News
News
X

Ayesha Meera : నార్కో టెస్టులకు కోర్టు నో ! ఆయేషా మీరా కేసులో సీబీఐకి కోర్టు షాక్ !

అయేషా మీరా కేసులో అనుమానితుడు కోనేరు సతీష్ తో పాటు కొంత మందికి నార్కో టెస్టులు చేయాలన్న సీబీఐ పిటిషన్‌ను విజయవాడ కోర్టు కొట్టి వేసింది.

FOLLOW US: 

ఆయేషా మీరా కేసులో అనుమానితులకు నార్కో పరీక్షలు నిర్వహించాలన్న సీబీఐ ప్రయత్నాలు విఫలమయ్యాయి. సీబీఐ వేసిన పిటిషన్‌ను విజయవాడ కోర్టు కొట్టి వేసింది. ఆయేషా మీరా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కోనేరు సతీష్‌ తో పాటు  హాస్టల్లో ఆయేషా మీరాతో ఉన్న స్నేహితురాళ్ల సమాచారం కీలకమని, వారికి నార్కో అనాలసిస్‌ పరీక్షలు అవసరమని సీబీఐ పిటిషన్‌లో పేర్కొంది. వాదనలు విన్న న్యాయస్థానం సీబీఐ పిటిషన్‌ను కొట్టేసింది.Also Read : ఎగ్ దోశకు డబ్బు ఇవ్వలేదని బీటెక్ విద్యార్థి ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన
 
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో 2007 డిసెంబరు 27న విద్యార్థిని ఆయేషా మీరా హత్యకు గురయింది. తెనాలికి చెందిన ఆయేషా మీరా అనే విద్యార్థిని విజయవాడలో ఉంటూ చదువుకునేది. సెలవులకు ఇంటికి వెళ్లిన రోజే ఆమె దారుణహక్యకు గురైంది.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ఘటన చోటు చ ేసుకుంది. రాజకీయంగా కూడా సంచలనం అయింది. దర్యాప్తు జరిపిన పోలీసులు సత్యం బాబు అనే పాత నేరస్తుడు ఈ హత్యకు పాల్పడ్డారని నిర్ధారించారు. కోర్టులో సాక్ష్యాధారాలు సమర్పించారు. విజయవాడలోని మహిళల ప్రత్యేక న్యాయస్థానం సత్యంబాబుకు పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.Also Read : వాళ్లిద్దరు ఎవరు ? వివేకా హత్య కేసులో టీవీ చానళ్లకు సీబీఐ నోటీసులు !

విజయవాడలోని మహిళల ప్రత్యేక న్యాయస్థానం  తీర్పుపై సత్యంబాబు హైకోర్టును ఆశ్రయించారు. ఈ తీర్పును  హైకోర్టు కొట్టి వేసింది. సత్యంబాబును నిర్దోషిగా ప్రకటించింది. కేసును మళ్లీ దర్యాప్తు చేయాలని సీఐడిని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ సీఐడీకి కొత్తగా ఎలాంటి ఆధారాలు దొరకలేదు. పైగా విజయవాడ మహిళా న్యాయస్థానంలో ఉండాల్సిన ఫైళ్లు కూడా కనిపించకుండా పోయాయి. సీఐడీ పోలీసులు సరిగ్గా విచారణ చేయడం లేదని భావించిన హైకోర్టు  సీబీఐని విచారించాలని 2018 నవంబర్‌లో ఆదేశించింది. అప్పట్నుంచి సీబీఐ విచారణ కొనసాగుతోంది. అయితే ఈ కేసులో నిందితులెవరో సీబీఐ ఇంత వరకూ కనిపెట్టలేకపోయింది.   సీబీఐ అధికారులు 2019 డిసెంబర్‌లో ఆయేషా మీరా మృతదేహానికి రెండోసారి పోస్టుమార్టం నిర్వహించారు. కానీ ఎలాంటి ఆధారాలను కనిపెట్టలేకపోయారు. Also Read : భర్త ప్రైవేట్ పార్ట్స్ కోసేసిన భార్య, ఆ వెంటనే ఇంకో ఘాతుకం.. కారణం ఏంటంటే..

అప్పట్లో ఆయేషా మీరా కేసు విషయంలో ప్రధానంగా రాజకీయ ఆరోపణలు అప్పటి మంత్రి కోనేరు రంగారావు మనవడు కోనేరు సతీష్‌పై వచ్చాయి. ఆయన తనకు ఏ సంబంధం లేదని ఎలాంటి విచారణ అయినా చేయించుకోవాలని సవాల్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు సీబీఐ అధికారులు కూడా ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు సేకరించలేకపోయారేమో కానీ చివరి ప్రయత్నంగా నార్కో అనాలసిస్ టెస్టులకు ప్రయత్నించారు. అయితే నార్కో పరీక్షలు చేయాలంటే ఏకపక్షంగా కుదరదు. వారు ఒప్పుకుంటేనే చేయాల్సి ఉంటుంది. కోనేరు సతీష్.. ఆయేషా మీరా స్నేహితులు అందుకు ఒప్పుకోలేదని అందుకే కోర్టు సీబీఐ పిటిషన్‌ను కొట్టి వేసినట్లుగా అంచనా వేస్తున్నారు.  

Also Read : రహస్యంగా ప్రేమ పెళ్లి.. భారీ ట్విస్ట్ ఇచ్చిన ఫ్యామిలీ, అసలు సంగతి తెలిసి అఘాయిత్యం

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 22 Sep 2021 05:14 PM (IST) Tags: ayesha meera ayesha murder case ayesha cbi cbi narco koneru satish

సంబంధిత కథనాలు

NTR District News : ఎన్టీఆర్ జిల్లాలో విషాదం, చిన్నారి ప్రాణం తీసిన ఉయ్యాల!

NTR District News : ఎన్టీఆర్ జిల్లాలో విషాదం, చిన్నారి ప్రాణం తీసిన ఉయ్యాల!

Visakha YCP Leaders: విశాఖను రాజధాని చేసేందుకు ఎలాంటి ఉద్యమానికైనా సిద్ధం- ఉత్తరాంధ్ర నాయకులు

Visakha YCP Leaders: విశాఖను రాజధాని చేసేందుకు ఎలాంటి ఉద్యమానికైనా సిద్ధం- ఉత్తరాంధ్ర నాయకులు

AP Crime News: అమ్మను ఎలా చంపాడో తాతాకు చెప్పిన మూడేళ్ల చిన్నారి, కేసులో కీలక మలుపు!

AP Crime News: అమ్మను ఎలా చంపాడో తాతాకు చెప్పిన మూడేళ్ల చిన్నారి, కేసులో కీలక మలుపు!

Loan Apps Cheating : రాజమండ్రి నుంచి గుజరాత్ వరకూ, లోన్ యాప్ నెట్ వర్క్ ను ఛేదించిన పోలీసులు!

Loan Apps Cheating : రాజమండ్రి నుంచి గుజరాత్ వరకూ, లోన్ యాప్ నెట్ వర్క్ ను ఛేదించిన పోలీసులు!

Nellore News : పవన్ వెంటే మెగా ఫ్యాన్స్, నెల్లూరు మెగా గర్జనలో కీలక నిర్ణయం

Nellore News : పవన్ వెంటే మెగా ఫ్యాన్స్, నెల్లూరు మెగా గర్జనలో కీలక నిర్ణయం

టాప్ స్టోరీస్

Etela Rajender : చిగురుమామిడి పాఠశాలలో కులాల వారీగా అటెండెన్స్, స్కూల్లో దొరతనం ఏంటని ఈటల రాజేందర్ ఫైర్

Etela Rajender : చిగురుమామిడి పాఠశాలలో కులాల వారీగా అటెండెన్స్, స్కూల్లో దొరతనం ఏంటని ఈటల రాజేందర్ ఫైర్

Minister Prashanth: రూ. 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే సర్కార్ కాదు - మంత్రి వేముల

Minister Prashanth: రూ. 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే సర్కార్ కాదు - మంత్రి వేముల

Bigg Boss 6 Telugu: ఇంట్లో ఎవరు గాడిద? ఎవరు పాము? ఎవరు ఊసరవెల్లి? ఇదిగో మీరే చూడండి

Bigg Boss 6 Telugu: ఇంట్లో ఎవరు గాడిద? ఎవరు పాము? ఎవరు ఊసరవెల్లి? ఇదిగో మీరే చూడండి

Ponniyin Selvan: 'పొన్నియిన్ సెల్వన్' - అక్కడ మోత మోగిస్తుందిగా!

Ponniyin Selvan: 'పొన్నియిన్ సెల్వన్' - అక్కడ మోత మోగిస్తుందిగా!