0 నుంచి 100 km స్పీడ్‌లో ఏ బైక్ రుస్తుమ్? Royal Enfield నుంచి Aprilia వరకు - టాప్ 10 ఫాస్టెస్ట్ ఇండియన్ బైక్స్ లిస్ట్ ఇదే!
ఇండియాలో తయారైన బైక్స్‌ను 0-100 km స్పీడ్ టెస్ట్‌లో ఆశ్చర్యపరిచే ఫలితాలు వచ్చాయి. Royal Enfield నుంచి Aprilia వరకు ఏ బైక్ ఎంత వేగంగా దూసుకెళ్లిందో ఈ లిస్ట్‌లో చూడండి.

Fastest Indian Motorcycles 2025: భారత్‌లో తయారయ్యే బైక్స్ పనితీరు ఇప్పుడు ప్రపంచ స్థాయిలో కూడా గుర్తింపు పొందుతోంది. తక్కువ కెపాసిటీ ఇంజిన్ ఉన్నా శక్తిమంతమైన యాక్సిలరేషన్ ఇవ్వగల బైక్స్ వరుసగా మార్కెట్లోకి వస్తున్నాయి. మన దేశంలో తయారైన మోటార్‌సైకిళ్లను, 0 నుంచి 100 కి.మీ. వేగానికి చేరుకునే సమయం ఆధారంగా ర్యాంక్ చేస్తే, ఏ బండ్లు టాప్-10లో చోటు దక్కించుకున్నాయంటే...
10. Royal Enfield Guerrilla 450 - 6.59 సెకన్లు
రాయల్ ఎన్‌ఫీల్డ్ Guerrilla 450, Himalayan 450 ప్లాట్‌ఫామ్‌పై తయారైంది, కానీ రోడ్‌స్టర్ స్టైల్లో ఉంటుంది. టెస్టింగ్ టైమ్‌లో వాతావరణం తడిగా ఉన్నా కూడా ఇది 0–60 కి.మీ. వేగాన్ని కేవలం 2.96 సెకన్లలో సాధించింది. మంచి రోడ్ టైర్లు పెడితే ఇంకాస్త వేగం సాధించే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
9. BSA Gold Star 650 - 6.47 సెకన్లు
652cc సింగిల్ సిలిండర్ ఇంజిన్, 45hp పవర్, 55Nm టార్క్ వంటి శక్తిమంతమైన స్పెసిఫికేషన్లతో వచ్చిన ఈ బైక్ బరువు కొంచెం ఎక్కువే. అయినా 6.47 సెకన్లలో 100 కి.మీ. వేగం అందుకోవడం గోల్డ్ స్టార్ 650కు గర్వకారణమే. 0–60 వేగాన్ని 2.82 సెకన్లలో టచ్ చేయడం కూడా ఆకట్టుకునే అంశం.
8. Royal Enfield Continental GT 650 - 6.45 సెకన్లు
648cc ప్యారలల్ ట్విన్ ఇంజిన్ కలిగిన GT 650, BSA గోల్డ్ స్టార్‌ను కేవలం 0.02 సెకన్ల తేడాతో దాటింది. టార్క్ కొద్దిగా తక్కువ కావడంతో 0–60 కి.మీ. వేగం మాత్రం 2.94 సెకన్లు పట్టింది.
7. Royal Enfield Himalayan 450 - 6.35 సెకన్లు
అడ్వెంచర్ బైక్ అయినా వేగంలో మాత్రం దేనికీ తగ్గదు. 0–60 కి.మీ. వేగాన్ని 2.62 సెకన్లలో అందుకుంది. KTM 390 Adventureతో పోలిక చేస్తే 60 కి.మీ. వరకు రెండూ సమానమే, కానీ 100 కి.మీ.కి చేరే సమయానికి హిమాలయన్ కొద్దిగా వెనుకబడింది.
6. Bajaj Pulsar NS400Z - 6.26 సెకన్లు
373cc ఇంజిన్, 43hp పవర్ ఇచ్చే ఈ బైక్‌ను 2025లో అప్‌డేట్ చేశారు. కొత్త టైర్లతో, పెరిగిన పవర్‌తో 0–100 కి.మీ. వేగం 6.26 సెకన్లలో వచ్చింది. ఈ లిస్ట్‌లోని అత్యంత అందుబాటు ధరలో దొరికే బైక్ ఇదే.
5. KTM 390 Enduro R - 5.90 సెకన్లు
పూర్తిగా ఆఫ్-రోడ్ స్పిరిట్‌తో వచ్చిన ఈ వెర్షన్ 6 సెకన్లలోపే 100 కి.మీ. వేగాన్ని చేరడం అద్భుతం. 46hp పవర్, తక్కువ బరువు కలిపి దీని పనితీరును మరింత పెంచాయి.
4. KTM 390 Adventure - 5.80 సెకన్లు
ఎండ్యూరో R కంటే 5 కిలోలు ఎక్కువ బరువు ఉన్నా, రోడ్-టైప్ టైర్లు ఉండడం వల్ల 390 అడ్వెంచర్ మరింత వేగంగా దూసుకెళ్లింది. 60 కి.మీ. వరకు హిమాలయన్‌తో సమంగా ఉన్నా, 100 కి.మీ. వేగాన్ని చేరడంలో KTM ముందంజలో ఉంది.
3. KTM 390 Duke - 5.21 సెకన్లు
పెర్ఫార్మెన్స్ సెగ్మెంట్‌లో ఎప్పటి నుంచో బెంచ్‌మార్క్‌గా ఉన్న 390 Duke, తక్కువ బరువు కారణంగా ప్లాట్‌ఫామ్‌లోని ఇతర KTM మోడళ్ల కంటే వేగంగా దూసుకెళ్తుంది. 0–60ను 2.21 సెకన్లలో తాకడం దీని ప్రత్యేకత.
2. Aprilia RS 457 - 4.99 సెకన్లు
47.6hp ప్యారలల్ ట్విన్ ఇంజిన్‌తో వచ్చిన ఈ బైక్ 5 సెకన్లలోపే 100 కి.మీ. వేగం అందుకోవడం దీని అసలైన శక్తిని చూపించింది. ధర ఎక్కువైనా పనితీరు మాత్రం ప్రీమియం బైక్స్‌కు టఫ్ పోటీ ఇస్తుంది.
1. Aprilia Tuono 457 - 4.88 సెకన్లు
ఈ లిస్ట్‌లో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నది Tuono 457. RS 457తో సమానమైన ఇంజిన్ ఉన్నా, గేర్ రేషియో చిన్నగా ఉండటం వల్ల వేగం మరింత చురుకుగా ఉంది. 0–100 కి.మీ.ని కేవలం 4.88 సెకన్లలో టచ్ చేసి భారతీయ బైక్స్‌లో స్పీడ్ కింగ్‌గా నిలిచింది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















