Crime News: నీకు స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వాలి.. తెలివి పెంచుతానంటూ.. బాలికను గర్భవతి చేసిన మాస్టారు
తన దగ్గర పాఠాలు నేర్చుకునే విద్యార్థినిని గర్భవతి చేశాడు ఓ ట్యూషన్ టీచర్. ఆ బాలికకు తెలివి పెరిగేలా చేస్తానని.. చెప్పి లోబర్చుకున్నాడు.
మంచి మాటలు చెప్పాల్సిన టీచరే.. చెడు పనులు చేశాడు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే నీచంగా ప్రవర్తించాడు.. కామంతో కళ్లు మూసుకుపోయి 16 ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పాడు. విద్యార్థిని గర్భవతిని చేశాడు. ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
విజయనగరం జిల్లా గంట్యాడ మండలానికి చెందిన పదోతరగతి విద్యార్థిని (16) మూడేళ్ల నుంచి ఓ ట్యూషన్ సెంటర్‌కు వెళుతోంది. ఆ అమ్మాయిపై ఆ ట్యూషన్ మాస్టారు కన్నేశాడు. ప్రతిరోజు ఆ బాలికకు ఏవేవో మాయమాటలు చెప్పేవాడు. ట్యూషన అయిపోయి.. మిగిలిన విద్యార్థులు వెళ్లేవరకు వెయిట్ చేసేవాడు. ఆ తర్వాత బాలికను మెల్లగా మాటలతో మాయ చేసేవాడు. ఆ బాలికను పాఠాలు చెబుతానని ఉండమని చెప్పేవాడు.
నీకు తెలివి లేదు.. మేధాశక్తి పెంచుతాను. అందుకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి.. ఇవ్వాలి అంటు ఏదో ఏదో చెప్పేవాడు. అలా మాటలతో బాలికను లోబర్చుకున్నాడు. తనకు జరిగిన అన్యాయాన్ని ఎవరికీ చెప్పుకోలేక.. సైలెంట్ గా ఉండిపోయింది బాలిక. అయితే కొద్దిరోజులుగా బాలిక ఆరోగ్య పరిస్థితి సరిగా లేదు. ఈ విషయాన్ని తల్లి గమనిస్తూనే ఉంది. కొన్ని రోజుల నుంచి తిండి కూడా సరిగా తినడం లేదు. ఈ క్రమంలో బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే బాలిక గర్భవతి అని.. ప్రస్తుతం ఎనిమిదో నెల అని వైద్యులు చెప్పారు. వెంటనే బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసినట్టు చెప్పారు.
అయితే ట్యూషన్ మాష్టారుకు గతంలోనే పెళ్లయిపోయింది. ఉద్యోగం రాకపోవడంతో ట్యూషన్లు చెబుతున్నట్టు తెలిసింది. ఈ క్రమంలోనే బాలికకు మాయ మాటలు చెప్పి.. గర్భవతిని చెసినట్టు పోలీసులు తెలిపారు.
Also Read: YSRCP Worker Rape: వైఎస్‌ఆర్‌సీపీ నేత దాష్టీకం.. దివ్యాంగురాలిపై అత్యాచారం
Also Read: ఇక్కడ పోలీసులకు చెప్పి మరీ కిడ్నాప్‌లు చేస్తారు.. కేసులు కూడా ఉండవు, 11 గంటల తర్వాత..