Crime News: విజయనగరంలో అర్థరాత్రి అత్యాచారం- పోలీసులు విచారణలో ఆ వ్యక్తి ఎవరో తెలిసి బాధితురాలు షాక్!

విజయనగరంలో జరిగిన అత్యాచారం కేసు సంచలనంగా మారింది. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు కేసును గంటల వ్యవధిలోనే ఛేధించారు. అసలు నిందితుడిని పట్టుకున్నారు.

FOLLOW US: 

ఆంధ్రప్రదేశ్‌లో మరో అత్యాచారం కలకలం రేపుతోంది. విజయనగరంలోని ఉడా కాలనీలో ఈ దారుణం జరిగింది. ఇద్దరు పిల్లలతో ఒంటరిగా ఉంటున్న ఆమెపై కన్నేసిన దుండగుడు అర్థరాత్రి ఇంట్లోకి చొరబడి అత్యాచారం చేశాడు. 

పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన మహిళ విజయనగరానికి వలస వచ్చింది. ఓ టీ దుకాణంలో పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. సోమవారం అర్ధరాత్రి ఇంటికి వచ్చిన వ్యక్తి తలుపు కొట్టాడు. తలుపు తీసి చూస్తే దుండగుడు ఆమెపై చేయి వేయబోయాడు. ఏం జరుగుతుందో అర్థం కాక ఇంట్లోకి పరుగెత్తబోయింది. తలుపు నెట్టుకొని ఆమె వెనకాలే వెళ్లిన ఆ దుండగుడు ఆమెపై బలత్కారం చేసినట్టు తెలుస్తోంది.  

జరిగిన అన్యాయంపై లోకల్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది బాధితురాలు. గుర్తు తెలియని వ్యక్తి అర్థరాత్రి తలుపు కొట్టారని తెరిచి చూస్తే అత్యాచారం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది బాధితురాలు. ఇంట్లో ఎవరూ లేని సందర్భం చూసుకొని వ్యక్తి వచ్చినట్టు ఆమె ఆరోపించారు. ఒకే ఒక వ్యక్తి అత్యాచారానికి పాల్పడిట్టు తెలిపారు. 

బాధితురాలు చెప్పిన వివరాలతో ఎంక్వయిరీ చేసిన పోలీసుల అక్రమ సంబంధాల కోణంలో దర్యాప్తు చేశారు. బాధితురాలికి తెలిసిన వ్యక్తే అసలు నిందితుడిగా గుర్తించినట్టు విజయనగరం జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ తెలిపారు. రాత్రి టీ షాపు నుంచి ఆమెను తీసుకొచ్చి డ్రాప్ చేసిన వ్యక్తే ఈ దారుణానికి పాల్పడినట్టు వెల్లడించారు. అర్థరాత్రి టైంలో ఇంటికి వచ్చి అత్యాచారానికి పాల్పడినట్టు తేల్చారు. 

అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మిగతా వారిని పట్టుకునే పనిలో ఉన్నారు. ఇప్పటికే వాళ్లపై కూడా కేసులు రిజిస్టర్ చేశారు. ఇప్పుడు వారిని అదుపులోకి తీసుకోనున్నారు. అసలు నిందితుడు దొరికిన నేపథ్యంలో అతను ఇచ్చిన సమాచారం ఆధారంగా వారి జాడ గుర్తించే పనిలో ఉన్నారు. 

Tags: Crime News Vizianagaram news Andhra pradesh police

సంబంధిత కథనాలు

Unnatural Rape in Jail: జైలులోనే అసహజ శృంగారం, తోటి ఖైదీపై యువకుడు బలవంతంగా అత్యాచారం

Unnatural Rape in Jail: జైలులోనే అసహజ శృంగారం, తోటి ఖైదీపై యువకుడు బలవంతంగా అత్యాచారం

Satya Sai Trust: సత్యసాయి జిల్లాలో కబ్జాల పర్వం- ఉజ్వల్‌ ఫౌండేషన్ అక్రమాలపై త్రిసభ్య కమిటీ విచారణ

Satya Sai Trust: సత్యసాయి జిల్లాలో కబ్జాల పర్వం- ఉజ్వల్‌ ఫౌండేషన్ అక్రమాలపై త్రిసభ్య కమిటీ విచారణ

Vemulawada Kid Kidnap Case: గంటల వ్యవధిలో చిన్నారి కిడ్నాప్ కేసును ఛేదించిన వేములవాడ పోలీసులు, క్షేమంగా తల్లీ ఒడికి బాలుడు

Vemulawada Kid Kidnap Case: గంటల వ్యవధిలో చిన్నారి కిడ్నాప్ కేసును ఛేదించిన వేములవాడ పోలీసులు, క్షేమంగా తల్లీ ఒడికి బాలుడు

Karate Kalyani Counter : పాప తల్లిదండ్రులతో మీడియా ముందుకు కరాటే కల్యాణి - తనపై భారీ కుట్ర జరుగుతోందని ఆరోపణ !

Karate Kalyani Counter : పాప తల్లిదండ్రులతో మీడియా ముందుకు కరాటే కల్యాణి - తనపై భారీ కుట్ర జరుగుతోందని ఆరోపణ !

Digital Rape Case : డిజిటల్ రేప్ కేసులో 81 ఏళ్ల వ్యక్తి అరెస్ట్ ! అసలేంటి ఈ డిజిటల్ రేప్ ?

Digital Rape Case : డిజిటల్ రేప్ కేసులో 81 ఏళ్ల వ్యక్తి అరెస్ట్ ! అసలేంటి ఈ డిజిటల్ రేప్ ?
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Beer Sales In Hyderabad: ఎండల వేళ బీర్లతోనే ఎంజాయ్‌మెంట్! ఈ నెల అమ్మకాలు తెలిస్తే దిమ్మతిరగాల్సిందే

Beer Sales In Hyderabad: ఎండల వేళ బీర్లతోనే ఎంజాయ్‌మెంట్! ఈ నెల అమ్మకాలు తెలిస్తే దిమ్మతిరగాల్సిందే

KTR Davos Tour: నేడు స్విట్జర్లాండ్‌కు మంత్రి కేటీఆర్, 10 రోజులపాటు విదేశీ పర్యటన - షెడ్యూల్ ఇదీ

KTR Davos Tour: నేడు స్విట్జర్లాండ్‌కు మంత్రి కేటీఆర్, 10 రోజులపాటు విదేశీ పర్యటన - షెడ్యూల్ ఇదీ

Anantapuram Politics: ఉమ్మడి అనంతలో పొలిటికల్ హీట్- జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్సెస్ పల్లె రఘునాథ్

Anantapuram Politics: ఉమ్మడి అనంతలో పొలిటికల్ హీట్- జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్సెస్ పల్లె రఘునాథ్

Karate Kalyani Exclusive Interview:బిడ్డపై క్లారిటీ, ఇక ప్రాంక్ పైనే నా పోరాటం|ABP Desam

Karate Kalyani Exclusive Interview:బిడ్డపై క్లారిటీ, ఇక ప్రాంక్ పైనే నా పోరాటం|ABP Desam