంటనే తాము స్పందించి రామచంద్రా రెడ్డిని ఆస్పత్రికి తరలించామని చెప్పారు. బాధితుడి స్వస్థలం చెరుకుపల్లి మండలం తుమ్మలపాలెం వాసిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం తుమ్మలపాలెం గ్రామానికి చెందిన రామచంద్రరెడ్డి 5 ఏళ్ల నుంచి తెనాలిలో నివాసం ఉంటూ కూలీ పనులు చేసుకొని జీవనం సాగిస్తున్నాడు. ఐతనగర్ కు చెందిన సంధ్యతో గత కొన్ని నెలలుగా వివాహేతర సంబంధం కొనసాగుతుంది. వీరు ఇరువురు సినిమాలకి వెళ్లి వస్తూ ఉండేవారు. ఈ క్రమంలోనే సోమవారం మద్యం సేవించి సంధ్య ఇంటి డాబాపై పడుకొన్నారు. సంధ్య చిన్న కుమార్తె జ్యోతి మరొక వ్యక్తితో కలిసి దాబాపై ఉన్న రామచంద్ర రెడ్డితో గొడవ పడి బ్లేడ్ తో మర్మాంగాలు కోసివేసింది. వెంటనే స్థానికులు స్పందించి రామచంద్ర రెడ్డి కేకలు విని అతణ్ని తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Published at : 03 May 2022 09:10 AM (IST) Tags: Bapatla News Extra marital affaire Tenali Girl news private parts Mother lover Guntur district news

సంబంధిత కథనాలు

Anantapur: సచివాలయాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ట్రైనీ జేసీ తనిఖీలు - పోలీసులు అరెస్టు చేయడంతో కి‘లేడీ’ ట్విస్ట్

Anantapur: సచివాలయాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ట్రైనీ జేసీ తనిఖీలు - పోలీసులు అరెస్టు చేయడంతో కి‘లేడీ’ ట్విస్ట్

DK SrinivaS Arrest : డ్రగ్స్ కేసులో డీకే ఆదికేశవులు కుమారుడు - బెంగళూరులో అరెస్ట్ చేసిన ఎన్సీబీ !

DK SrinivaS Arrest :  డ్రగ్స్ కేసులో డీకే ఆదికేశవులు కుమారుడు - బెంగళూరులో అరెస్ట్ చేసిన ఎన్సీబీ !

Texas Gun Fire: కాల్పులతో దద్దరిల్లిన టెక్సాస్, ప్రైమరీ స్కూల్లోకి చొరబడి విచ్చలవిడి కాల్పులు - 18 పిల్లలు, టీచర్లు మృతి

Texas Gun Fire: కాల్పులతో దద్దరిల్లిన టెక్సాస్, ప్రైమరీ స్కూల్లోకి చొరబడి విచ్చలవిడి కాల్పులు - 18 పిల్లలు, టీచర్లు మృతి

Goa News: దొంగల నయా ట్రెండ్- ఇల్లంతా దోచేసి, లవ్ లెటర్ రాసి పరార్!

Goa News: దొంగల నయా ట్రెండ్- ఇల్లంతా దోచేసి, లవ్ లెటర్ రాసి పరార్!

Hyderabad: వంట మాస్టర్‌తో మహిళ సహజీవనం, ఇంతలో గది నుంచి కంపు వాసన - తెరిచి చూసి స్థానికులు షాక్

Hyderabad: వంట మాస్టర్‌తో మహిళ సహజీవనం, ఇంతలో గది నుంచి కంపు వాసన - తెరిచి చూసి స్థానికులు షాక్
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటన అధికారిక షెడ్యూల్ ఇదే

PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటన అధికారిక షెడ్యూల్ ఇదే

World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?

World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?

Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి

Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి

Bandi Sanjay Sensational Comments: తెలంగాణలో మసీదులన్నీ తవ్వాలి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay Sensational Comments: తెలంగాణలో మసీదులన్నీ తవ్వాలి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు