Allu Arjun Bail Cancel: సుప్రీంకోర్టుకు హైదరాబాద్ పోలీసులు - అల్లు అర్జున్ బెయిల్ రద్దు ఖాయమేనా ?
Arjun: అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయాలని పోలీసులు సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన చేస్తున్నారు. పోలీసుల తప్పిదమని వాదించడం వల్లే సీరియస్ గా తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

Police are going to the Supreme Court to cancel the bail of Allu Arjun: పుష్ప హీరో అల్లు అర్జున్ బెయిల్ క్యాన్సిల్ చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేందుకు హైదరాబాద్ పోలీసులు రెడీ అవుతున్నారు. క్వాష్ పిటిషన్‌పై వాదనల్లోనే అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేశారని ఇలా చేయడం న్యాయపరంగా కరెక్ట్ కాదని పోలీసులు అంటున్నారు. అదే సమయంలో అల్లు అర్జున్ తరపు లాయర్ తొక్కిసలాట ఘటనలో క్రౌడ్ ను కంట్రోల్ చేయకుండా పోలీసులు అల్లు అర్జున్ చుట్టూ ఉన్నారని.. ఆయన వద్దే గుమికూడారని వాదించారు. ఈ వాదనలు, క్వాష్ పిటిషన్ విచారించి బెయిల్ ఇవ్వడం వంటి అంశాలను హైలెట్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు.
క్వాష్ పిటిషన్‌పై విచారణ జరిపి మధ్యంతర బెయిల్ ఇచ్చిన తెలంగాణ హైకోర్టు
అల్లు అర్జున్ అరెస్టు చేసిన తర్వాత నాంపల్లిలోని దిగువ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అంతకు ముందు ఇదే కేసు విషయంపై అల్లు అర్జున్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై అత్యవసర విచారణ జరపాలని ఆయన తరపు లాయర్లు కోరడంతో న్యాయమూర్తి విచారణ జరిపారు. విచారణ తర్వాత మధ్యంతర బెయిల్ నాలుగు వారాల పాటు మంజూరు చేశారు. ఆ లోపు నాంపల్లి కోర్టు నుంచి రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేసుకోవాలని సలహా ఇచ్చారు. సంధ్యా ధియేటర్ యాజమాన్యం .. హీరో, హీరోయిన్లు.. సినిమా యూనిట్ ప్రీమియర్ షోకు వస్తారని తాము ముందే పోలీసులకు సమాచారం ఇచ్చామని ఓ లేఖ విడుదల చేసింది.
పోలీసులు అనుమతి నిరాకరించిన లెటర్ వెలుగులోకి
అయితే సోమవారం ఆ లేఖకు సంబంధిచి పోలీసులు ఇచ్చిన రిప్లయ్ కూడా వెలుగులోకి వచ్చింది. క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరూ ధియేటర్ కు రావొద్దని మూడో తేదీన ధియేటర్ యాజమాన్యానికి పోలీసులు సమాచారం ఇచ్చారు. ఆ లేఖ వైరల్ అయింది. ఇప్పుడు పోలీసులు పూర్తిగా సహకరించినా.. అసలు పోలీసుల సూచనలను పరిగణనలోకి తీసుకోనిది అర్జునేనని నిరూపించే సాక్ష్యాలతో సుప్రీంకోర్టుకు వెళ్లాలని అనుకుంటున్నారు. తొక్కిసలాట ఘటనకు పూర్తిగా ధియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్ కూడా కారణమేనని పోలీసులు వాదిస్తున్నారు. టిక్కెట్లు కొనుక్కున్న వారిని తోసేసి.. తొక్కేసి.. అల్లు అర్జున్ తరపున వచ్చిన వారు కూర్చున్నారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
త్వరలో నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేయనున్న అర్జున్
అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించడంతో పాటు అర్జున్ వ్యక్తిగత భద్రత సిబ్బంది అతితో మరిన్ని సమస్యలు వచ్చాయంటున్నారు. సుప్రీంకోర్టులో బెయిల్ రద్దు పిటిషన్ వేస్తే మరింత సంచలనం అయ్యే అవకాశం ఉంది. అయితే హైకోర్టులోనే డివిజన్ బెంచ్‌లో పిటిషన్ వేసేందుకు కూడా అవకాశం ఉంది. హైకోర్టు డివిన్ బెంచ్‌లో పిటిషన్ వేయాలా.. సుప్రీంకోర్టులో వేయాలా అన్నది పోలీసులు నిర్ణయం తీసుకోనున్నారు. ఒక వేళ వేయకపోతే నాలుగు వారాల్లోపు కింది స్థాయి కోర్టులో అర్జున్ బెయిల్ తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు తమ వాదనలు వినిపించి బెయిల్ పొడిగించకుండా చేయాలన్న ఆలోచన కూడా చేస్తున్నారు. పోలీసులు ఏ నిర్ణయం తీసుకుంటారన్నదానిపై ఆసక్తి ఏర్పడింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

