X

విమానం మధ్య సీట్లోని ఆర్మ్‌రెస్ట్ ఎవరు ఉపయోగించాలో తెలుసా?

విమానం, రైలు లేదా బస్సులో మీకు మధ్య సీటు దొరికిందా? మీ ఆర్మ్‌రెస్ట్‌ను అటూ ఇటూ కూర్చున్నవారు ఆక్రమించారా? మరి, మధ్యలో ఉండే ఆర్మ్‌రెస్ట్ ఎవరు ఉపయోగించాలి?

FOLLOW US: 

విమానంలోగానీ.. బస్సులో గానీ.. మూడు సీట్లు ఉంటే.. చేతిని పెట్టుకొనే ఆర్మ్‌రెస్ట్ కోసం పెద్ద పోరాటమే జరుగుతుంది. ఆ సీట్లో కూర్చునేవారు ఒకే కుటుంబం లేదా స్నేహితులైతే పర్వాలేదు. వేర్వేరు వ్యక్తులు కూర్చుంటే మాత్రం.. రచ్చ రంబోలానే. పక్కోడు చేయి పెట్టకముందే దానిపై చేయి పెట్టేసి సొంతం చేసుకోవాలనే ప్రయత్నించేవారిని మీరు చూసే ఉంటారు. చూసేందుకు ఇది పిల్ల చేష్టలా ఉన్నా.. మనకు తెలియకుండానే ఆ పని చేసేస్తుంటాం. దీనివల్ల మధ్య సీటు అంటేనే భయపడే పరిస్థితి వస్తుంది. ఇద్దరి మధ్యలో చేతులను ముడుచుకుని కూర్చోవడం ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి?

అయితే, మూడు సీట్లకు మధ్యలో ఉండే ఆర్మ్‌రెస్ట్‌పై ఎవరికి హక్కు ఉంటుంది? దాన్ని ఎవరు ఉపయోగించాలి? అటూ కూర్చొనే పక్క సీటు ప్యాసింజర్ రెండు ఆర్మ్ రెస్టులు వాడితే మధ్యలో ఉండే ప్యాసింజర్ ఏది వాడాలి? అనే సందేహాలు చాలామందిలో ఉంటాయి. అందుకు ఓ ఫ్లైట్ అటెండెంట్.. దీనిపై క్లారిటీ ఇచ్చాడు. మధ్యలో ఉండే ఆర్మ్ రెస్టులపై ఎవరికి రైట్స్ ఉంటాయో వివరించాడు. 

Also Read: పాము కాటేసినా ముంగిసకు ఏమీ కాదు ఎందుకు? కారణం ఇదే..

‘కామన్ సెన్స్ ఆఫ్ ఫ్లయింగ్’ అనే ఎయిర్ ట్రావెల్ గైడ్ రచయిత బోరీస్ మిలన్ ఇటీవల ఓ కార్యక్రమంలో ఈ సందేహం గురించి చెప్పాడు. ఫ్లైట్ అటెండెంట్ జో‌ను మధ్య సీటుకు ఉండే ఆర్మ్ రెస్ట్ ఎవరికి చెందుతుందని అడిగాడు. ఇందుకు జో సమాధానమిస్తూ.. మూడు సీట్లు ఉండే లైన్లో.. మధ్యలో కూర్చొనే వ్యక్తికే ఆ రెండు ఆర్మ్‌రెస్టులు ఉపయోగించే హక్కు ఉంటుందని స్పష్టం చేశాడు. ఇటీవల మన్నెరస్మిత్ ఏటిక్యూట్టే కన్సల్టింగ్.. ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. విమానంలో మధ్య సీట్లో కూర్చొనే వ్యక్తికే రెండు ఆర్మ్‌రెస్టులు ఉపయోగించాలని తెలిపారు. ‘‘విండో సీటు పక్కన ఉండే వ్యక్తికి పక్కకు జారబడేందుకు వీలు ఉంటుంది. దారి(Aisle) వైపు కూర్చొనే వ్యక్తికి కాస్త ఇటుగా జరిగి సౌకర్యంగా కూర్చొనే వీలు ఉంటుంది. కానీ, మధ్యలో కూర్చొనే వ్యక్తికి ఏ ఆధారం ఉండదు. అటూ ఇటూ కదల్లేడు. ఏ ఆధారం లేకపోతే పక్క వ్యక్తుల మీదకు జారబడాల్సి వస్తుంది. ఆర్మ్‌రెస్ట్ ఉంటే.. వాలిపోకుండా కూర్చోడం వీలవుతుంది. కాబట్టి.. రెండు ఆర్మ్‌రెస్టుల మీద చేతులు పెట్టుకుని ఇబ్బంది లేకుండా కూర్చోవచ్చు’’ అని తెలిపారు. చూశారుగా.. ఇకపై మీరు ప్రయాణాలు చేసేప్పుడు తప్పకుండా ఈ రూల్ పాటించండి. మధ్య సీట్లో కూర్చొనే వ్యక్తులకు ఆర్మ్‌రెస్ట్ ఇచ్చి.. సౌకర్యంగా ప్రయాణించేందుకు సహకరించండి. 

Tags: middle seat armrests middle seat armrests use middle seat armrests in flight మధ్యలోని ఆర్మ్‌రెస్ట్

సంబంధిత కథనాలు

Clearest Sun Photo: మండే అగ్ని గోళంలా కనిపిస్తాడు... సూర్యుడి అత్యంత స్పష్టమైన ఇమేజ్ తీసిన ఖగోళ ఫొటో గ్రాఫర్

Clearest Sun Photo: మండే అగ్ని గోళంలా కనిపిస్తాడు... సూర్యుడి అత్యంత స్పష్టమైన ఇమేజ్ తీసిన ఖగోళ ఫొటో గ్రాఫర్

Men's Health: ‘ఏక్ మినీ కథ’.. పాపం, ఎంతో ఖర్చుపెట్టి ‘అది’ పెంచుకున్నాడు, కానీ.. ఓ యువకుడి చేదు అనుభవం

Men's Health: ‘ఏక్ మినీ కథ’.. పాపం, ఎంతో ఖర్చుపెట్టి ‘అది’ పెంచుకున్నాడు, కానీ.. ఓ యువకుడి చేదు అనుభవం

Free Bus Pass: ఫ్రీ బస్ పాస్‌తో 3,540 కిమీలు తిరిగేసిన 75 ఏళ్ల బామ్మ.. కారణం తెలిస్తే శభాష్ అంటారు!

Free Bus Pass: ఫ్రీ బస్ పాస్‌తో 3,540 కిమీలు తిరిగేసిన 75 ఏళ్ల బామ్మ.. కారణం తెలిస్తే శభాష్ అంటారు!

Chole Bhature: ‘పూరీ-కూర’వెయ్యి రూపాయలట... ఎక్కడో తెలుసా?

Chole Bhature: ‘పూరీ-కూర’వెయ్యి రూపాయలట... ఎక్కడో తెలుసా?

చంద్రుడిపై మిస్టరీ హౌస్?.. ఎవరు కట్టారబ్బా?? చైనా రోవర్‌కు చిక్కిన అరుదైన ఆకారం

చంద్రుడిపై మిస్టరీ హౌస్?.. ఎవరు కట్టారబ్బా?? చైనా రోవర్‌కు చిక్కిన అరుదైన ఆకారం

టాప్ స్టోరీస్

Pushpa Trailer: 'ఎవడి యుద్ధం వాడిదే'.. పుష్పరాజ్ వచ్చేశాడు.. 

Pushpa Trailer: 'ఎవడి యుద్ధం వాడిదే'.. పుష్పరాజ్ వచ్చేశాడు.. 

Telangana Health Department: తెలంగాణలో ఇప్పటివరకు ఒమిక్రాన్ కేసులు లేవు

Telangana Health Department: తెలంగాణలో ఇప్పటివరకు ఒమిక్రాన్ కేసులు లేవు

December 6 Cricketers Birthday: ఈ ఒక్క రోజే టీమ్‌ఇండియాలో ఐదుగురు క్రికెటర్ల బర్త్‌డే.. ఎవరో తెలుసా?

December 6 Cricketers Birthday: ఈ ఒక్క రోజే టీమ్‌ఇండియాలో ఐదుగురు క్రికెటర్ల బర్త్‌డే.. ఎవరో తెలుసా?

Omicron Threat: ఈ 'చిత్రం' చూశారా? ఇది మార్కెట్టా.. ఎయిర్‌పోర్టా.. లేక వైరస్ హాట్‌స్పాటా?

Omicron Threat: ఈ 'చిత్రం' చూశారా? ఇది మార్కెట్టా.. ఎయిర్‌పోర్టా.. లేక వైరస్ హాట్‌స్పాటా?