Honda CB1000 Hornet SP: 1000cc బైక్‌కి నూతన బెంచ్‌మార్క్ - రూ.13.29 లక్షలకే 157hp పవర్
Honda CB1000 Hornet SP బైక్ 157hp శక్తితో, Brembo బ్రేక్స్, Öhlins సస్పెన్షన్, డ్యూయల్-చానల్ ABS వంటి అధునాతన ఫీచర్లతో వచ్చింది.

1000cc Bikes India 2025 - 2026: Honda CB1000 Hornet SP... ఈ పేరు వింటేనే పవర్‌ఫుల్ 1000cc బైక్ అనిపిస్తుంది. ఈ బైక్ గురించి మరింత ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే... కేవలం వేగం మాత్రమే కాదు, మన రోడ్లపై కూడా రోజువారీగా నడిపించగలిగేంత ఫ్రెండ్లీ స్వభావం కలిగి ఉండటం. భారత్‌లో హోండా బిగ్ బైక్‌లంటే రిలయబిలిటీ, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు, లాంగ్ లైఫ్ అనేది అందరికీ తెలిసిన విషయం. కానీ ఈ Hornet SP ధరలో కూడా అదిరిపోయే పోటీ చూపిస్తోంది.
రూ.13.29 లక్షల ఎక్స్-షోరూమ్ ధర కలిగిన ఈ 1000cc సూపర్‌నేకిడ్ Brembo Stylema బ్రేక్స్, Öhlins TTX సస్పెన్షన్, Fireblade ఆధారంగా రూపొందించిన 157hp ఇంజిన్, పూర్తి ఎలక్ట్రానిక్ ప్యాకేజీతో ఈ బండి వస్తోంది. ఈ సెగ్మెంట్ మాత్రమే కాదు, రెండు సెగ్మెంట్లు కింద ఉన్న బైక్‌లకూ ఇది గట్టి పోటీ ఇస్తోంది.
వేగం ఉన్నా కూడా ఫ్రెండ్లీ
భారీ 157hp పవర్ ఉన్నా కూడా ఈ బైక్‌ను నడిపితే తొలిసారి డ్రైవ్ చేస్తున్న వారికి కూడా భయం పుట్టదు. రాత్రిపూట ప్రయాణంలోనూ, ఎలాంటి ఇబ్బంది లేకుండా స్మూత్‌గా నడుస్తూ ఆశ్చర్యపరిచేంత ఫ్రెండ్లీ ఫీల్ ఇస్తుంది. Standard రైడింగ్ మోడ్‌లో థ్రాటిల్ రెస్పాన్స్ రైడర్ అదుపులో ఉంటుంది.
అయితే, పగటి పూట హైవే మీద Sport మోడ్ ఆన్ చేస్తే మాత్రం ఈ బైక్ అసలు స్వభావం బయటపడుతుంది. థ్రాటిల్ తిప్పగానే 157hp ఇంజిన్ గర్జిస్తూ ముందుకు దూసుకుపోతుంది. 6000rpm దాటిన వెంటనే వచ్చే ఎగ్జాస్ట్ సౌండ్, రైడర్‌కి వేరే లెవెల్ థ్రిల్ ఇస్తుంది.
రైడ్ & హ్యాండ్లింగ్ – 212kg బరువు అనిపించదు
కఠినమైన రోడ్లపై కూడా Showa ఫోర్క్, Öhlins మోనోషాక్ సస్పెన్షన్ చాలా మృదువుగా పని చేస్తాయి. బంప్‌లు ఉన్నా కూడా బైక్ స్టేబుల్‌గా ఉంటుంది. Bridgestone S22 టైర్లు కార్నర్‌లలో అద్భుతమైన గ్రిప్ ఇస్తాయి. 212kg బరువు ఉన్నా కూడా వంకర రోడ్లలో హాయిగా నడుస్తున్నట్లుగా వెళుతుంది. Brembo Stylema బ్రేక్‌లు శక్తివంతమైనవే అయినా కూడా భయపెట్టేలా కాకుండా, రైడర్ నియంత్రణలో ఉండేలా పని చేస్తాయి.
రోజువారీ ప్రయాణాలకు అనువుగా ఉండే ప్రాక్టికల్ ఫీచర్లు
809mm సీట్ హైట్ తక్కువగా ఉండటం వల్ల 5.7 అడుగుల ఎత్తు ఉన్న వాళ్లకూ సులభంగా గ్రౌండ్ టచ్ అవుతుంది.
క్లచ్ కూడా తేలికగా ఉంటుంది.
135mm గ్రౌండ్ క్లియరెన్స్ మాత్రం జాగ్రత్తగా చూసుకోవాల్సిన విషయమే.
సైడ్‌స్టాండ్ బేస్ వెడల్పుగా ఉండటం ఒక పెద్ద ప్రయోజనం. మట్టి ఉన్న ప్రదేశాల్లో కూడా బైక్ సులభంగా నిలబడుతుంది.
ఎలక్ట్రానిక్స్ & ఫీచర్లు – 5 ఇంచ్ TFT స్పెషల్ ఆకర్షణ
Sport, Standard, Rainతో పాటు రెండు యూజర్ మోడ్‌లు ఉన్నాయి. పవర్ డెలివరీ, ఇంజిన్ బ్రేకింగ్, ట్రాక్షన్ కంట్రోల్‌ను మనం మనకు నచ్చినట్టు సెట్ చేసుకోవచ్చు. 5 అంగుళాల TFT డిస్‌ప్లే మాత్రం Big-bike సెగ్మెంట్‌లో బెస్ట్ UI కలిగి ఉందని చెప్పొచ్చు. క్లిష్టమైన మెనూలు ఏమీ లేవు, చాలా సులభంగా సెట్టింగులు మార్చుకోవచ్చు.
ధర పరంగా చూస్తే అసలైన విజేత
రూ.13.29 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు ఈ స్థాయి పవర్, ఈ స్థాయి హార్డ్‌వేర్, ఈ స్థాయి టెక్నాలజీ ఇవ్వడం నిజంగా ఆశ్చర్యమే. ఇదే ధరలో Triumph Street Triple RS, Ducati Scrambler Full Throttle ఉన్నా కూడా అవి Hornet SPకి దగ్గరగా లేవు.
హోండా నమ్మకం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ సర్వీస్ బిల్ కూడా కేవలం ₹6,475 మాత్రమే రావడం ఈ బిగ్ బైక్ వర్గంలో చాలా పెద్ద ఆఫర్ లాంటిదే.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















