స్కోడా, జీప్, హోండా, మారుతి.. అన్ని SUVల మీద బంపర్ డిస్కౌంట్లు - మిస్ కాకూడని డీల్స్
డిసెంబర్ నెలలో, మన SUV మార్కెట్‌లో భారీ ఇయర్ ఎండ్ డిస్కౌంట్లు వెల్లువెత్తాయి. స్కోడా కుషాక్, జీప్ కంపాస్, టైగన్, ఎలివేట్ వంటి టాప్ 10 SUVs పై లక్షల రూపాయల తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి.

Year End Car Discounts On SUVs India: డిసెంబర్ వచ్చేసింది అంటే ఆటోమొబైల్ మార్కెట్‌లో ఆఫర్ల హడావిడి మొదలైనట్టే. 2025 చివరి నెలలో కార్ కంపెనీలు భారీ డిస్కౌంట్లు ప్రకటించాయి. జనవరి నుంచి చాలా బ్రాండ్లు ధరలు పెంచే అవకాశం ఉన్నందున, కొత్త SUV కొనాలని అనుకునే వారికి ఇది బంగారు అవకాశం. మన మార్కెట్లో ప్రస్తుతం అత్యధిక డిస్కౌంట్‌లు ఉన్న టాప్-10 SUVs గురించి ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం.
1. Skoda Kushaq – రూ. 3.25 లక్షల వరకు డిస్కౌంట్
స్కోడా త్వరలో కుషాక్ ఫేస్‌లిఫ్ట్‌ను తెస్తోంది. అందుకే ప్రస్తుత మోడల్‌పై భారీగా రూ. 3.25 లక్షల వరకు ఇయర్ ఎండ్ తగ్గింపులు అందిస్తోంది. 115hp 1.0 టర్బో పెట్రోల్ (రూ. 10.61 – 16.89 లక్షలు) & 150hp 1.5 టర్బో పెట్రోల్ (రూ. 17.13 – 18.43 లక్షలు) ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.
2. Jeep Compass – రూ. 2.55 లక్షల వరకు తగ్గింపు
జీప్ కంపాస్ కూడా భారీ ఆఫర్లతో లిస్టులో చోటు దక్కించుకుంది. కన్జ్యూమర్ ఆఫర్లు, కార్పొరేట్ బెనిఫిట్స్, స్పెషల్ స్కీమ్స్ కలిపి మొత్తం రూ. 2.55 లక్షల వరకు తగ్గింపు లభిస్తోంది. 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్, 4WD ఆప్షన్ దీని హైలైట్. ధరలు రూ. 17.73 – 26.45 లక్షల మధ్య ఉన్నాయి.
3. Volkswagen Taigun – రూ. 2 లక్షల వరకు ఆఫర్
స్కోడా కుషాక్‌కు బ్యాడ్జ్-ఇంజనీర్డ్ వెర్షన్ అయిన టైగన్, డిసెంబర్‌లో రూ. 2 లక్షల వరకు డిస్కౌంట్‌తో లభిస్తోంది. బేస్ Comfortline వేరియంట్ ధరను కూడా రూ. 10.58 లక్షలకు తగ్గించారు. దీనిలో 1.0 & 1.5 టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లు లభ్యం.
4. Honda Elevate – రూ. 1.76 లక్షల వరకు తగ్గింపు
హోండా ఎలివేట్ కూడా బంపర్ ఆఫర్లతో మార్కెట్లో హీట్ పెంచింది. 1.5 లీటర్ iVTEC పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చే ఈ SUV డిసెంబర్‌లో రూ. 1.76 లక్షల వరకు డిస్కౌంట్‌తో ఈ లిస్ట్‌లో ఉంది. ధరలు రూ. 11 లక్షలు – 16.47 లక్షల మధ్య ఉన్నాయి.
5. Nissan Magnite – రూ. 1.36 లక్షల వరకు ఆఫర్లు
దక్షిణ భారత రాష్ట్రాల్లో మాగ్నైట్‌పై అత్యధికంగా రూ. 1.36 లక్షల వరకు డిస్కౌంట్ లభిస్తోంది. 1.0 NA పెట్రోల్, 1.0 టర్బో పెట్రోల్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ధరలు రూ. 5.62 లక్షలు – 10.76 లక్షలు.
6. Maruti Suzuki Jimny – రూ. 1 లక్ష వరకు తగ్గింపు
4WD SUV కొనాలనుకునే వారికి జిమ్నీ ఇప్పుడు సరైన డీల్. రూ. 1 లక్ష వరకు డైరెక్ట్ క్యాష్ డిస్కౌంట్ లభిస్తోంది. 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 5MT లేదా 4AT గేర్ బాక్స్‌తో వస్తోంది.
7. Kia Syros & MG Hector – రూ. 90,000 వరకు డిస్కౌంట్
కియా సైరోస్, MG హెక్టర్‌పై కూడా ఇయర్ ఎండ్ ఆఫర్లు వర్తిస్తున్నాయి. సైరోస్ 1.2 టర్బో పెట్రోల్, 1.5 డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుండగా, హెక్టర్ 1.5 టర్బో పెట్రోల్, 2.0 డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది.
8. Hyundai Exter – రూ. 85,000 వరకు తగ్గింపు
హ్యుందాయ్‌లో అత్యంత చవక SUV అయిన ఎక్స్‌టర్, డిసెంబర్‌లో రూ. 85,000 వరకు ఆఫర్‌తో దొరుకుతోంది. 1.2 లీటర్ పెట్రోల్, CNG ఆప్షన్ కూడా ఉంది.
9. Maruti Suzuki Fronx – రూ. 78,000 వరకు ఆఫర్లు
సబ్-4 మీటర్ SUV ఫ్రాంక్స్ రూ. 78,000 వరకు డిస్కౌంట్‌తో లభిస్తోంది. 1.0 టర్బో పెట్రోల్, 1.2 NA పెట్రోల్, CNG ఆప్షన్లలో అందుబాటులో ఉంది.
10. Skoda Kylaq & Tata Harrier – రూ. 75,000 వరకు తగ్గింపు
కైలాక్, హారియర్‌పై కూడా మంచి ప్రయోజనాలు ఉన్నాయి. కైలాక్ 1.0 టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో, హారియర్ 2.0 డీజిల్ ఇంజిన్‌తో వచ్చింది.
డిసెంబర్ 2025 ఈ SUV ఆఫర్లు నిజంగా మిస్ చేయకూడని డీల్స్. జనవరిలో ధరలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి, అంతకంటే ముందే కొనాలనుకుంటే ఇదే సరైన టైమ్.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















