అన్వేషించండి

Russia Google : రష్యాతో పెట్టుకుంటే అంతే - గూగుల్‌కు ప్రపంచంలో ఉన్న డబ్బు కంటే ఎక్కువ జరిమానా !

Google : గూగుల్ కంపెనీకి రష్యా కోర్టు ఇరవవై డెసిలియన్ డాలర్ల జరిమానా విధించింది. ఇది ఎంత అంటే ప్రపంచంలో ఉన్న సొమ్ము కంటే చాలా ఎక్కువ.

Russia : రష్యా లేదా పుతిన్‌తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో గూగుల్ కు మరోసారి అర్థమైపోయింది. రష్యా అధికారిక యూట్యూబ్ చానల్ తో పాటు ఆ దేశానికి సంబంధించిన పదిహేడు యూట్యూబ్ చానళ్లను నిషేధించారు. దీనిపై రష్యా గూగుల్ కు చాలా సార్లు విజ్ఞప్తులు చేసింది. కానీ పట్టించుకోలేదు. దాంతో కోర్టులో పిటిషన్ వేశారు. విచారణ జరిపిన కోర్టు యూట్యూబ్ తప్పు చేసిందని తేల్చింది. ఇది చిన్న తప్పు కాదని చెప్పి భారీ జరిమానా విధించింది. ఆ జరిమానా మొత్తం 20,000,000,000,000,000,000,000,000,000,000,000 డాలర్లు. ఇది ఎంత మొత్తమో చెప్పడం కూడా కష్టం. 

మనం చాలా వరకూ బిలియన్ డాలర్ల వరకూ విని ఉంటాం. అంత కంటే పెద్ద మొత్తం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎన్ని వందలు బిలియన్ డాలర్లు అయినా చెప్పగలుతాం. కానీ బిలియన్ దాటిన తర్వాత ఉండే నెంబర్ డెసిలియన్.  ఒక  అంకె తర్వాత 36 సున్నాలుంటే డెసిలియన్. అలాంటిది ఇరవై డెసిలియన్ల జరిమానాను రష్యా కోర్టు గూగుల్ కు విధించింది. ప్రపంచ జీడీపీ మొత్తం కలిపినా ఇంత మొత్తం ఉండదు. ఈ జరిమానా ను చూసి గూగుల్ కు మైండ్ బ్లాంక్ అయిపోయి ఉంటుంది.  కానీ రష్యా నుంచి ఇలాంటివేవో ఉంటాయని చెప్పి ముందుగానే జ్యూరిస్ డిక్షన్ పరిధిని ప్రకటించుకుంది. అమెరికా, బ్రిటన్ కోర్టుల్లో తేల్చుకోవాలనిచెప్పింది. ఆ మేరకు కోర్టుల్లో పిటిషన్లు వేసుకుంది.                                    

అమెరికా అధ్యక్ష భవన్‌ వైట్‌ హౌస్‌లో "ఓం జై జగదీష హరే" పాట- సోషల్ మీడియాలో వీడియో వైరల్

రష్యా ప్రపంచ దేశాలతో సరిగ్గా సంబంధాలు నిర్వహించదు. చైనా తరహాలోనే గోప్యంగా అంతా సాగుతంది. ఉక్రెయిన్ పై దాడి చేసి రెండున్నరేళ్లుగా యుద్ధం చేస్తోంది. ఈ క్రమంలో ప్రపంచం మొత్తం వినియోగించే సోషల్ మీడియా సంస్థలకు రష్యాలో  గడ్డు పరిస్థితులు ఎదురవుతూనే ఉంటాయి. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ప్రధాన సోషల్ మీడియా సంస్థలు రష్యాకు దూరం పాటిస్తున్నాయి. ఈ క్రమంలో గూగుల్ కు విధించిన ఊహించనంత జరిమానా రష్యా ఎలా వ్యవహరిస్తుందో తెలిసిపోతుంందదన్న అంచనాలు వస్తున్నాయి. గూగుల్ కట్టే అవకాశం  లేదు. 

లండన్‌ నుంచి భారత్‌కు లక్షా 2 వేల కిలోల బంగారం - ధనత్రయోదశీని ఆర్బీఐ అలా ప్లాన్ చేసింది !

2022 నుంచి రష్యాలో  గూగుల్ సేవలు నిలిచిపోయాయి. అక్కడి తమ సబ్సిడరీ కంపెనీ దివాలా తీసినట్లుగా ప్రకటించింది. ఆ దేశంలో ఇప్పటికీ వంద మిలియన్ డాలర్ల విలువైన ఆస్తులు గూగుల్ కు ఉన్నాయి. వాటిని రష్యా ప్రభుత్వం జప్తు చేసింది. గూగుల్ కంపెనీ ప్రతి దేశంలో ఆయా దేశాల చట్టాలకు అనుగుణంగా వ్యవహరిస్తుంది. ఇప్పుడు రష్యా కోర్టు విధించిన జరిమానాను  గూగుల్ కట్టలేదని రష్యాకు కూడా తెలుసు. అయినా ఇలాంటి జరిమానా విధించడం ఆసక్తికరంగా మారింది.                   

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Tirumala VIP Darsan: లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Tirumala VIP Darsan: లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
ZEBRA Twitter Review - 'జీబ్రా' ట్విట్టర్ రివ్యూ: సత్యదేవ్ యాక్షన్ థ్రిల్లర్ హిట్టా? ఫట్టా? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందంటే?
'జీబ్రా' ట్విట్టర్ రివ్యూ: సత్యదేవ్ యాక్షన్ థ్రిల్లర్ హిట్టా? ఫట్టా? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందంటే?
Jagan Mohan Reddy Latest News: ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Tragedy Incident: ప్రమాదంలో రెండు కాళ్లు నుజ్జు - కాపాడమని వేడుకున్నా కనీసం కనికరించలేదు, ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉండిపోయారు
ప్రమాదంలో రెండు కాళ్లు నుజ్జు - కాపాడమని వేడుకున్నా కనీసం కనికరించలేదు, ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉండిపోయారు
Embed widget