(Source: ECI/ABP News/ABP Majha)
NASA study: మనుషులపై జంతువులకు లైంగిక కోరికలు? ఆ డాల్ఫిన్ ఆమెతో ఏం చేసింది?
NASA study: జంతువులకు మనుషులపై ఆ కోరికలు పుడతాయా? ఆ డాల్ఫిన్ ఆమెతో ఏం చేసింది?
లైంగిక కోరికలనేవి మనుషులకే కాదు జంతువులకు కూడా ఉంటాయి. అయితే, ఆ అవసరాన్ని కేవలం తమ జాతి జీవులతోనే తీర్చుకుంటాయి. అలా కాకుండా వేరే జాతిపై ఆకర్షణ పెంచుకుంటే అది తప్పకుండా సృష్టి విరుద్ధమే అవుతుంది. అయితే.. మనం పెంచుకొనే జంతువులు మనపై ఎంతో విశ్వాసం, ప్రేమను చూపిస్తాయి. మరి, వాటికి తమను ప్రేమించే వ్యక్తులపై లైంగిక కోరికలు కలుగుతాయా? అవి మనుషులతో శృంగారాన్ని కోరుకుంటాయా? అనే సందేహాలపై ఓ యువతి చెప్పిన ఈ ఆసక్తికర విషయాలు తెలిస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు.
కరేబియన్‌లోని సెయింట్ థామస్‌లో నివసిస్తున్న మార్గరేట్ హోవే లోవాట్ అనే 20 ఏళ్ల యువతికి ఎదురైన అనుభవం ఇది. 1963 సంవత్సరంలో నాసా డాల్ఫిన్లు ఇంగ్లీషును అర్థం చేసుకోగలవా అనే అంశంపై అధ్యయనం చేపట్టింది. ఇందుకు డాల్ఫిన్లతో సన్నిహితంగా మెలిగే జంతు ప్రేమికుల గురించి అన్వేషించారు. అదే సమయంలో.. మార్గరేట్ క్రిస్మస్ రోజున తన బావ ద్వారా ఆ ప్రాజెక్ట్ గురించి తెలుసుకుంది. రహస్య దీవిలోని ఓ ల్యాబ్‌లో డాల్ఫిన్లపై ప్రయోగాలు చేస్తున్నట్లు అతడు చెప్పాడు. దీంతో మార్కరేట్‌కు ఆసక్తి పెరిగింది.
ఉత్సుకతని ఆపుకోలేక అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఉద్దేశంతో మార్గరెట్ ఆ ల్యాబ్‌కు వెళ్లింది. అక్కడ ల్యాబ్ డైరెక్టర్ గ్రెగొరీ బేట్‌సన్‌ను కలుకుంది. ఈ సందర్భంగా ఆమె తనకు జంతువుల గురించి తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందని చెప్పింది. అయితే, మార్గరేట్‌కు అలాంటి పరిశోధనలపై శాస్త్రీయ పరిజ్ఞానం లేకపోయినా.. బేట్‌సన్ ఆమెకు అనుమతి ఇచ్చాడు. జంతువుల ప్రవర్తనల గురించి తెలుసుకుని స్టడీ రూపొందించే బాధ్యతను ఆమెకు అప్పగించాడు. కొద్ది రోజుల్లోనే మార్గరేట్ తన నైపుణ్యం చూపించింది. ఫలితంగా ఆమెకు NASA ఫండెడ్ స్టడీలో పనిచేసేందుకు ఆమెకు అవకాశం లభించింది.
వాస్తవానికి NASA ఈ అధ్యయనం.. డాల్ఫిన్లు ఇంగ్లీషును అర్థం చేసుకోగలవా? మాట్లాడగలవా? వాటికి ఇందులో శిక్షణ ఇవ్వడం సాధ్యమా.. కాదా అని తెలుసుకోవడం కోసమే అధ్యయనం చేపట్టింది. అయితే, మార్గరేట్ మాత్రం అప్పటివరకు ఎవరు కనిపెట్టని సరికొత్త విషయాన్ని తెలుసుకుంది. తనకు సన్నిహితంగా ఉంటున్న మూడు డాల్ఫిన్లలో ఒకటి ఆమెతో లైంగిక తృప్తి పొందేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆమె చెప్పింది. దీంతో అధ్యయనంపై మరింత ఆసక్తి పెరిగింది.
BBCకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ‘‘ఆ ల్యాబ్‌లో నేను పీటర్, పమేలా, సిస్సీ అనే మూడు డాల్ఫిన్లతో పనిచేశాను. వాటిలో సిస్సీ పెద్దది. పమేలాకు చాలా సిగ్గు, భయం. పీటర్ మగ డాల్ఫిన్. యవ్వనంలో ఉండటం వల్ల అది చాలా కొంటెగా ఉండేది. వాటితో ఎక్కువసేపు గడపడం వల్ల అవి నాకు బాగా క్లోజ్ అయ్యాయి. ముఖ్యంగా ఒక డాల్ఫిన్ నాతో చాలా ప్రత్యేకంగా ప్రవర్తించేది. అదే పీటర్. అది ఎక్కువగా నాతో ఉండేందుకే ఇష్టపడేది. అది నా మోకాలు లేదా నా పాదం, చేతిని తన శరీరంతో రుద్దేది. నేను కూడా దానికి అడ్డు చెప్పేదాన్ని కాదు. నాకు కూడా పెద్ద అసౌకర్యం కలిగేది కాదు. ఈ సందర్భంగా నాకు ఒక విషయం అర్థమైంది. అది నాతో లైంగిక చర్యకు పాల్పడుతుందని తెలిసింది. కానీ, నేను మాత్రం దానిపై ఆ ఉద్దేశంతో లేను. అది మాత్రమే తన కోరిక తీర్చుకొనేందుకు దాని శరీరాన్ని నాకు రుద్దుతూ తృప్తిపడేది’’ అని తెలిపింది.
Also Read: విమానం మధ్య సీట్లోని ఆర్మ్‌రెస్ట్ ఎవరు ఉపయోగించాలో తెలుసా?
ఈ అధ్యయనాన్ని అమెరికన్ న్యూరో సైంటిస్ట్ డాక్టర్ జాన్ లిల్లీ మొదలుపెట్టారు. డాల్ఫిన్‌లు వారి బ్లోహోల్స్ ద్వారా మానవుల తరహాలోనే శబ్దాలు చేస్తూ.. మనుషులతో సంభాషించడం సాధ్యమవుతుందని ఆయన భావించారు. ఈ నేపథ్యంలో నాసా కూడా ఈ స్టడీకి నిధులు సమకూర్చేందుకు ముందుకొచ్చింది. అవి మనుషులతో మాట్లాడేందుకు ఉపయోగించే కమ్యునికేషన్ ద్వారా ఇతరాత్ర తెలివైన జీవుల శబ్దాలను కూడా అర్థం చేసుకోవచ్చని ఆయన భావించారు. కానీ, ఈ ప్రయోగంలో డాల్ఫిన్లకు LSD అనే డ్రగ్ ఇస్తున్నారనే ఆరోపణలు రావడంతో అధ్యయనం నిలిపేశారు. దీంతో మార్గరేట్ అధ్యయనం కూడా మధ్యలోనే నిలిచిపోయింది.
Also Read: 12 ఏళ్లుగా రోజుకు అరగంటే నిద్ర.. ఏ రోగం లేకుండా భలే బతికేస్తున్నాడు, అదెలా సాధ్యం?
అయితే.. అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన మాల్కోమ్ బ్రెన్నెర్ అనే 68 ఏళ్ల రచయిత ‘వెట్ గాడ్డెస్’ పేరుతో రాసుకున్న తన బయోగ్రఫీలో ఆసక్తికర విషయం తెలిపాడు. తన యవ్వనంలో ఓ డాల్ఫిన్‌తో ఎలా ప్రేమలో పడ్డాడనే విషయాన్ని తెలిపాడు. ఆ తర్వాత దానితో సహజీవనం చేయడమే కాకుండా.. లైంగిక చర్యలోనూ పాల్గొన్నానని చెప్పాడు. దీంతో డాల్ఫిన్లు నిజంగానే మనుషులతో లైంగిక సంబంధం పెట్టుకోగలవా అనే సందేహాలకు మరోసారి తెరలేపాడు.