అన్వేషించండి

Mufasa The Lion King: ముఫాసాకు నాన్న డబ్బింగ్ చెప్పడం గర్వంగా ఉంది... మహేష్ కుమార్తె సితార ఘట్టమనేని

Sitara Ghattamaneni On Mufasa: ‘ముఫాసా: ద లయన్ కింగ్’ సినిమాలో ముఫాసా పాత్రకు మహేశ్ బాబు డబ్బింగ్ చెప్పిన సంగతి తెలసిందే. తండ్రి మహేశ్ బాబు చెప్పిన డబ్బింగ్ కూతురు సితారకు బాగా నచ్చేసిందట.

Sitara Ghattamaneni On Mahesh Babu dubbing for Mufasa: ‘‘అప్పుడప్పుడూ ఈ చల్లని గాలి. నా ఇంటి నుంచి వచ్చే జ్ఞాపకాలను గుర్తు చేస్తున్నట్టు అనిపిస్తుంది. అంత లోనే మాయమవుతున్నాయి’’ అంటూ ముఫాసా గా సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu) వాయిస్ అభిమానులకే కాదు... చిన్నపిల్లలకూ మంచి కిక్ ఇచ్చింది. ఆయన కుమార్తె సితారకు కూడా ముఫాసా పాత్రకు తండ్రి మహేశ్ చెప్పిన డబ్బింగ్ చాలా నచ్చేసిందట. 

నాన్న మా పట్ల కేరింగ్ గా ఉంటారు - సితార
ఈ సందర్భంగా  ఆమె మాట్లాడుతూ, ‘‘ముఫాసా క్యారెక్టర్ కు మా  నాన్న(మహేశ్ బాబు) డబ్బింగ్ చెప్పడం గర్వంగా ఉంది... ‘లయన్ కింగ్’ సినిమాలో ముఫాసా చాలా ఐకానిక్ రోల్. సినిమాలో ముఫాసా కేరక్టర్ లా నాన్న కూడా  మా పట్ల కేరింగ్ ఉంటారు. డిస్నీ సంస్థలో ‘ఫ్రోజన్’ అనే సినిమా కోసం డబ్బింగ్  కూడా చెప్పాను’’ అని సూపర్ స్టార్ మహేశ్ బాబు కుమార్తె సితార అన్నారు.

View this post on Instagram
 
A post shared by sitara (@sitaraghattamaneni)

వాల్ట్ డిస్నీ సంస్థ  నిర్మించిన హాలీవుడ్ మూవీ ‘ముఫాసా: ద లయన్ కింగ్’ (Mufasa: The Lion King). డిసెంబర్ 20న ఈ సినిమా విడుదల కానుంది. అడవిలో తప్పిపోయిన ముఫాసాకి రాజ కుటుంబానికి టాకా పరిచయమవుతాడు. అయితే ముఫాసా రాకను ఆ కుటుంబంలో ఎవరికి పెద్ద ఇష్టం ఉండదు.  నిజమైన అన్నదమ్ములన్నంత బలంగా టాకా, ముఫాసా ల మధ్య బంధం మరింత బలపడుతుంది. తర్వాత ముఫాసా ఎలా రాజయ్యాడన్నది కథ. ‘‘ఈ క్లాసిక్ కు నేను పెద్ద అభిమానిని. మనకు బాగా ఇష్టమైన పాత్రకు ఓ కొత్త ఆరంభం ఇది. తెలుగు లో ముఫాసా పాత్రకు డబ్బింగ్ చెప్పినందకు చాలా సంతోషంగా ఉంది’’ అని మహేశ్ బాబు అన్నారు. 2019 లో విడుదలైన ‘లయన్ కింగ్’ సినిమా ప్రీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కింది. బ్యారీ జెన్కిన్స్(Barry Jenkins) దర్శకుడు. 2017 లో ఆయన దర్శకత్వంలో వహించిన ‘మూన్ లైట్ ’ చిత్రానికి రెండు ఆస్కార్లు దక్కాయి. ఇప్పటికే ‘ముఫాసా’ సినిమా కు సంబంధించిన టీజర్లు, టైలర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ కామిక్ లో పుంబా, టిమోన్, టకా వంటి ముఖ్య పాత్రలూ ఉన్నాయి. అలీ, బ్రహ్మానందం, సత్యదేవ్, అయ్యప్ప పి శర్మ లు ఇందులోని కీలక పాత్రలకు  డబ్బింగ్ చెప్పారు.

Also Readబిగ్ బాస్ 8 విజేత నిఖిల్... అతని కంటే ముందు విన్నర్స్ ఎవరో గుర్తు ఉన్నారా? ఓ లుక్ వేయండి

వచ్చే ఏడాది ప్రారంభం!
‘ముఫాసా’ హిందీ వెర్షన్ లోని ముఫాసా పాత్రకు బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్, ముఫాసా చిన్నప్పటి పాత్రకు ఆయన చిన్న కుమారుడు అబ్రం డబ్బింగ్ చెప్పారు.  మహేశ్ బాబు సినిమాల విషయానికొస్తే, ఫ్యాన్స్ అందరూ మహేశ్ బాబు సినిమా అప్ డేట్స్ కోసం ఎంతో ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు.  రాజమౌళి సినిమా ఇంకా మొదలే కాలేదు. విడుదల ఇప్పట్లో లేదు. కనీసం వెండితెరపై మహేశ్ బాబు వాయిస్ అయినా విందామని ఫ్యాన్స్ ఆశ. త్వరలోనే రాజమౌళి సినిమా ప్రారంభమవుతుందని టాక్. రెండు భాగాలు గా విడుదల కానున్న ఈ సినిమా కు సంబంధించిన సెట్స్ ను రామోజీ ఫిలిం సిటీలో నిర్మిస్తున్నారట. వచ్చే జనవరిలో ఈ సినిమా ప్రకటన ఉంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. 

Also Readనిఖిలే విన్నర్... ట్రోఫీ ఇచ్చిన రామ్ చరణ్, స్టార్స్ సందడి - బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే హైలైట్స్ ఏంటో చూడండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan new movies: డిప్యూటీ సీఎంగానే కాదు హీరోగానూ పవన్ బాధ్యతలు - రాజకీయంగా నైతికమేనా?
డిప్యూటీ సీఎంగానే కాదు హీరోగానూ పవన్ బాధ్యతలు - రాజకీయంగా నైతికమేనా?
Amaravati Land Pooling: అమరావతి లో రెండోదశ పూలింగుకు ఏర్పాట్లు- ఏడు గ్రామాల్లో తొమ్మిది యూనిట్లు రెడీ
అమరావతి లో రెండోదశ పూలింగుకు ఏర్పాట్లు- ఏడు గ్రామాల్లో తొమ్మిది యూనిట్లు రెడీ
Eluru Crime News: లవ్ మ్యారేజ్.. 18 గంటల్లో యువతి కిడ్నాప్ కేసు సుఖాంతం, నిందితుల అరెస్ట్.. ఏలూరులో ఘటన
లవ్ మ్యారేజ్.. 18 గంటల్లో యువతి కిడ్నాప్ కేసు సుఖాంతం, నిందితుల అరెస్ట్.. ఏలూరులో ఘటన
CM Revanth Reddy: అక్కడైతే కేసీఆర్, హరీష్‌లను రాళ్లతో కొట్టి చంపేవాళ్లు - జలవివాదంపై సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు
అక్కడైతే కేసీఆర్, హరీష్‌లను రాళ్లతో కొట్టి చంపేవాళ్లు - జలవివాదంపై సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు

వీడియోలు

Record Liquor Sales | మద్యం అమ్మకాల్లో తెలంగాణ ఆల్ టైం రికార్డ్ | ABP Desam
Antarvedi Thar Tragedy | అంతర్వేది బీచ్‌లో సముద్రంలోకి కొట్టుకుపోయిన థార్.. ఒకరి మృతి | ABP Desam
Rohin Uttappa about Rohit Virat Retirement | రో - కో టెస్ట్ రిటైర్మెంట్ పై మాజీ ప్లేయర్ వ్యాఖ్యలు
Sarfaraz Khan in Vijay Hazare Trophy | రోహిత్ రికార్డు బద్దలు కొట్టిన సర్ఫరాజ్
Devdutt Padikkal Vijay Hazare Trophy | సూపర్ ఫామ్‌లో దేవ్‌దత్ పడిక్కల్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan new movies: డిప్యూటీ సీఎంగానే కాదు హీరోగానూ పవన్ బాధ్యతలు - రాజకీయంగా నైతికమేనా?
డిప్యూటీ సీఎంగానే కాదు హీరోగానూ పవన్ బాధ్యతలు - రాజకీయంగా నైతికమేనా?
Amaravati Land Pooling: అమరావతి లో రెండోదశ పూలింగుకు ఏర్పాట్లు- ఏడు గ్రామాల్లో తొమ్మిది యూనిట్లు రెడీ
అమరావతి లో రెండోదశ పూలింగుకు ఏర్పాట్లు- ఏడు గ్రామాల్లో తొమ్మిది యూనిట్లు రెడీ
Eluru Crime News: లవ్ మ్యారేజ్.. 18 గంటల్లో యువతి కిడ్నాప్ కేసు సుఖాంతం, నిందితుల అరెస్ట్.. ఏలూరులో ఘటన
లవ్ మ్యారేజ్.. 18 గంటల్లో యువతి కిడ్నాప్ కేసు సుఖాంతం, నిందితుల అరెస్ట్.. ఏలూరులో ఘటన
CM Revanth Reddy: అక్కడైతే కేసీఆర్, హరీష్‌లను రాళ్లతో కొట్టి చంపేవాళ్లు - జలవివాదంపై సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు
అక్కడైతే కేసీఆర్, హరీష్‌లను రాళ్లతో కొట్టి చంపేవాళ్లు - జలవివాదంపై సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు
Vande Bharat Sleeper Train: రైల్వే శాఖ నూతన సంవత్సర కానుక! ఈ మార్గంలో తొలి వందే భారత్ స్లీపర్ పరుగులు! టికెట్‌ ఎంతో తెలుసా?
రైల్వే శాఖ నూతన సంవత్సర కానుక! ఈ మార్గంలో తొలి వందే భారత్ స్లీపర్ పరుగులు! టికెట్‌ ఎంతో తెలుసా?
Bullet train: బుల్లెట్ ట్రైన్ ఓపెనింగ్ డేట్ ఖరారు - ఆ రోజున టిక్కెట్ బుక్ చేసుకుంటారా?
బుల్లెట్ ట్రైన్ ఓపెనింగ్ డేట్ ఖరారు - ఆ రోజున టిక్కెట్ బుక్ చేసుకుంటారా?
Jogi Ramesh: కల్తీ లిక్కర్ స్కాంలో నిండా మునిగిన జోగి రమేష్ - సిట్ చార్జిషీట్‌లో సంచలన విషయాలు
కల్తీ లిక్కర్ స్కాంలో నిండా మునిగిన జోగి రమేష్ - సిట్ చార్జిషీట్‌లో సంచలన విషయాలు
Record Liquor Sales | మద్యం అమ్మకాల్లో తెలంగాణ ఆల్ టైం రికార్డ్ | ABP Desam
Record Liquor Sales | మద్యం అమ్మకాల్లో తెలంగాణ ఆల్ టైం రికార్డ్ | ABP Desam
Embed widget