
Andhra Pradesh News: తెలియక చేసిన పొరపాటు క్షమించండి- టీడీపీ అధిష్ఠానానికి, శ్రేణులకు పార్థసారథి, శిరీష రిక్వస్ట్
TDP News: నూజివీడులో కూటమి నేతలతో కలిసి జోగి రమేష్ ర్యాలీలో పాల్గొనడం పెను దుమారాన్నే రేపింది. టీడీపీ హైకమాండ్, శ్రేణులు ఆగ్రహం చవి చూసిన పార్థసారథి, శిరీష క్షమించాలని వేడుకున్నారు.

Row Over Jogi Ramesh Rally With TDP Leaders: " తెలియక జరిగిన పొరపాటు ఇది నన్ను క్షమించండి " అంటూ ఏపీ మంత్రి పార్థసారథి చంద్రబాబును వేడుకున్నారు. ఆయనతోపాటు ఎమ్మెల్యే గౌతు శిరీష కూడా అలాగే చెప్పారు. ఒక ప్రైవేట్ కార్యక్రమంలో వీరితో పాటు కలిసిపోయి వైసిపి మాజీ మంత్రి జోగి రమేష్ కూడా పాల్గొనడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. ఇలా కూటమినేతలతో కలిసినందుకు జగన్ వద్ద జోగి రమేష్‌కు చీవాట్లు పడతాయి అనుకుంటే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. టీడీపీ అధిష్టానం తమపై సీరియస్‌గా ఉందని తెలిసి ఆ కార్యక్రమంలో పాల్గొన్న కూటమి నేతలు చంద్రబాబుకు సారీ చెప్పే పనిలో పడ్డారు.
నూజివీడులో గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణతో రచ్చ
ప్రముఖ స్వాతంత్ర్య సామర యోధుడు గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ ఆదివారం నూజివీడులో జరిగింది. దీనికి ఏపీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే కొలుసు పార్థ సారథి, గౌతు శిరీష ఇతర నేతలు హాజరయ్యారు. అయితే గత కొంతకాలంగా పొలిటికల్ సైలెన్స్ పాటిస్తున్న వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ఆకస్మాత్తుగా ఈ కార్యక్రమంలో ప్రత్యక్షమయ్యారు. కూటమి నేతలతో కలిసి నూజివీడులో ర్యాలీ చేశారు.
గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లిన సందర్భంలో ఆయన్ని మర్యాద పూర్వకంగా కలిసిన అప్పటి వైసిపి ఎంపీలు బాలశౌరి లాంటి వాళ్లపై జగన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. అందుకే వాళ్ళు పార్టీ వదిలి వెళ్లిపోయారని జనసేన నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇప్పుడు అదే కోవలో కూటమి నేతలతో కలిసి ర్యాలీలో పాల్గొన్న జోగి రమేష్‌కి కూడా జగన్ నుంచి క్లాస్ తప్పదని అందరూ భావిస్తే ఆ సీన్ కూటమి శిబిరానికి షిఫ్ట్ అయింది.
Also Read: టీడీపీ నేత హత్యకు కుట్ర- బిహార్ గ్యాంగ్‌కు సుపారీ- శ్రీకాకుళం జిల్లా పలాసలో సంచలనం
టీడీపీ అధిష్టానానికి కోపం రావడానికి కారణం ఇదే
సాధారణంగా ఒక పార్టీ నేతల కార్యక్రమానికి అపొజిషన్ పార్టీ నేతలు కూడా హాజరు కావడంలో వింత లేదు. కానీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటిపైకి దాడికి ప్రయత్నించిన వ్యక్తితోనే తిరగడం సంచలనంగా మారింది. జోగి రమేష్‌ను ఎలా తిప్పుకుంటారని మంత్రి పార్థసారథి, గౌతు శిరీషపై టిడిపి కార్యకర్తలు, చంద్రబాబు అభిమానుల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని టిడిపి హై కమాండ్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.
చంద్రబాబూ...క్షమించండి!
అధిష్టానం ఆగ్రహాన్ని పసిగట్టిన మంత్రి కొలుసు పార్థసారథి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సారీ చెప్పారు. అది పార్టీ పరమైన కార్యక్రమం కాదనీ గౌడ సంఘం పెట్టుకున్న కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాత్రమే హాజరయ్యానని పేర్కొన్నారు. తాను వెళ్లేసరికి జోగి రమేష్ అక్కడ ఉన్నారని దీనివల్ల టిడిపి అభిమానుల మనోభావాలు దెబ్బతిని ఉంటే సారీ చెప్తున్నాను అని మంత్రి సంజయిషీ ఇచ్చుకున్నారు. తనకు చంద్రబాబు లోకేష్ ఎంతో గౌరవం ఇస్తున్నారని వారి విధానాలకు పార్టీకి నష్టం చేకూర్చే పనులు చేయనని అన్నారు. తనను మన్నించమని చంద్రబాబును కూడా కోరారు.
సర్దార్ గౌతు లచ్చన్న మానవరాలిగా ఉమ్మడి కృష్ణా జిల్లా గౌడ సంఘం ఆహ్వానం మేరకే నూజివీడు వెళ్లానంటున్నారు శిరీష. జోగి రమేష్ అక్కడకు వస్తున్న విషయం ఏమాత్రం తెలియదని అన్నారు. తమ కుటుంబం టిడిపితోనే ఎప్పటికీ కలిసి ఉంటుందని తెలిపారు. తెలియక జరిగిన పొరబాటుపై సొంత పార్టీ నేతలే సోషల్ మీడియాలో విమర్శిస్తుంటే బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై ఏ కార్యక్రమానికి వెళ్లిన పూర్తి వివరాలు తెలుసుకునే వెళతానని పార్టీ కార్యకర్తలకు ఆమె మాటిచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ టిడిపికి నష్టం చేకూర్చే పనులు తాను చేయనని గౌతు శిరీష చెప్పుకొచ్చారు.
టీడీపీ నిర్వహించిన సభకు జోగి రమేష్ రావడంపై నారా లోకేష్ టీడీపీ వాళ్ళకి సీరియస్ అయ్యాడు అంటా...
— Anitha Reddy (@Anithareddyatp) December 16, 2024
ఆ నేపథ్యంలో పలాస ఎమ్మెల్యే గౌరు శిరీష వివరణ
పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష నిన్న నూజివీడు లో గౌతు లచ్చన్న గారి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా జోగి రమేష్ రావడం...జరిగిన సంఘటన మీద వివరణ ఇస్తూ… pic.twitter.com/3N5GaFZY62
Also Read: నేడే లోక్‌సభ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు-ఈ లెక్కల చిక్కుముళ్లను కేంద్రం ఎలా విప్పుతుంది?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

