![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
AIIMS: 'ఎయిమ్స్‌లో స్టూడెంట్‌గా చదవాలని ఉంది' మంగళగిరి ఆస్పత్రికి సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్, ప్రథమ స్నాతకోత్సవంలో ఆసక్తికర వ్యాఖ్యలు
Andhra News: మంగళగిరి ఎయిమ్స్‌కు సీఎం చంద్రబాబు 10 ఎకరాల భూమి ఇస్తున్నట్లు ప్రకటించారు. ఎయిమ్స్ ప్రథమ స్నాతకోత్సవంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
![AIIMS: 'ఎయిమ్స్‌లో స్టూడెంట్‌గా చదవాలని ఉంది' మంగళగిరి ఆస్పత్రికి సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్, ప్రథమ స్నాతకోత్సవంలో ఆసక్తికర వ్యాఖ్యలు cm chandrababu good news to mangalagiri AIIMS AIIMS: 'ఎయిమ్స్‌లో స్టూడెంట్‌గా చదవాలని ఉంది' మంగళగిరి ఆస్పత్రికి సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్, ప్రథమ స్నాతకోత్సవంలో ఆసక్తికర వ్యాఖ్యలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/17/dc094c5a9acf27ca61f1b38290d5b9c11734431625507876_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
CM Chandrababu Comments In Mangalagiri AIIMS Graduation Ceremony: మంగళగిరి ఎయిమ్స్‌కు సీఎం చంద్రబాబు (CM Chandrababu) గుడ్ న్యూస్ చెప్పారు. ప్రభుత్వం తరఫున వెంటనే 10 ఎకరాల భూమి ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ భూమి చాలా సుందర ప్రదేశంలో ఉందని.. రాజధాని అమరావతికి ఎయిమ్స్ (AIIMS) ఓ సిగలా ఉంటుందని అన్నారు. దేశంలో ఏ ఎయిమ్స్‌కు కూడా ఇలాంటి భూమి లేదని.. అమరావతి భారతదేశ భవిష్యత్ సిటీ అని చెప్పారు. మంగళగిరి ఎయిమ్స్ దేశంలోనే నెంబర్ 1 అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. 960 బెడ్లు, రూ.1,618 కోట్ల ఖర్చుతో మంగళగిరి ఎయిమ్స్ అభివృద్ధి జరిగిందని చెప్పారు. డాక్టర్లుగా ఎదగడానికి సాంకేతిక పరిజ్ఞానం కూడా ఉండాలన్న డైరెక్టర్ సూచన మేరకు.. AIIMS, IIT సంయుక్తంగా కొలనుకొండ వద్ద ఏర్పాటు చేయబోయే... Medtronicsకు పది ఎకరాల స్థలాన్ని కేటాయిస్తున్నామని పేర్కొన్నారు.
మంగళగిరి ఎయిమ్స్ డైరెక్టర్, మరొక 10 ఎకరాలు కావాలని అడిగారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరుపున, వెంటనే ఆ భూమి ఇస్తున్నాం. గతంలో నీటి కోసం మీరు ఇబ్బంది పడ్డారు, ఇప్పుడు మా ప్రభుత్వంలో మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మీకు పూర్తి సహకారం అందిస్తాం. మంగళగిరి ఎయిమ్స్ దేశంలోనే నంబర్ వన్… pic.twitter.com/zSRBq4GxIa
— Telugu Desam Party (@JaiTDP) December 17, 2024
మంగళగిరి ఎయిమ్స్ కి మేము ఇచ్చిన భూమి, చాలా సుందరమైన ప్రదేశంలో ఇచ్చాం. అమరావతికి, మంగళగిరి ఎయిమ్స్ ఒక సిగలా ఉంటుంది. ఈ దేశంలోనే మంగళగిరి ఎయిమ్స్ నంబర్ వన్ అవుతుందని ఆశిస్తున్నా. #ChandrababuNaidu#AndhraPradesh pic.twitter.com/RVhsiSrXlW
— Telugu Desam Party (@JaiTDP) December 17, 2024
'స్టూడెంట్‌గా చదవాలని ఉంది'
అవకాశం ఉంటే ఇక్కడ స్టూడెంట్‌గా చదవాలని ఉందంటూ సీఎం చంద్రబాబు అన్నారు. రూ.10కే వైద్యం దొరికే ప్రదేశం ఎయిమ్స్ అని.. అందుకు కావాల్సిన అన్ని మౌలిక వసతులూ సమకూరుస్తామని చెప్పారు. 'రాష్ట్రపతి ద్రౌపది ముర్మును విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలి. కష్టపడితే ఈ ప్రపంచంలో సాధించలేనిది ఏదీ లేదు అనడానికి ద్రౌపది ముర్ము జీవితం ఓ ఉదాహరణ. అవకాశం ఉంటే నాకు ఇక్కడ చదువుకోవాలని ఉంది. కొలనుకొండలో రీసెర్చ్ సెంటర్, ఐఐటీతో అనుసంధానించాలనుకుంటున్నారు. మెడికల్ అనేది ఇప్పుడు మెడ్ టెక్‌గా మారిపోయింది. డీప్ టెక్‌ను మెడికల్‌లో కూడా అమలు చేయాలనుకుంటున్నాం.' అని సీఎం చంద్రబాబు తెలిపారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి జీవితం, మనకు ఆదర్శం. సామాన్య గిరిజన కుటుంబంలో పుట్టి, టీచర్ నుంచి రాష్ట్రపతి వరకు వచ్చారు. క్రమశిక్షణ, కష్టపడే తత్త్వం ఉంటే, ఏమైనా సాధించవచ్చు. #ChandrababuNaidu #AndhraPradesh pic.twitter.com/BtA355ytj5
— Telugu Desam Party (@JaiTDP) December 17, 2024
'యువ వైద్యులు గ్రామాల్లో సేవలందించాలి'
యువ వైద్యులు గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలందించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచించారు. మంగళగిరి ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొదటి బ్యాచ్‌గా వైద్య విద్య పూర్తి చేసుకున్న 49 మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు పట్టాలు ప్రధానం చేశారు. 'వైద్య వృత్తిని ఎంచుకోవడం ద్వారా విద్యార్థులు మానవత్వంతో సేవ చేసే దారిని ఎంచుకున్నారు. ప్రజల ప్రాణాలు కాపాడి.. వారి ఆరోగ్యం మెరుగుపరిచే అమూల్యమైన అవకాశం మీకు వస్తుంది. జాతి సమ్మిళిత ఆరోగ్య సంరక్షణలో ప్రత్యేకించి మీలాంటి యువ వైద్యులు కీలక పాత్ర పోషించాలి.' అని పేర్కొన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)