(Source: ECI/ABP News/ABP Majha)
Param Bir Singh News: 'ముందు ఎక్కడున్నారో చెప్పండి ఫస్ట్.. రక్షణ మాట అప్పుడు చూద్దాం'
మనీలాండరింగ్ కేసులో ముంబయి మాజీ పోలీసు కమిషనర్ పరమ్ బీర్ సింగ్‌కు రక్షణ కల్పించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది.
ముంబయి మాజీ పోలీసు కమిషనర్ పరమ్ బీర్ సింగ్‌కు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ముందుగా పరమ్ బీర్ సింగ్ ఎక్కడున్నారో తెలియజేయాలని అప్పటి వరకు కోర్టు ఈ పిటిషన్ స్వీకరించదని సుప్రీం తేల్చి చెప్పింది.
Supreme Court asks absconding former Mumbai police commissioner Param Bir Singh to disclose his whereabouts and says that it will hear Singh's plea for protection against arrest only after he tells which part of the country or the world he is in. pic.twitter.com/LXNVfN3d7G
— ANI (@ANI) November 18, 2021
తదుపరి విచారణను నవంబర్ 22కు వాయిదా వేసింది సుప్రీం కోర్టు. పరంబీర్ సింగ్ తనకు అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా ఈ వ్యాజ్యం దాఖలు చేశారు.
నాన్‌బెయిలబుల్ వారెంట్లు..
మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు సంబంధించిన బలవంతపు వసూళ్ల కేసులో ముంబయి మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ సహా మరికొంత మంది పోలీసులను పరారీలోని నేరస్థులుగా మెజిస్ట్రేట్ కోర్టు బుధవారం ప్రకటించింది. చివరిసారిగా సింగ్ మే నెలలో తన కార్యాలయంలో విధులు నిర్వహించారు. తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
రూ.15 కోట్ల కోసం పరంబీర్ సింగ్, మరో ఐదుగురు పోలీసు అధికారులు తనను వేధించారని జులైలో మెరైన్ డ్రైవ్ పోలీస్ స్టేషన్లో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన ముంబయి పోలీసులు పరంబీర్‌పై నాన్‌బెయిలబుల్ వారెంట్లు జారీ చేశారు. అయినా ఆచూకీ దొరకలేదు.
Also Read: Nawab Malik: వాంఖడే వెనుక 'దావూద్'.. ఆయన ఓ ముస్లిం.. ఇదిగో సాక్ష్యం: నవాబ్ మాలిక్
Also Read: Money Laundering Case: 'మీకు అధికార మదం తలకెక్కింది.. తగిన శాస్తి చేస్తాం'
Also Read: Supreme Court on Assault Case: 'దుస్తులపై నుంచి శరీర భాగాలను తాకినా లైంగిక వేధింపే'
Also Read: Google Pay Voice Feature: వాయిస్‌తో డబ్బులు ట్రాన్స్‌ఫర్.. ఇక డిజిటల్ చెల్లింపులు మరింత ఈజీ!
Also Read: Corona Cases:- స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా 11,919 మందికి వైరస్
Also Read: రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విషయం మర్చిపోయాయ్.. చిరు వ్యాఖ్యలు
Also Read: మోహన్ బాబు ఇంట్లో విషాదం.. పునీత్ భార్య ఎమోషనల్ పోస్ట్..
Also Read: ‘స్పైడర్ మ్యాన్ - నో వే హోమ్’ తెలుగు ట్రైలర్ వచ్చేసింది.. అన్ని విశ్వాల విలన్లతో భారీ పోరు!
Also Read: అప్‌కమింగ్ టాలెంట్‌కు ఛాన్స్ ఇచ్చిన అల్లు అర్జున్... సమంతతో స్పెషల్ సాంగ్‌కు అతడే కొరియోగ్రాఫర్!
Also Read: రూపాయి పాపాయి లాంటిది.. పెంచి పెద్ద చేసుకోవాలి.. ఇంట్రెస్టింగ్‌గా ‘అనుభవించురాజా’ ట్రైలర్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి