Social Media Fire: మూడో టెస్టులో సంబరాలెందుకు ? గంభీర్ హయాంలో పతనవస్థకు టీమిండియా! ఫ్యాన్స్ ఫైర్
Ind Vs Aus 3rd Test: బ్యాటింగ్ వైఫల్యంతో కొట్టుమిట్టాడుతున్న భారతజట్టును వర్షం ఆదుకుందని, ఇక ఫాలో ఆన్ తప్పడంపై ఆటగాళ్లు సంబరాలు చేసుకోవడం ఏంటని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫైరవుతున్నారు.
Brisbane Test: భారత జట్టు దుస్థితిపై అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఏకేస్తున్నారు. బోర్డర్ -గావస్కర్ ట్రోఫీ లో ఆధిపత్యం ప్రదర్శించి గత నాలుగు సిరీస్ లు గెలిచి టీమిండియా.. బ్రిస్బేన్ టెస్టులో ఫాలో ఆన్ తప్పించుకోవడంతో ఆటగాళ్ల సంభరాలను చూసి అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ముఖ్యంగా ఆసీస్ ప్లేయర్లు అలవోకగా సెంచరీలు సాధించిన పిచ్ మీద భారత మేటి బ్యాటర్లు విఫలం కావడం, టెయిలెండర్లు అది కూడా నం.10, 11వ బ్యాటర్ల అండంతో ఫాలో ఆన్ తప్పించుకోవడం చూసి అభిమానుల మనస్సు చివుక్కుమంటోంది. భారత ఆటగాళ్ల సంభరాలపై సోషల్ మీడియాలో వ్యంగ్య పోస్టులతో రెచ్చిపోతున్నారు.
గంభీర్, కోహ్లీలపై కోపం..
ముఖ్యంగా మూడోటెస్టులో 246 పరుగుల ఫాలో ఆన్ మార్కు దాటడానికి భారత్ నానా తంటాలు పడింది. ఒక దశలో 213 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి ఫాలో ఆన్ అంచున నిలబడింది. ఈ దశలో భారత పేసర్లు జస్ఫ్రీత్ బుమ్రా (10 బ్యాటింగ్), ఆకాశ్ దీప్ (27 బ్యాటింగ్) అబేధ్యమైన పదో వికెట్కు 39 పరుగులు జోడించి జట్టు పరువును కాపాడారు. ముఖ్యంగా ఫాలో ఆన్ తప్పించడానికి మూడు పరుగులు అవసరమైనప్పుడు ఆసీస్ సారథి కమిన్స్ బౌలింగ్ లో స్లిప్పులో బౌండరీ కొట్టి ఆకాశ్ దీప్ సత్తాచాటాడు. ఈ బౌండరీతో గండం గట్టెక్కడంతో కోహ్లీ, గంభీర్ చాలా ఉద్వేగంగా సంబరాలు చేసుకున్నారు. అలాగే ఆకాశ్ దీప్ సిక్సర్ కొట్టినప్పుడు డ్రెస్సింగ్ రూం అద్దం ముందుకు వచ్చి కోహ్లీ చూడటాన్ని కూడా ఫ్యాన్స్ తప్పుపడుతున్నారు. బ్యాటర్లు చక్కగా ఆడినట్లయితే ఇలాంటి గతి పట్టేది కాదు కదా అని విమర్శిస్తున్నారు. ఇక గంభీర్ కోచింగ్ లోనే భారత జట్టు బీజీటీలో చాలా పతనమైన దశకు చేరుకుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
besharam saare 😭😭😭😭 pic.twitter.com/t3EPkAzq5O
— Pr𝕏tham (@Prxtham_18) December 17, 2024
Also Read: Rohit Sharma Retirement: టెస్టుల నుంచి రోహిత్ శర్మ రిటైర్మెంట్? డగౌట్ ముందు గ్లౌస్‌లతో సంకేతాలు!
Gambhir set the bar so low that the winners of last 4 BGT are celebrating the avoidance of a Follow-on 💀pic.twitter.com/ANJiHODLGq
— Dinda Academy (@academy_dinda) December 17, 2024
ఆదుకున్న రాహుల్, జడేజా
మరోవైపు నాలుగో రోజు ఓవర్ నైట్ స్కోరు 51/4తో బ్యాటింగ్ కొనసాగించిన భారత్ ఆట ముగిసే సమయానకి 75.4 ఓవర్లలో 9 వికెట్లకు 252 పరుగులు చేసింది. ప్రత్యర్థి కంటే ప్రస్తుతం 193 పరుగుల వెనుకంజలో ఉంది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (139 బంతుల్లో 84, 8 ఫోర్లు) కొద్దిలో శతకం కోల్పోయాడు. వెటరన్ రవీంద్ర జడేజా (123 బంతుల్లో 77, 7 ఫోర్లు, ఓ సిక్సర్) తన విలువేంటో మరోసారి చాటాడు. జట్టులోకి తనను ఎందుకు తీసుకున్నారన్న ప్రశ్నలకు బ్యాట్ తో సమాధానమిచ్చాడు. ఇక షరా మాములుగానే కెప్టెన్ రోహిత్ శర్మ (10) మరసారి విఫలమవగా, తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి (16) జడేజాకు చక్కని సహకారం అందించాడు.
నిజానికి ఆట ప్రారంభమైన తొలి బంతికే స్లిప్పులో రాహుల్ క్యాచ్ ఇవ్వగా, దాన్ని స్మిత్ నేలపాలు చేశాడు. దీంతో జాగ్రత్తగా ఆడిన రాహుల్. జడేజాతో ఆరో వికెట్ కు 67 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. ఈ క్రమంలో ఫిఫ్టీ చేసుకుని శతకం దిశగా సాగాడు. అయితే లయోన్ బౌలింగ్ లో కట్ షాట్ కు ప్రయత్నించగా, స్మిత్ కళ్లు చెదిరే క్యాచ్ ను స్లిప్పులో అందుకోవడంతో తను పెవిలియన్ కు చేరాడు. ఆ తర్వాత జడేజా- నితీశ్ జోడీ ఏడో వికెట్కు 53 పరుగులు జోడించారు. ఇక చివర్లో బుమ్రా, ఆకాశదీప్ జంట కీలక పార్ట్నర్ షిప్ తో జట్టుకు ఫాలో ఆన్ గండాన్ని తప్పించారు. ఇక ఆటలో రేపు ఒక్కరోజే మిగిలి ఉండటం, రేపు కూడా వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉండటంతో మ్యాచ్ డ్రా అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. బౌలర్లలో కమిన్స్ కు నాలుగు, స్టార్క్ కు రెండు వికెట్లు దక్కాయి.
nah they're shameless 😭 pic.twitter.com/6MuxGWKsKP
— palak (@loftedovercover) December 17, 2024
Also Read: Virat Kohli: కోహ్లీని మందలించిన గవాస్కర్.. ఆ బలహీనత అధిగమించాలంటూ క్లాస్