News
News
X

Nalgonda: మహిళ నోరు నొక్కి ఇంట్లోకి లాక్కెళ్లి ఇద్దరు వ్యక్తులు రేప్.. తల బండకేసి బాది ఘాతుకం

నల్గొండ గ్రామీణ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నల్గొండ మండలంలో ఓ వివాహితపై ఇద్దరు అత్యాచారానికి పాల్పడి.. ఆపై ఆమె తల నేలకేసి కొట్టి హతమార్చారు.

FOLLOW US: 

హైదరాబాద్ ఆరేళ్ల బాలికపై జరిగిన అత్యాచారం హత్య ఘటన మరవకముందే నల్గొండ జిల్లాలో అలాంటిదే మరో ఘటన జరిగింది. ఓ వివాహితపై రాక్షసుల్లా పడి కోరిక తీర్చుకున్న ఇద్దరు కామాంధులు చివరికి ఆమెను చిత్రవధ చేశారు. తలను బండకేసి బాది హతమార్చారు. ఈ ఘటన నల్గొండ జిల్లాలో బుధవారం జరగ్గా స్థానికంగా కలకలం రేపింది. వివరాలివీ..

నల్గొండ గ్రామీణ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నల్గొండ మండలంలో ఓ వివాహితపై ఇద్దరు అత్యాచారానికి పాల్పడి.. ఆపై ఆమె తల నేలకేసి కొట్టి హతమార్చారు. మద్యం మత్తులో ఈ దారుణం జరిగిందని పోలీసులు వెల్లడించారు. అంతేకాక, ఈ పైశాచికత్వానికి పాల్పడిన నిందితులు ఇద్దరిలో ఒకరు.. భార్యను హత్య చేసిన కేసులో నిందితుడు.. కాగా మరోవ్యక్తి భార్యతో గొడవపడి ఒంటరిగా ఉంటున్నాడు. 

Also Read: Sangareddy Crime: మటన్ ముక్కలు వేయలేదని చంపేశాడు.. సంగారెడ్డిలో దారుణం..

నల్గొండ మండలంలోని ఓ గ్రామానికి చెందిన 54 ఏళ్ల మహిళ తన గ్రామంలోనే కిరాణా దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తోంది. ఆ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారు ఇద్దరికీ వివాహమైంది. ఆమె బుధవారం మధ్యాహ్నం ఇంటి నుంచి దుకాణానికి నడుచుకుంటూ వెళ్తుండగా అదే గ్రామానికి చెందిన బక్కతట్ల లింగయ్య, అతడి స్నేహితుడు కుమ్మరి పుల్లయ్య ఆమెను అడ్డగించారు. నోరు నొక్కి లింగయ్య అనే వ్యక్తి ఇంట్లోకి లాక్కొని వెళ్లారు. వెంటనే ఆమెను వివస్త్రను చేశారు. దాడి చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. 

Also Read: YSRCP Worker Rape: వైఎస్‌ఆర్‌సీపీ నేత దాష్టీకం.. దివ్యాంగురాలిపై అత్యాచారం

ఆ తర్వాత తలను నేలకేసి కొట్టారు.. పిడిగుద్దులు గుద్దారు. దీంతో ఆమె చనిపోయింది. అనంతరం మెడలోని బంగారు గొలుసు, గాజులు, చెవి కమ్మలు తీసుకుని పారిపోయేందుకు ప్రయత్నించారు. చప్పుడును గుర్తించిన స్థానికులు అక్కడికి వచ్చి వారిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. నిందితులిద్దరూ 40 ఏళ్ల లోపు వారు. వినాయక నిమజ్జనం జరిగిన ఆదివారం నుంచి మద్యం తాగి గ్రామంలో జులాయిగా తిరుగుతున్నారని గ్రామస్థులు పోలీసులకు వివరించారు. రెండేళ్ల నుంచి కాపురంలో గొడవలు రావడంతో లింగయ్య భార్య కొంత కాలంగా పుట్టింట్లో ఉంటున్నారు. కుమ్మరి పుల్లయ్య.. భార్యను ఏడేళ్ల క్రితం హత్య చేసి నెల రోజుల పాటు జైలుకు కూడా వచ్చాడు. అయితే, మహిళపై ఇంత దారుణంగా వ్యవహరించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read: Crime News: నీకు స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వాలి.. తెలివి పెంచుతానంటూ.. బాలికను గర్భవతి చేసిన మాస్టారు

Also Read: France Kidnap: ఇక్కడ పోలీసులకు చెప్పి మరీ కిడ్నాప్‌లు చేస్తారు.. కేసులు కూడా ఉండవు, 11 గంటల తర్వాత..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి.

Published at : 23 Sep 2021 11:00 AM (IST) Tags: Two Men Rapes Woman Nalgonda Woman Rape Woman Death in Nalgonda Nalgonda Crime News

సంబంధిత కథనాలు

Kondapur News : వైద్యుల నిర్లక్ష్యంతో బాత్ రూమ్ లో శిశువు జననం, పుట్టిన పది నిమిషాలకే!

Kondapur News : వైద్యుల నిర్లక్ష్యంతో బాత్ రూమ్ లో శిశువు జననం, పుట్టిన పది నిమిషాలకే!

Vizag News: తల్లికి నవ్వుతూ బై చెప్పి గదిలోకెళ్లిన కొడుకు, నిమిషాల్లోనే ఊహించని ఘటన

Vizag News: తల్లికి నవ్వుతూ బై చెప్పి గదిలోకెళ్లిన కొడుకు, నిమిషాల్లోనే ఊహించని ఘటన

చైనా, పాకిస్థాన్ నుంచి నడిపిస్తున్న వ్యాపారం- లోన్‌ యాప్‌ కేసుల్లో కొత్త కోణం

చైనా, పాకిస్థాన్ నుంచి నడిపిస్తున్న వ్యాపారం- లోన్‌ యాప్‌ కేసుల్లో కొత్త కోణం

పుట్టిన రోజునాడు ప్రాణం తీసిన ఈత సరదా, ముగ్గురు విద్యార్థులు మృతి

పుట్టిన రోజునాడు ప్రాణం తీసిన ఈత సరదా, ముగ్గురు విద్యార్థులు మృతి

Nandyal News: వాటర్ ఫాల్స్ చూసేందుకు వెళ్లి విద్యార్థి మృతి, కాలుజారడం వల్లే!

Nandyal News: వాటర్ ఫాల్స్ చూసేందుకు వెళ్లి విద్యార్థి మృతి, కాలుజారడం వల్లే!

టాప్ స్టోరీస్

Minister Botsa : వైజాగ్ లో సీఎం అధికారిక నివాసం కడతాం, తప్పేంటి?- మంత్రి బొత్స

Minister Botsa  : వైజాగ్ లో సీఎం అధికారిక నివాసం కడతాం, తప్పేంటి?- మంత్రి బొత్స

YS Sharmila : వైఎస్ఆర్ బతికుంటే కాంగ్రెస్ పార్టీపై ఉమ్మేసేవారు, వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

YS Sharmila : వైఎస్ఆర్ బతికుంటే కాంగ్రెస్ పార్టీపై ఉమ్మేసేవారు, వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

Ponniyin Selvan Twitter Review : ఫ‌స్టాఫ్ డీసెంట్‌గా ఉంది! మ‌రి, సెకండాఫ్‌? మ‌ణిర‌త్నం సినిమాపై ఆడియ‌న్స్ రియాక్ష‌న్‌...

Ponniyin Selvan Twitter Review : ఫ‌స్టాఫ్ డీసెంట్‌గా ఉంది! మ‌రి, సెకండాఫ్‌? మ‌ణిర‌త్నం సినిమాపై ఆడియ‌న్స్ రియాక్ష‌న్‌...

Weather Latest Update: ఈ జిల్లాలవారికి హెచ్చరిక! నేడు భారీ-అతిభారీ వర్షాలు, పిడుగులూ పడే ఛాన్స్

Weather Latest Update: ఈ జిల్లాలవారికి హెచ్చరిక! నేడు భారీ-అతిభారీ వర్షాలు, పిడుగులూ పడే ఛాన్స్