అన్వేషించండి

Chittoor: ఎగ్ దోశకు డబ్బు ఇవ్వలేదని బీటెక్ విద్యార్థి ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన

కోడి గుడ్డు దోశకు డబ్బులు ఇవ్వలేదనే కారణంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. తలారివారిపల్లికి చెందిన సాయి కిరణ్ బలవన్మరణానికి పాల్పడ్డాడు.

మనిషి చావుకు కారణాలు అనేకం ఉంటాయి. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు వంటి పలు కారణాలతో జీవితంపై విరక్తి చెంది కొంతమంది బలవన్మరణాలకు పాల్పడుతుంటారు. ఇక కొంత మంది చిన్న చిన్న కారణాలతోనే ఆత్మహత్యకు పాల్పడి తనువు చాలిస్తుంటారు. క్షణికావేశంలో వారు చేసే పనుల వల్ల తల్లిదండ్రులకు జీవితాంతం క్షోభ మిగులుతుంది. కోడి గుడ్డు దోశకు డబ్బులు ఇవ్వలేదనే కారణంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం తలారివారిపల్లికి చెందిన దివంగత రమణయ్య కుమారుడు సాయి కిరణ్ (21) ఆత్మహత్య చేసుకున్నాడు. సాయి కిరణ్ బి.కోత్తకోట సమీపంలోని వేము ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. సాయి కిరణ్‌ చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో గారాబంగా పెంచారు. చిన్నప్పటి నుంచి చలాకీగా ఉండే సాయి కిరణ్.. చదువులో‌నూ తోటి విద్యార్థుల కంటే ముందుండే వాడు. ఈ రోజు ఉదయం సాయి కిరణ్ కోడి గుడ్డు దోశ‌కు డబ్బులు ఇవ్వాలని కుటుంబ సభ్యులను అడిగాడు. వారు ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురై గొడవకు దిగాడు. కోపంతో మొబైల్ ఫోన్ ఇంట్లోనే వదిలి బయటికి వెళ్లాడు. కోపం తగ్గాక వస్తాడని భావించిన కుటుంబ సభ్యులు నిర్లక్ష్యంగా ఉండి పోయారు.

Chittoor: ఎగ్ దోశకు డబ్బు ఇవ్వలేదని బీటెక్ విద్యార్థి ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన

Also Read: Crime News: హత్య చేసి కూడా ఏం యాక్టింగ్.. అయినా హంతకుల్ని పచ్చరాయి ఉంగరం పట్టించేసిందిలా..

కోపంతో ఇంటి నుంచి బయటకు వెళ్లిన సాయి కిరణ్.. గ్రామానికి సమీపంలోని గుర్రప్పకుంటలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అక్కడ సమీపంలో పొలం పనులు చేస్తున్న వ్యక్తులు గమనించి కేకలు వేస్తుండగానే.. అతను కుంటలో దూకాడు. అప్రమత్తమైన కూలీలు.. సాయి కిరణ్‌ను కాపాడేందుకు ప్రయత్నించినా ఫలించలేదు. అప్పటికే మృతి చెందాడు. వెంటనే వారు పోలీసులు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సాయి కిరణ్  మృతదేహాన్ని వెలికి తీశారు. శవాన్ని పోస్టుమార్టం కోసం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేశారు. 

Also Read: Kothagudem: రహస్యంగా ప్రేమ పెళ్లి.. భారీ ట్విస్ట్ ఇచ్చిన ఫ్యామిలీ, అసలు సంగతి తెలిసి అఘాయిత్యం

Also Read: Mahabubabad: భర్త ప్రైవేట్ పార్ట్స్ కోసేసిన భార్య, ఆ వెంటనే ఇంకో ఘాతుకం.. కారణం ఏంటంటే..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News: ఫ్రెండ్ రూంకు వెళితే బలవంతంగా మద్యం తాగించి, ఇద్దరు బాలికలపై లైంగిక దాడి
ఫ్రెండ్ రూంకు వెళితే బలవంతంగా మద్యం తాగించి, ఇద్దరు బాలికలపై లైంగిక దాడి
‌Fake Currency Racket: హైదరాబాద్‌లో భారీ నకిలీ కరెన్సీ ముఠా రట్టు.. రూ. 6.78 కోట్ల ఫేక్ నోట్లు సీజ్, నలుగురి అరెస్ట్
హైదరాబాద్‌లో భారీ నకిలీ కరెన్సీ ముఠా రట్టు.. రూ. 6.78 కోట్ల ఫేక్ నోట్లు సీజ్, నలుగురి అరెస్ట్
Hyderabad Crime: హైదరాబాద్ పాతబస్తీలో దారుణ హత్య.. అడ్డుకోబోయిన వ్యక్తిపై కూడా దాడి!
హైదరాబాద్ పాతబస్తీలో దారుణ హత్య.. అడ్డుకోబోయిన వ్యక్తిపై కూడా దాడి!
Shivasattu Murder: చౌటుప్పల్‌లో దారుణం.. శివసత్తు సుధాకర్ స్వామి దారుణ హత్య.. అసోం నిందితుల అరెస్ట్!
చౌటుప్పల్‌లో దారుణం.. శివసత్తు సుధాకర్ స్వామి దారుణ హత్య.. అసోం నిందితుల అరెస్ట్!

వీడియోలు

Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
మాట నిలబెట్టుకున్న కేటీఆర్. మస్కట్‌లో చిక్కుకున్న కొడంగల్ మహిళకు సాయం
మాట నిలబెట్టుకున్న కేటీఆర్. మస్కట్‌లో చిక్కుకున్న కొడంగల్ మహిళకు సాయం
Conductor Dies: చిల్లర వివాదం.. ప్రయాణికురాలు నెట్టేయడంతో గాయపడిన RTC కండక్టర్ మృతి, మంత్రి పొన్నం సంతాపం
చిల్లర వివాదం.. ప్రయాణికురాలు నెట్టేయడంతో గాయపడిన RTC కండక్టర్ మృతి, మంత్రి పొన్నం సంతాపం
US Midterm Elections: అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలు.. రిపబ్లికన్లు వెనుకంజపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. శపిస్తానంటున్న కేఏపాల్
అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలు.. రిపబ్లికన్లు వెనుకంజపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. శపిస్తానంటున్న కేఏపాల్
Norton 450 Urban ఆవిష్కరణ.. 47hp ఇంజిన్, 8-అంగుళాల TFT స్క్రీన్‌తో రెండు వేరియంట్లు
Norton కొత్త బైక్‌లు చూశారా? హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాలను తలపించే డిజైన్‌తో 450 Urban
Hyderabad Crime News: ఫ్రెండ్ రూంకు వెళితే బలవంతంగా మద్యం తాగించి, ఇద్దరు బాలికలపై లైంగిక దాడి
ఫ్రెండ్ రూంకు వెళితే బలవంతంగా మద్యం తాగించి, ఇద్దరు బాలికలపై లైంగిక దాడి
Borewell NOC Rules: తెలంగాణపై ఎల్‌నీనో ఎఫెక్ట్.. బోర్‌వెల్స్‌కు ఎన్‌వోసీ తప్పనిసరి.. కొత్త మార్గదర్శకాలు జారీ
తెలంగాణపై ఎల్‌నీనో ఎఫెక్ట్.. బోర్‌వెల్స్‌కు ఎన్‌వోసీ తప్పనిసరి.. కొత్త మార్గదర్శకాలు జారీ
GVMC Mayor ముక్కా శ్రావణి.. వైసీపీ అభ్యర్థిపై ఘన విజయం, ఎవరెన్ని స్థానాలు నెగ్గారంటే
జీవీఎంసీ మేయర్‌‌గా ముక్కా శ్రావణి.. వైసీపీ అభ్యర్థిపై ఘన విజయం, ఎవరెన్ని స్థానాలు నెగ్గారంటే
Bandi Sanjay Kumar: ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్
ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్
Embed widget