By: Ram Manohar | Updated at : 02 Sep 2023 02:10 PM (IST)
ఇస్రో ఆదిత్య L1 ప్రయోగంతో కలిగే లాభాలేంటి?
Aditya-L1 Solar Mission:
ఆదిత్య L1 విజయవంతం..
వరుస ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌లతో సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్‌గా మారింది ఇస్రో. ఇప్పటి వరకూ ఏ దేశమూ చేరుకోలేని చంద్రుడి సౌత్‌పోల్‌పై అడుగు పెట్టి జెండా ఎగరేసింది. ఇప్పుడదే జోష్‌తో సూర్యుడిపైనా పరిశోధనలు చేయనుంది. ఎన్నో ఏళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న ఆదిత్య L1 మిషన్‌ని విజయవంతంగా ప్రయోగించింది. ఇస్రోకి నమ్మిన బంటుగా పేరు తెచ్చుకున్న PSLV ద్వారా ఈ ఉపగ్రహాన్ని పంపింది. ఇప్పటికే ప్రయాణం మొదలు పెట్టింది Aditya L1. 125 రోజుల పాటు ప్రయాణించి గమ్యస్థానానికి చేరుకోనుంది. అయితే...చంద్రుడిపై ప్రయోగం చేయడానికి కారణం...అక్కడ ఆక్సిజన్ ఉందా..? జనావాసానికి వీలుందా..? అని తెలుసుకోవడం కోసం. మరి సూర్యుడిని ఇస్రో ఎందుకు టార్గెట్ చేసింది..? అక్కడి వాతావరణంపై పరిశోధనలు చేస్తే మనకేంటి లాభం..? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. సూర్యుడి ఉపరితలంపై విపరీతమైన ఉష్ణోగ్రతలు ఉంటాయి. 2.7 కోట్ల డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ ఉంటుందని అంచనా. ప్లాస్మా ఎక్ల్‌ప్లోజన్ ( plasma explosion) వల్ల ఉపరితలం నిప్పులు కక్కుతూ ఉంటుంది. ఈ పేలుడు కారణణంగానే...స్పేస్‌లోకి మిలియన్ టన్నుల ప్లాస్మా వ్యాప్తి చెందుతుంది. దీన్నే టెక్నికల్‌గా Coronal Mass Ejection (CME)గా పిలుస్తారు. కాంతివేగంతో సమానంగా ఈ ప్లాస్మా అంతరిక్షంలోకి విస్తరిస్తుంది.
దానిపైనే పరిశోధనలు..
ఒక్కోసారి ఈ CME భూమి దిశగానూ దూసుకొస్తుంది. కాకపోతే..భూమికున్న గురుత్వాకర్షణ శక్తి వల్ల అది భూమిని తాకేందుకు వీలుండదు. కొన్ని సార్లు భూమి Outer Layerలోకి చొచ్చుకుని వచ్చింది. ఎప్పుడైతే CME భూమివైపు దూసుకొస్తుందో...భూ కక్ష్యలో తిరిగే ఉపగ్రహాలకు డ్యామేజ్ జరుగుతుంది. ఈ కరోనల్ మాస్ ఎజెక్షన్‌పై పూర్తిస్థాయిలో అధ్యయనం చేయడానికే ఇస్రో ఆదిత్య L1 మిషన్‌ని చేపట్టింది. దాని తీవ్రతను అంచనా వేయడానికి ఈ ప్రయోగం ఉపకరించనుంది. భూమికి అతి దగ్గర్లో ఉన్న నక్షత్రం సూర్యుడు. నక్షత్రాలపై అధ్యయనం చేయాలంటే..సూర్యుడే బెస్ట్ ఆప్షన్‌గా కనిపిస్తోంది. అందుకే...సూర్యుడిపైనే గురి పెట్టింది ఇస్రో. సోలార్ విండ్స్, సోలార్ ఫ్లేర్స్ (పేలుళ్లు) లాంటివి భూమి వాతావరణంపైనా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. అంతే కాదు. అక్కడి కక్ష్యలో ఉన్న శాటిలైట్స్ కూడా డ్యామేజ్ అవుతాయి. ఈ కారణంగా టెక్నాలజీ ఆధారంగా నడిచే అన్ని సర్వీస్‌లకూ అంతరాయం కలుగుతుంది. ఈ ఇబ్బందులను తప్పించాలంటే ముందుగానే వాటిని గుర్తించాల్సి ఉంటుంది. భూమిని ప్రభావితం చేసే సూర్యుడిపై పరిశోధనలు చేస్తే..చాలా వరకూ ప్రమాదాలను అడ్డుకోవచ్చన్నది సైంటిస్ట్‌ల వివరణ. స్పేస్‌లో భారత్‌కి చెందిన 50 ఉపగ్రహాలున్నాయి. ఇవన్నీ నిత్యం మనకు వాతావరణం, కరవులు, విపత్తులకు సంబంధించిన సమాచారాన్ని చేరవేస్తున్నాయి. United Nations Office for Outer Space Affairs (UNOOSA) లెక్కల ప్రకారం భూ కక్ష్యలో దాదాపు 10,290 శాటిలైట్స్ ఉన్నాయి. వీటిలో 7,800 ప్రస్తుతం ఆపరేట్ అవుతున్నాయి. వీటిని సేఫ్‌గా ఉంచాలంటే Solar Winds, Solar Flares నుంచి వాటిని తప్పించాలి. వాటి దారి మళ్లించాలి. ఇప్పుడు ఇస్రో లక్ష్యం కూడా ఇదే. అందుకే ఆదిత్య L1 ని ప్రయోగించింది.
Also Read: నిర్దేశిత కక్ష్యలోకి ఆదిత్య L1, ప్రయోగం విజయవంతమైందని ఇస్రో ప్రకటన
మనీ లాండరింగ్ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అరెస్ట్ చేసిన ఈడీ
ఉజ్జెయిన్ అత్యాచార కేసు నిందితుడి ఇల్లు కూల్చివేత, బుల్డోజర్తో ధ్వంసం - వీడియో
Gayatri Joshi: ఇటలీ రోడ్లపై కార్ రేస్ - ‘స్వదేశ్’ మూవీ నటికి తీవ్ర గాయాలు, ఇద్దరు మృతి
గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ పెంచిన కేంద్రం, కేబినెట్ సమావేశంలో నిర్ణయం
ఎలన్ మస్క్‌పై పిటిషన్ వేసిన మాజీ భార్య, కొడుకుని చూడనివ్వడం లేదని కోర్టుకి
Talasani Srinivas : చంద్రబాబు అరెస్టు బాధాకరం - వైసీపీవి కక్ష సాధింపులు - మంత్రి తలసాని కీలక వ్యాఖ్యలు
Nobel Prize 2023 in Chemistry: రసాయన శాస్త్రంలో ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం
APSRTC News: దసరాకు ఏపీఎస్ఆర్టీసీ 5,500 స్పెషల్ సర్వీసులు - ఈ నగరాల నుంచే
AR Rahman: ఏఆర్ రెహమాన్‌కు ఆగ్రహం, సర్జన్స్ అసోసియేషన్‌పై రూ.10 కోట్ల పరువు నష్టం దావా
/body>