అన్వేషించండి

France Kidnap: ఇక్కడ పోలీసులకు చెప్పి మరీ కిడ్నాప్‌లు చేస్తారు.. కేసులు కూడా ఉండవు, 11 గంటల తర్వాత..

ఆ దేశంలో కిడ్నాప్ చేస్తే పోలీసులు పట్టించుకోరు. ఎందుకో తెలుసుకోవాలని ఉందా? అయితే చూసేయండి.

కిడ్నాప్, హత్యలు.. క్షమించరాని నేరాలనే సంగతి తెలిసిందే. ఇలాంటి దారుణాలకు పాల్పడేవారికి కఠిన కారాగార శిక్షలు విధిస్తారు. మరణ దండన కూడా తప్పదు. అయితే, ఆ దేశంలో మాత్రం కిడ్నాప్‌లు నేరం కాదు. అలాగని.. ఎవరిని పడితేవారిని ఇష్టానుసారంగా కిడ్నాప్ చేయకూడదు. దానికో లెక్క ఉంటుంది. ఎవరినైనా అపహరించాలంటే.. కిడ్నాపర్లు తప్పకుండా కిడ్నాప్ చేయబడే వ్యక్తి అంగీకారం ఉండాలి. అతడితో ఒప్పందం తర్వాతే ఆ నేరానికి పాల్పడాలి. అతడు కోరుకుంటేనే కిడ్నాప్ చేయాలి. చాలా గందరగోళంగా అనిపిస్తోంది కదూ. అయినా.. ఈ నేరాన్ని ఎందుకు అధికారికంగా చేస్తారు? ఎవరైనా కిడ్నాప్ కావడానికి అంగీకరిస్తారా? అయితే, మీరు పారీస్‌లోని ఈ సంస్థ చేస్తున్న ‘అధికారిక’ నేరం గురించి తెలుసుకోవల్సిందే.

తూర్పు ఫ్రాన్స్‌లోని అల్టిమైమ్ రియలైట్ (అల్టిమేట్ రియాలిటీ) సంస్థ అధికారికంగా కిడ్నాప్‌లు చేస్తోంది. ఇందుకు భారీ మొత్తాన్నే వసూలు చేస్తోంది. మరి, పోలీసులు వారిని ఎందుకు అరెస్టు చేయడం లేదనేగా మీ సందేహం? ఎందుకంటే.. వీరు చేస్తున్నది నేరం కాదు అడ్వేంచర్. ఔనండి.. అల్టిమైమ్ రియలైట్ సంస్థ ఎవరిని పడితే వారిని కిడ్నాప్ చేయదు. కేవలం ఆ అనుభూతి మాత్రమే ఇస్తుంది. 

జీవితంలో థ్రిల్ కోరుకొనేవారు.. సరికొత్త అనుభూతి కోసం తమని తాము కిడ్నాప్ చేయించుకుంటున్నారట. అయితే, జనాల్లో మొదట ఈ ఆలోచన లేదు. అల్టిమైమ్ రియాలైట్ సంస్థకు చెందిన 28 ఏళ్ల జార్జెస్ సెక్సస్‌కు వచ్చిన ఐడియా ఇది. కిడ్నాప్‌ కావడంలో కూడా థ్రిల్ ఉంటుందని, సాహసాలను ఇష్టపడే వ్యక్తులకు ఆ అనుభూతి కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఫేక్ కిడ్నాప్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించాడు. 

ఈ ప్రోగ్రామ్ ప్రకారం.. ఇతరులను కిడ్నాప్ చేసేందుకు అనుమతి లేదు. తమని తాము కిడ్నాప్ చేయించుకోడానికి ఇష్టపడే వ్యక్తులే అర్హులు. ఇందుకు ప్రత్యేకమైన ప్యాకేజీలు కూడా ఉన్నాయి. కిడ్నాప్ కావడానికి ఇష్టపడే వ్యక్తి.. ఎలాంటి థ్రిల్ కావాలో ముందుగానే చెప్పాలి. కారులో కిడ్నాప్ చేయాలా లేదా వ్యాన్‌లో చేయాలా? ఎలాంటి ప్రాంతంలో బంధించి ఉంచాలనేది తెలియజేయాలి. పెద్ద ప్యాకేజీల్లో సైకో డ్రామా, ఎస్కేప్ లేదా హెలికాప్టర్ ఛేజ్‌ను కూడా ఎంచుకోవచ్చు. అయితే, ఇందుకు కాస్త ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. 

ఈ కిడ్నాప్ ప్యాకేజీల ప్రకారం.. అహరణ కోసం డబ్బులు చెల్లించే వ్యక్తిని.. అతడు ఎంచుకున్న ప్యాకేజీ ప్రకారం కిడ్నాప్ చేస్తారు. అతడు ఊహించని సమయంలో అకస్మాత్తుగా కొందరు వ్యక్తులు వచ్చి.. ముఖానికి ముసుగు వేసి, కాళ్లు, చేతులను కట్టేస్తారు. ఆ తర్వాత కారు లేదా ప్యాకేజీలో కోరుకున్న వాహనంలో కస్టమర్‌ను అపహరిస్తారు. ఆ తర్వాత చీకటి గదిలో కూర్చికి కట్టేస్తారు. ఈ ప్యాకేజీలో చిత్ర హింసలను కూడా ఎంచుకోవచ్చు. మెనులో ఉన్న ప్రకారమే వారిని హింసిస్తారు. కిడ్నాపర్లు ఎన్ని రోజులు బందీగా ఉంచాలో కూడా ముందుగానే చెప్పాలి. ప్యాకేజీ ప్రకారం 4 నుంచి 11 గంటల వరకు కిడ్నాపర్ చెరలో బందీలుగా ఉండవచ్చు.   

ఈ థ్రిల్‌ను ఎంచుకొనే ముందే.. క్లయింట్లు ఆ సంస్థతో ఒప్పందం చేయించుకోవాలి. తమ ఇష్ట ప్రకారమే ఈ ఫేక్ కిడ్నాప్‌లో పాల్గొంటున్నామని చెబుతూ సంతకాలు చేయాలి. అయితే, ఏ రోజు ఎక్కడ ఎప్పుడు ఎలా కిడ్నాప్ చేయాలనేది మాత్రం సంస్థే ప్లాన్ చేస్తుంది. చెప్పిన సమయంలో కిడ్నాప్ చేస్తే థ్రిల్ మిస్సవుతారని వారి ఉద్దేశం. ఈ వ్యాపారం ప్రారంభించిన తర్వాత రోజుకు కనీసం ఇద్దరు తమని కిడ్నాప్ చేయాలని ఆశ్రయిస్తున్నారని సెక్సస్ తెలిపాడు. 

Also Read: మనుషులపై జంతువులకు లైంగిక కోరికలు? ఆ డాల్ఫిన్ ఆమెతో ఏం చేసింది?

కిడ్నాప్‌కు గురైన వ్యక్తులు తమ కళ్లు గప్పి ఎస్కేప్ అయ్యేందుకు ప్రయత్నిస్తారని, అందులోనే వారికి అసలైన థ్రిల్ లభిస్తుందని సెక్సస్ పేర్కొన్నాడు. కేవలం కిడ్నాప్‌లు మాత్రమే కాదు.. మార్చురీ(శవాలను ఉంచే గది)లో రాత్రంతా గడపడం, బతికి ఉండగానే తమకి తాము అంత్యక్రియలు జరిపించుకోవడం వంటివి కూడా త్వరలో ప్రవేశపెడతామన్నాడు. 

Also Read: విమానం మధ్య సీట్లోని ఆర్మ్‌రెస్ట్ ఎవరు ఉపయోగించాలో తెలుసా?

కిడ్నాప్‌లు చేయడమంటే మాటలు కాదని.. కొంతమంది క్లయింట్లు పట్టపగలు, జనాల మధ్యలో కిడ్నాప్ అయ్యేందుకు ఇష్టపడతారని సెక్సస్ ఓ మీడియా సంస్థకు తెలిపాడు. అది ఫేక్ కిడ్నాప్ అని తెలియక సాధారణ ప్రజలు ఎలా స్పందిస్తారనే భయం తమ సిబ్బందిలో ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో తమ సంస్థ ముందుగానే పోలీసుల నుంచి అనుమతి తీసుకుందని పేర్కొన్నాడు. ఫ్రెంచ్ పోలీసు అధికారులు కూడా ఈ కిడ్నాప్‌లకు ఎలాంటి చట్టపరమైన అభ్యంతరాలు లేవని చెప్పారు. అయితే, ఏదైనా కిడ్నాప్‌కు వెళ్లేప్పుడు ముందుగానే పోలీసులకు ప్లాన్ గురించి తెలియజేయాలని తెలిపారు. కస్టమరే స్వయంగా కిడ్నాప్ అయ్యేందుకు అంగీకరిస్తున్నాడు కాబట్టి.. చట్టపరంగా ఇది నేరం కాదని ఓ పోలీస్ అధికారి పేర్కొన్నారు.  

Also Read: 12 ఏళ్లుగా రోజుకు అరగంటే నిద్ర.. ఏ రోగం లేకుండా భలే బతికేస్తున్నాడు, అదెలా సాధ్యం?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila: మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
Tummala Nageswara Rao :  మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
Pawan Kalyan Assets: నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
Top 5 K Dramas: కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Pawan Kalyan Assets | 5 ఏళ్లలో పవన్ కల్యాణ్ ఆస్తులు 191 శాతం పెరిగాయి.. ఇంత సంపాదన ఎలా వచ్చింది..?Pawan Kalyan Nomination From Pithapuram | పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ నామినేషన్ దాఖలు | ABPMadhavi Latha vs Asaduddin Owaisi |  పాతబస్తీలో కొడితే దేశవ్యాప్తంగా రీసౌండ్ వస్తుందా..? | ABPAllari Naresh on Aa okkati Adakku | మళ్లీ కామెడీ సినిమాలు చేయటంపై అల్లరి నరేష్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
Tummala Nageswara Rao :  మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
Pawan Kalyan Assets: నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
Top 5 K Dramas: కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
Diamonds in Mumbai: న్యూడిల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్, రూ.6 కోట్ల విలువైనవి స్వాధీనం
న్యూడిల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్, రూ.6 కోట్ల విలువైనవి స్వాధీనం
Pesticides in Protein Powder : మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట
మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట
Pratinidhi 2: ప్రతినిధి 2 విడుదల వాయిదా... రాజకీయ ఒత్తిళ్లు పని కాకుండా చేశాయా?
ప్రతినిధి 2 విడుదల వాయిదా... రాజకీయ ఒత్తిళ్లు పని కాకుండా చేశాయా?
KCR Bus Yatra :  పూర్వ వైభవమే లక్ష్యం - కేసీఆర్ బస్సు యాత్రకు సర్వం  సిద్ధం
పూర్వ వైభవమే లక్ష్యం - కేసీఆర్ బస్సు యాత్రకు సర్వం సిద్ధం
Embed widget