అన్వేషించండి

Pahalgam Terror Attack : బాధ్యత ఉండక్కర్లా? పహల్గాం దాడి పిల్‌పై సుప్రీం కోర్టు ఆగ్రహం!

Pahalgam Terror Attack : పహల్గాం దాడిపై న్యాయవిచారణ చేపట్టాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశం పట్ల బాధ్యత లేదా అని ప్రశ్నించింది.

Pahalgam Terror Attack : పహల్గాం ఉగ్రవాద దాడికి సంబంధించి దాఖలైన పిటిషన్‌ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆ ఘటనపై  సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అధ్యక్షతన ఉన్న న్యాయ విచారణ సంఘం ద్వారా విచారించాలని పిల్‌లో  పిటిషనర్ డిమాండ్ చేశారు. కోర్టు పిటిషనర్‌ను తప్పుబట్టి బాధ్యతాయుతంగా ఉండాలని సూచించింది.

పిటిషనర్ తరఫు న్యాయవాది వాదన వినిపించే ప్రయత్నం చేసిన వెంటనే జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్ ధర్మాసనం సీరియస్‌ అయ్యారు.  న్యాయమూర్తులు ఎప్పుడు విచారణ నిపుణులు అయ్యారని జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించారు.  న్యాయ వివాదాల  పరిష్కరించడమే వాళ్ల పని అని గుర్తు చేశారు.  

జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ...  కాస్త బాధ్యతగా ఉండండి మీరు కూడా దేశం పట్ల కొంత బాధ్యత కలిగి ఉండాలి. మొత్తం దేశం ఈ విషయంలో ఏకమై ఉంది. సైనిక దళాల మనోధైర్యాన్ని కించపరిచేలాంటి మాటలు మీరు మాట్లాడకూడదు అని అన్నారు. పిటిషనర్ తన పిటిషన్లోని న్యాయవిచారణ డిమాండ్‌ను  వెనక్కి తీసుకుంటామని  చెప్పారు.  పిటిషన్‌లోని ఇతర అంశాలను పరిగణించాలని కోరారు.

ముందు మీరు పిటిషన్ దాఖలు చేసి ప్రచారం చేస్తారు, తర్వాత కోర్టులో  డిమాండ్‌పై వెనక్కి తగ్గుతామని చెబుతారా? అని జడ్జి నిలదీశారు. ఆ తర్వాత కోర్టు పిటిషన్‌లోని అన్ని డిమాండ్లను చదివింది. అందులో బాధితులకు పరిహారం అందించడం, పర్యాటకుల భద్రత వంటి డిమాండ్లు కూడా ఉన్నాయి. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదని కోర్టు అభిప్రాయపడింది.

పిటిషనర్ జమ్మూ-కశ్మీర్ వెలుపల చదువుకుంటున్న విద్యార్థుల సమస్యను లేవనెత్తాడు. అది  పిటిషన్‌లో ఎక్కడా లేదని కోర్టు తెలిపింది. విద్యార్థుల గురించి ఏదైనా చెప్పాలనుకుంటే హైకోర్టుకు వెళ్లండి అని సుప్రీంకోర్టు సూచించింది.  సుప్రీంకోర్టులో ఈ పిటిషన్‌ను ఫతేశ్ సాహూ, జునైద్ మొహమ్మద్, వికీ కుమార్ అనే పిటిషనర్లు దాఖలు చేశారు. అందులో కేంద్రం, జమ్మూ-కశ్మీర్ ప్రభుత్వంతోపాటు CRPF, NSA, NIAలను కూడా పార్టీలుగా చేర్చారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News:
"నన్ను జైల్లో అవమానించారు" కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు 
Sukhbir Singh Badal News: నాందేడ్‌లో సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై కత్తితో దాడి!  
నాందేడ్‌లో సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై కత్తితో దాడి!  
Digital India: డిజిటల్ ఇండియా మీ జీవితాన్ని ఎలా మార్చింది?
డిజిటల్ ఇండియా మీ జీవితాన్ని ఎలా మార్చింది?
Parliament Monsoon Session: లోక్‌సభ నిరవధికంగా వాయిదా!సమావేశాల చివరి రోజున అమిత్ షా రాక!
లోక్‌సభ నిరవధికంగా వాయిదా!సమావేశాల చివరి రోజున అమిత్ షా రాక!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
Embed widget