First Newspaper in India: దేశంలో మొట్టమొదటి న్యూస్ పేపర్ ఎలా పుట్టిందో తెలుసా.. ధర చాలా ఎక్కువే

Hicky's Bengal Gazette: జేమ్స్ ఆగస్టస్ హికీ అనే వ్యక్తి మొట్టమొదటిసారిగా కలకత్తాలో మన దేశంలోనే తొలి వార్త పత్రికను ప్రారంభించారు. దీంతో ఈస్ట్ ఇండియా కంపెనీ స్పందించి తమ పేపర్ తీసుకురావాల్సి వచ్చింది.

FOLLOW US: 
Bengal Gazette First Newspaper Printed In Asia: కోడికూత కంటే ముందే మన ఇంటి ముంగిళ్లను పలకరించే వార్తాపత్రిక పుట్టినరోజిది. తెల్లవారగానే ప్రపంచంలోని వార్తా విశేషాలను మన అరచేతుల్లో పెట్టే న్యూస్ పేపర్ మనదేశంలో ఊపిరి పోసుకున్న రోజు ఇది. సరిగ్గా 242 సంవత్సరాల క్రితం మన దేశంలో ఇంకా చెప్పాలంటే ఆసియా ఖండం మొత్తంలో మొదటిసారిగా న్యూస్ పేపర్ 29 జనవరి 1780లో ప్రింట్ అయింది. అది కూడా సాంస్కృతిక పునరుజ్జీవనానికి పేరుమోసిన బెంగాల్ లోని కలకత్తా నగరంలో. జేమ్స్ ఆగస్టస్ హికీ అనే ఐరిష్ వ్యక్తి ఈ పేపర్ ను ప్రింట్ చేశారు.
ఆనాటి బ్రిటీష్ గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్ మనదేశంలో ఆవలంబిస్తున్న విధానాలు సరికాదంటూ ఆనాటి ప్రభుత్వాన్ని ఎండగడుతూ న్యూస్ పేపర్ ను ప్రారంభించారు హికీ. మొదట్లో ఈ పేపర్ కు బెంగాల్ గెజిట్ అనీ ది ఒరిజినల్ కలకత్తా జనరల్ అడ్వర్టైజర్ అనీ పేర్లు పెట్టినా హికీ పేరు మీద హికీ'స్  బెంగాల్ గెజెట్ అనే పేరే స్థిరపడిపోయింది. నిజానికి అంతకంటే 12 ఏళ్ళముందే మనదేశంలో ఒక న్యూస్ పేపర్ పెట్టాలని డచ్ దేశపు సాహస యాత్రికుడు విలియం బొల్ట్స్ భావించినప్పటికీ అది కుదరలేదు. చివరకు 29 జనవరి 1780 నాడు హికీ ఇంగ్లిష్ భాషలో న్యూస్ పేపర్ ను అందుబాటులోకి తీసుకొచ్చాడు . 
 
ఆరోజుల్లోనే పేపర్ ఖరీదు ఒక్క రూపాయి.. !
అప్పట్లో ప్రతీ శనివారం నాడు వచ్చే ఈ పేపర్ ఖరీదు ఒక రూపాయి. ఆనాటి ధరలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువే, అయినా కొత్తగా అందుబాటులోనికి వచ్చిన న్యూస్ పేపర్ అనే సమాచార సాధనం కలకత్తా ప్రజలను విశేషంగా ఆకర్షించింది. అయితే హికీ తన పేపర్లో ప్రభుత్వాన్ని విమర్శిస్తుండడం, భావ ప్రకటనా స్వేచ్ఛ కోసం పోరాడుతుండడంతో తనకి పోటీగా ఇండియన్ గెజెట్ అనే న్యూస్ పేపర్ ను తన ఉద్యోగులతో ప్రారంభించేలా చేసింది ఈస్ట్ ఇండియా కంపెనీ. 
 
ఈస్ట్ ఇండియా కంపెనీ దురాగతాలపై పోరాడిన బెంగాల్ గెజెట్ :
ఒక పక్క బెంగాల్ గెజెట్ ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ దురాగతాలను హికీ బయట పెడుతుంటే మరోవైపు ఇండియన్ గెజెట్ పేపర్ ద్వారా వారెన్ హేస్టింగ్స్ పాలనను సమర్ధిస్తూ ఆర్టికల్స్ వచ్చేవి. అయితే ప్రజల సపోర్ట్ మాత్రం హికీ'స్ గెజెట్ వైపే ఉండేది . దానికి కారణం హికీ ధైర్యమే. ఆరోజుల్లో గవర్నర్ జనరల్ వంటి రాజప్రతినిధి పైన లంచగొండితనం, క్రూరత్వం, నియంతృత్వ ధోరణి వంటి ఆరోపణలతో వార్తలు ముద్రించడం అంటే సామాన్యమైన విషయం కాదు. అంతే కాదు అప్పటి ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన న్యాయమూర్తులు ఎలా డబ్బుకు అమ్ముడుపోతున్నారో సాక్ష్యాలతో సహా తన పేపర్ లో ముద్రించేవాడు హికీ. దానితో ఆయన్ని అణగదొక్కడానికి పూనుకున్న ఈస్ట్ ఇండియా కంపెనీ అనేక ఆరోపణలతో హికీని ఖైదు చేసింది. నాటకీయ పద్ధతుల్లో హికీని నాలుగుసార్లు విచారించి అనేక అభియోగాలు మోపి చివరకు జూన్ 1781లో జైలుకు పంపింది. అయినప్పటికీ జైలునుండే తన పేపర్ ప్రింట్ చేసేవాడు హికీ. దానితో తనపై మరిన్ని అభియోగాలు మోపి తన జైలు జీవితాన్ని మరింత దుర్భరం చేయడంతో ఆపై తన పేపర్ ను ప్రింట్ చేయలేకపోయాడు హికీ. చిట్టచివరిగా 30 మార్చ్ 1782 లో తన పేపర్  తుది ఎడిషన్ ను ప్రింట్ చేసి హికీ 'స్ బెంగాల్ గెజెట్ కు వీడ్కోలు పలికాడు జేమ్స్ అగస్టస్ హికీ. ఆ తరుణం కోసమే ఎదురుచూస్తున్న ఈస్ట్ ఇండియా కంపెనీ ఆ పైవారమే తన ఇండియన్ గెజెట్ పేపర్ యాజమాన్యం ద్వారా హికీ'స్ గెజెట్ ను కొనేసింది .  
 
ప్రపంచంలో మిగిలి ఉన్న కాపీలు కేవలం 6 మాత్రమే :
29 జనవరి 1780 నుండి 30 మార్చ్ 1782 వరకూ రెండేళ్లు సాగిన బెంగాల్ గెజెట్ ప్రస్థానానికి సాక్షిగా కేవలం 6 కాపీలు మాత్రమే ప్రపంచంలో మిగిలిఉన్నాయి. దేశంలో అదే మొదటి న్యూస్ పేపర్ కావడంతో ప్రింట్ చేసిన కాపీలను భద్రపరచాలి అన్న ఆలోచన హికీకు లేకపోవడమూ, తను జైలుకు వెళ్ళాక ఈస్ట్ ఇండియా కంపెనీ ఆ మిగిలిన ప్రింట్ లను అందుబాటులో లేకుండా చెయ్యడంతో బెంగాల్ గెజెట్ న్యూస్ పేపర్ కాపీలు అందుబాటులో లేకుండా పోయాయి. ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ మెల్‌బోర్న్, యూనివర్సిటీ ఆఫ్ హిడిల్బర్గ్, హై కోర్ట్ ఆఫ్ కలకత్తా, నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా, బ్రిటీష్ లైబ్రరీ, కాలిఫోర్నియా యూనివర్సిటీ లైబ్రరీలోనూ మొత్తం ఆరు కాపీలు మాత్రమే భద్రపరిచారు.
 
తరువాత హికీ ఏమయ్యాడు ?
అరెస్ట్ అయిన కొన్నేళ్ల తర్వాత 1784 లో హికీ జైలు నుండి రిలీజ్ అయ్యాడు. అయితే మూడేళ్ళ జైలు జీవితం తనని ఆర్ధికంగానూ, ఆరోగ్యపరంగానూ  బాగా కుంగదీసింది. తర్వాత పేదరికంలోనే జీవనం సాగించిన హికీ  1802 లో చైనాలో మృతి చెందినట్టు చరిత్ర చెబుతుంది. హికీ'స్ బెంగాల్ గెజెట్ ప్రస్థానం కేవలం రెండేళ్లే కొనసాగినా అనేకమంది భారతీయులు తమ సొంత న్యూస్ పేపర్లను స్థాపించడంలోనూ తద్వారా భారత స్వాతంత్య్ర పోరాటంలో అలుపెరగని పోరాటం సాగించడంలోనూ ఎందరికో స్ఫూర్తిని ఇచ్చింది హికీ'స్ బెంగాల్ గెజెట్. దానిని స్థాపించిన వ్యక్తిగా భావ ప్రకటన స్వేచ్ఛ కోసం ధైర్యంగా పోరాడిన వ్యక్తిగా ఈ దేశంలో న్యూస్ అనేది ఉన్నంత కాలం అమరుడుగా నిలిచిపోయే వ్యక్తి జేమ్స్ ఆగస్టస్ హికీ.
Published at : 29 Jan 2022 07:57 AM (IST) Tags: Bengal Gazette Hicky's Bengal Gazette First Newspaper in India James Augustus Hicky Hicky First Newspaper In Asia Bengal Gazette Newspaper

సంబంధిత కథనాలు

IAS Keerti Jalli :  అస్సాంలో ఐఏఎస్ కీర్తి జల్లి  సాహసం - అంతా ఫిదా ! ఇంతకీ ఆమె ఎవరో తెలుసా ?

IAS Keerti Jalli : అస్సాంలో ఐఏఎస్ కీర్తి జల్లి సాహసం - అంతా ఫిదా ! ఇంతకీ ఆమె ఎవరో తెలుసా ?

Hardik Patel Joining BJP: ఆప్ కాదు బీజేపీలోకే హార్దిక్ పటేల్ - చేరిక ముహుర్తం ఖరారు !

Hardik Patel Joining BJP:  ఆప్ కాదు బీజేపీలోకే హార్దిక్ పటేల్ - చేరిక ముహుర్తం ఖరారు !

International Booker Prize 2022: ప్రతిష్ఠాత్మక బుకర్ ప్రైజ్ అందుకున్న గీతాంజలి శ్రీ- ఆ రికార్డ్ ఆమెదే!

International Booker Prize 2022: ప్రతిష్ఠాత్మక బుకర్ ప్రైజ్ అందుకున్న గీతాంజలి శ్రీ- ఆ రికార్డ్ ఆమెదే!

Ladakh Road Accident: లద్దాఖ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం- ఏడుగురు జవాన్లు మృతి

Ladakh Road Accident: లద్దాఖ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం- ఏడుగురు జవాన్లు మృతి

Drone Mahotsav 2022: దేశంలో డ్రోన్ల సాంకేతికతతో సరికొత్త విప్లవం: మోదీ

Drone Mahotsav 2022: దేశంలో డ్రోన్ల సాంకేతికతతో సరికొత్త విప్లవం: మోదీ

టాప్ స్టోరీస్

Regional Parties Income : అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలకు విరాళాల వెల్లువ - డీఎంకే, వైఎస్ఆర్‌సీపీకే సగం !

Regional Parties  Income  :  అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలకు విరాళాల వెల్లువ - డీఎంకే, వైఎస్ఆర్‌సీపీకే సగం !

Ram Charan: రామ్ చరణ్ కోసం వరి చిత్రం - 264 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన అభిమాని

Ram Charan: రామ్ చరణ్ కోసం వరి చిత్రం - 264 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన అభిమాని

NTR Jayanthi: ఎన్టీఆర్ జయంతి - NBK 107 సినిమాలో కత్తి పట్టిన బాలకృష్ణ మాస్ లుక్ విడుదల

NTR Jayanthi: ఎన్టీఆర్ జయంతి - NBK 107 సినిమాలో కత్తి పట్టిన బాలకృష్ణ మాస్ లుక్ విడుదల

NTR Jayanti: 40 ఏళ్లకే ఎన్టీఆర్ అద్భుతాలు చేశారు- ఆయనలా ఇంకొకరు లేరు, రారు: చంద్రబాబు

NTR Jayanti: 40 ఏళ్లకే ఎన్టీఆర్ అద్భుతాలు చేశారు- ఆయనలా ఇంకొకరు లేరు, రారు: చంద్రబాబు