పరస్పర అంగీకారంతో మైనర్ గర్ల్ తో లైంగిక చర్యలో పాల్గొంటే 'పోక్సో' కిందకు రాదు: కలకత్తా హైకోర్టు
16 ఏళ్ల బాలికతో లైంగిక సంబంధం పెట్టుకున్నందుకు ఒక వ్యక్తిపై పోక్సో కింద కేసు నమోదైంది. కోల్‌కతా హైకోర్టు ఆ వ్యక్తిని నిర్దోషిగా విడుదల చేసింది.
మైనర్ బాలికతో ఆమె సమ్మతితో పురుషుడు లైంగిక సంబంధం పెట్టుకుంటే అది పోక్సో చట్టం కింద నేరం కాదని కోల్‌కతా హైకోర్టు తీర్పునిచ్చింది. 16 ఏళ్ల అమ్మాయికి అబ్బాయితో లైంగిక సంబంధం ఉందని తెలియదని అనుకోవడం సరికాదని తెలిపింది. ఏం చేస్తున్నామో, దాని పర్యవసానాలు ఏంటో ఆమెకు తెలుసునని కోర్టు గమనించింది.
పరస్పర అంగీకారంతో చేసిన లైంగిక చర్యలో మగవాడిని నేరస్థుడిగా పరిగణించలేమని కలకత్తా హైకోర్టు చెప్పింది. ఇద్దరు వ్యక్తుల మధ్య ఏకాభిప్రాయంతో చేసిన లైంగిక చర్య కింద పురుషుడిపై మాత్రమే అభియోగాలు మోపలేమని తెలిపింది. ఈ మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదైన వ్యక్తి శిక్షను కలకత్తా హైకోర్టు రద్దు చేసింది.
ఇద్దరు వ్యక్తులు మెచ్యురిటీతో చేసిన లైంగిక చర్యలో మగవాడికి మాత్రమే శిక్ష వేయడం సరికాదని చెప్పింది. లైంగిక చర్యలో స్వచ్ఛందంగా పాల్గొన్న అమ్మాయి అమయాకురాలు కాదని.. లైంగిక చర్య కారణంగా ఎలాంటి పరిణామాలు ఉంటాయో తెలియకుండా ఆమె ఉండదని పేర్కొంది. ఇష్టపూర్వకంగా చేసినప్పుడు మగవాడిని మాత్రమే నిందించడానికి ఎలాంటి కారణం లేదని.. జస్టిస్ సభ్యసాచి భట్టాచర్య సింగిల్ జడ్జి బెంచ్ తెలిపింది.
ఈ కేసు విచారణ సందర్భంగా, జస్టిస్ సభ్యసాచి భట్టాచార్య మాట్లాడుతూ, "ఒక వ్యక్తి మైనర్ బాలికతో ఏకాభిప్రాయంతో లైంగిక సంబంధం కలిగి ఉంటే, ఆ వ్యక్తి మాత్రమే బాధ్యత వహించలేడు." అని వ్యాఖ్యానించారు.
లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తిని దోషిగా నిర్ధారించడానికి, నిందితుడి గురించి బాధితురాలి మనస్తత్వం, మెచ్యురిటీ, గతంలోని ప్రవర్తనకు సంబంధించిన విషయాలను గమనించాలని పేర్కొంది. పిల్లల భద్రత కోసం పోక్సో చట్టాన్ని నిబంధనలకు అనుగుణంగా ఉపయోగించాలి గానీ.. వ్యక్తిని పెళ్లి చేసుకోమని.. ఒత్తిడి చేసే సాధనంగా చట్టాన్ని దుర్వినియోగం చేయోద్దని స్పష్టం చేసింది.
ఈ కేసు 22 ఏళ్ల వ్యక్తి, పదహారున్నర ఏళ్ల అమ్మాయికి సంబంధించినది. భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 376 (1) మరియు పోక్సో చట్టం సెక్షన్ 4 కింద నిందితుడిని ట్రయల్ కోర్టు దోషిగా నిర్ధారించింది. అయితే దీనిపై బాధితురాలితో తన సంబంధం గురించి నిందితుడు కలకత్తా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నేరం జరిగిన సమయంలో నిందితుడు మైనర్ అని, బాలికతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడని పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే ఆమె ఇష్టంతో లైంగిక చర్యలో పాల్గొంటే నేరంగా పరిగణించలేమని కోర్టు పేర్కొంది.
ఈ సంఘటన 2017లో జరిగింది. 22 ఏళ్ల నిందితుడు 16 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ కేసులో ఇద్దరూ ఏకాభిప్రాయంతో లైంగిక సంబంధాలు కొనసాగించారని.. పురుషుడిని మాత్రమే.. దోషిగా గుర్తించలేమని నిందితుడిని హైకోర్టు నిర్దోషిగా విడుదల చేసింది.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Also Read : Hyderabad Boy Kiss: 8 ఏళ్ల బాలికకి గట్టిగా ముద్దు పెట్టేసిన బాలుడు.. కారణం తెలిసి పోలీసుల దిమ్మతిరిగింది!
Also Read: Nalgonda: మహిళ నోరు నొక్కి ఇంట్లోకి లాక్కెళ్లి ఇద్దరు వ్యక్తులు రేప్.. తల బండకేసి బాది ఘాతుకం
Also Read: France Kidnap: ఇక్కడ పోలీసులకు చెప్పి మరీ కిడ్నాప్‌లు చేస్తారు.. కేసులు కూడా ఉండవు, 11 గంటల తర్వాత..
Also Read: Crime News: నీకు స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వాలి.. తెలివి పెంచుతానంటూ.. బాలికను గర్భవతి చేసిన మాస్టారు