నిర్దేశిత కక్ష్యలోకి ఆదిత్య L1, ప్రయోగం విజయవంతమైందని ఇస్రో ప్రకటన
Aditya-L1 Solar Mission: ఆదిత్య L1 మిషన్‌ని విజయవంతంగా లాంఛ్ చేసింది ఇస్రో.
Aditya-L1 Solar Mission:
నిప్పులు కక్కుతూ..నింగిలోకి.
దేశమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఆదిత్య L1 మిషన్‌ని (Aditya-L1 Launch) లాంఛ్ చేసింది ఇస్రో. నిప్పులు కక్కుతూ నింగిలోకి దూసుకెళ్లింది ఈ రాకెట్. సరిగ్గా 11.50 నిముషాలకు రాకెట్ లాంఛ్ అయింది. రెండు దశలు విజయవంతం అయినట్టు ఇస్రో ప్రకటించింది. ఆ తరవాత అన్ని దశలూ దాటుకుని వెళ్లింది ఆదిత్య L1. చివరకు స్పేస్‌క్రాఫ్ట్ నుంచి ఉపగ్రహం విజయవంతంగా విడిపోయినట్టు వెల్లడించింది. ఆదిత్య L1 తన ప్రయాణాన్ని మొదలు పెట్టిందని తెలిపింది.
PSLV-C57/Aditya-L1 Mission:
— ISRO (@isro) September 2, 2023
The launch of Aditya-L1 by PSLV-C57 is accomplished successfully.
The vehicle has placed the satellite precisely into its intended orbit.
India’s first solar observatory has begun its journey to the destination of Sun-Earth L1 point.
మొత్తం ప్రయోగ సమయం 53 నిముషాల వరకూ ఉండనుంది. ఆదిత్య L1ని క్రమంగా లగ్రాంజ్ పాయింట్‌లోకి ప్రవేశపెట్టనుంది ఇస్రో. మూడు దశలూ విజయవంతం అయినట్టు శాస్త్రవేత్తలు ప్రకటించారు. ప్రస్తుతం కీలకమైన నాలుగో దశపై ఉత్కంఠ కొనసాగుతోంది. లగ్రాంజియన్ పాయింట్‌కి చేరుకున్న తరవాత Visible Emission Line Coronagraph (VELC) సాయంతో అక్కడి నుంచి ఫొటోలు పంపనుంది ఆదిత్య L1. రోజుకి 1,440 ఫొటోలు పంపుతుందని ఇస్రో ప్రకటించింది. ఈ ఫొటోల ద్వారా సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు వీలవుతుంది. ఆదిత్య L1లో అతి పెద్ద పే లోడ్ VELC. ఈ మిషన్ మొత్తంలో ఇదే అత్యంత కీలకం. Indian Institute of Astrophysics ఇస్రోతో కలిసి ఈ పేలోడ్‌ని తయారు చేసింది.
#WATCH | Indian Space Research Organisation (ISRO) launches India's first solar mission, #AdityaL1 from Satish Dhawan Space Centre in Sriharikota, Andhra Pradesh.
— ANI (@ANI) September 2, 2023
Aditya L1 is carrying seven different payloads to have a detailed study of the Sun. pic.twitter.com/Eo5bzQi5SO
ఆదిత్య L1 నింగిలోకి దూసుకెళ్తున్న సమయంలో అక్కడి ప్రజలు భారత్ మాతా కీ జై అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇస్రోకి ఆల్ ది బెస్ట్ చెప్పారు.
#WATCH | Crowd chants 'Bharat Mata Ki Jai' as ISRO's PSLV rocket carrying Aditya L-1 lifts off from Sriharikota pic.twitter.com/5uI6jZfLvJ
— ANI (@ANI) September 2, 2023
చంద్రయాన్ 3 సక్సెస్ తరవాత చేపట్టిన మిషన్ కావడం వల్ల అందరిలోనూ భారీ అంచనాలు పెరిగాయి. సూర్యుడిపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసే లక్ష్యంతో ఈ ప్రయోగం చేసింది ఇస్రో. చంద్రయాన్ 3 లో ఉన్నట్టే...ఈ ప్రయోగంలోనూ ఎన్నో సవాళ్లున్నాయి. వాటన్నింటినీ దాటుకుని గమ్యస్థానానికి చేరుకుంటుందని ఇస్రో సైంటిస్ట్‌లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మిషన్‌లో అత్యంత కీలకమైన లగ్రాంజ్ పాయింట్‌ని చేరుకోడానికి 125 రోజుల సమయం పట్టనుంది.
Indian Space Research Organisation (ISRO) launches solar mission, #AdityaL1 from Satish Dhawan Space Centre in Sriharikota pic.twitter.com/n980WYkbRk
— ANI (@ANI) September 2, 2023