Nellore Force Suicide : ఆత్మహత్యకు ప్రేరేపించి ప్రాణం పోయే వరకూ వీడియో తీసిన భర్త ! ఈ నెల్లూరు సైకో భర్త అచ్చంగా రాక్షసుడే...
భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త ఆమెను ఆత్మహత్యకు ప్రోత్సహించాడు. తన నిజాయితీకి పరీక్ష పెడుతున్నాడేమో అనుకున్న ఆ భార్య నిజంగానే ఆత్మహత్య చేసుకుంది. కాపాడతాడని అనుకుందేమో కానీ ఆ సైకోకు ఆ ఆలోచన లేదు.
ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తే ఎవరైనా అడ్డుకుంటారు.. కానీ "చేసుకో చేసుకో" అని ప్రోత్సహిస్తూ దాన్ని సెల్‌ఫోన్‌లో షూట్ చేస్తూ ఉండేవాళ్లను ఏమంటారు?. మాటల్లో వర్ణించలేని సైకో అని చెప్పక తప్పదు. ఇలాంటి ఓ సైకో నెల్లూరులో ఉన్నాడు. తన భార్య ఫ్యాన్‌కు ఉరి వేసుకునేందుకు సిద్ధమైతే ప్రోత్సహించాడు. ఆమె చివరి శ్వాస విడిచే వరకూ అలా వీడియో తీస్తూనే ఉన్నారు. ఆమె కొన ఊపిరితో గిలగిల కొట్టుకుంటూ ఉంటే అలా చూస్తూనే ఉండిపోయాడు. ప్రాణం పోయాక తీరిగ్గా బంధువులకు ఫోన్ చేసి తన భార్య ఆత్మహత్య చేసుకుందని సమాచారం పంపాడు.
Also Read : నార్కో టెస్టులకు కోర్టు నో ! ఆయేషా మీరా కేసులో సీబీఐకి కోర్టు షాక్ !
నెల్లూరు జిల్లా ఆత్మకూరు మెప్మాలో రిసోర్స్ పర్సన్‌గా కొండమ్మ పని చేస్తోంది. ఆమె భర్త పెంచలయ్య. పనీ పాటా లేకుండా తిరిగే పెంచలయ్య భార్య కొండమ్మపై అనుమానం పెంచుకుని పదే పదే వేధించేవాడు. ఆ వేధింపులు తట్టుకోలేక తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. తనపై కొంచెమైన తన భర్తకు ప్రేమ లేకుండా ఉంటుందా.. అడ్డుకుంటాడు అని ఆమె అనుకుంది. కానీ పెంచలయ్యలో బయటకు కనిపించని ఎంత మృగం ఉందో.. ఇన్నేళ్ల సంసారంలో ఆమె గుర్తించలేకపోయింది.
Also Read : ఎగ్ దోశకు డబ్బు ఇవ్వలేదని బీటెక్ విద్యార్థి ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన
ఆమె ఫ్యాన్‌కు చీర కట్టుకున్నప్పటి నుండి ఫోన్‌లో వీడియో తీస్తూ పెంచలయ్య పైశాచిక ఆనందాన్ని పొందాడు. ఆమె ఫ్యాన్‌కు వేలాడుతూ .. గిలగిలా కొట్టుకుంటున్న సమయంలోనూ పెంచలయ్యలో కదలిక రాలేదు. రెండు నిమిషాల పాటు అలా కొండమ్మ ఉరికి వేలాడుతూనే ఉంది. కాలికి ఏమైనా ఆసరా దొరుకుందేమో ప్రాణాలు కాపాడుకుందామనుకుంది. కానీ అప్పటికే ఆమె మెడకు చీర బిగుసుకుపోయింది. తన భర్త ప్రాణాలు కాపాడతాడేమోనని కొన ఊపిరి వరకూ ఆ ప్రాణం చూసే ఉంటుంది. కానీ అనుమాన పిశాచం పట్టేసిన ఆ భర్త ఆనందంతో ఉప్పొంగిపోతూ చివరి శ్వాస వరకూ వీడియో తీశాడు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే కదిలాడు.
Also Read : భర్త ప్రైవేట్ పార్ట్స్ కోసేసిన భార్య, ఆ వెంటనే ఇంకో ఘాతుకం.. కారణం ఏంటంటే..
ఆమె ఆత్మహత్య చేసుకుందని.. తన మీదకు ఏం రాదని అనుకున్నాడేమో కానీ ఆ వీడియోను కొండమ్మ భార్య తమ్ముడికి బంధువులకు పంపాడు. కొండమ్మ ఆత్మహత్య చేసుకుందని ప్రచారం చేశాడు. అయితే ఆ వీడియోలో చాలా స్పష్టంగా పెంచలయ్య సైకోతత్వం బయటపడటంతో ఆయనపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్న ఆ వీడియో చూసి పోలీసులే షాక్ అయ్యారు. మనిషిలో ఇంత వికృతం ఉంటుందా అని ఆశ్చర్యపోయారు.
Also Read : రహస్యంగా ప్రేమ పెళ్లి.. భారీ ట్విస్ట్ ఇచ్చిన ఫ్యామిలీ, అసలు సంగతి తెలిసి అఘాయిత్యం