అన్వేషించండి

Trump Interview with Elon Musk: హ‌త్యాయ‌త్నం త‌ర్వాత దేవుడి మీద న‌మ్మ‌కం పెరిగింది - డొనాల్డ్ ట్రంప్‌

Donald Trump | అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ను టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Donald Trump-Elon Musk Interview | అగ్ర‌రాజ్యం అమెరికాలో ఎన్నిక‌ల వేడి రోజురోజుకు మరింత రాజుకుంటోంది. న‌వంబ‌ర్‌లో జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల కోసం డెమోక్ర‌టిక్ పార్టీ నుంచి క‌మ‌లా హారిస్‌, రిప‌బ్లిక‌న్ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్ విజ‌యం కోసం నువ్వా నేనా అనేలా పోరాడుతున్నారు. అమెరికా మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ను టెస్లా, ఎక్స్ సీఈవో, ప్ర‌పంచ కుబేరుడు ఎల‌న్ మ‌స్క్ చేసిన ఇంట‌ర్వ్యూ ఇప్పుడు సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ సంద‌ర్భంగా ట్రంప్ మాట్లాడిన మాట‌లు వైర‌ల్‌గా మారాయి.

ఇంట‌ర్వ్యూపై DDOS ఎటాక్

వీరిద్ద‌రి క‌ల‌యికే ఒక సెన్సేష‌న్. అలాంటిది ఇంటర్వ్యూను చూడ‌టానికి నెటిజ‌న్లు పోటీ ప‌డ్డారు. ఈ క్రేజీ ఇంట‌ర్వ్యూపై DDOS (distributed denial-of-service ) ఎటాక్ జ‌రిగిన‌ట్టు గుర్తించారు. ఎక్స్ వేదికగా ప్రసారమైన ఇంటర్వ్యూ ట్రాఫిక్‌ను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ దాడి జరిగింది. స‌ర్వ‌ర్‌ ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడమే లక్ష్యంగా ఈ దాడి జ‌ర‌గ‌డంతో షెడ్యూల్ సమయానికంటే ఇంటర్వ్యూ కాస్త ఆలస్యంగా జరిగింది. దీంతో అనుకున్న‌దానిక‌న్నా తక్కువ మంది యూజర్లు మాత్రమే ట్రంప్- మస్క్ ఇంటర్వ్యూ చూడగలిగారు. మొద‌ట సాంకేతిక సమస్య అనుకున్నా, తర్వాత దాడి జరిగినట్టు గుర్తించారు. ఎక్స్‌లోె లైవ్ టెలికాస్ట్ అయినప్పుడు ప్రారంభంలో ఈ ఇంటర్వ్యూను ఏకంగా 1 మిలియన్ కంటే ఎక్కువ మంది వీక్షించారు. ఇది శతాబ్దపు ఇంటర్వ్యూ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అన్ని రికార్డులు బద్దలు కొట్టినందుకు సంతోషంగా ఉందన్నారు.

ఈ ఇంటర్వ్యూలో ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధ్య‌క్ష ఎన్నిక‌లు 2024 నుంచి బైడెన్ నిష్ర్ర్క‌మ‌ణ ఒక తిరుగుబాటు అని ట్రంప్ అభివ‌ర్ణించారు. ఆయ‌న్నుబ‌ల‌వంతంగా రేసు నుంచి త‌ప్పించార‌ని ఆరోపించారు. డిబేట్‌లో బైడెన్‌ను తాను చిత్తుచిత్తుగా ఓడించాన‌ని చెప్పారు. ట్రంప్ మాట్లాడుతుంటే ఎల‌న్ మ‌స్క్ సైతం మ‌రింత మ‌సాలా ద‌ట్టించి ఆసక్తి క‌లిగించారు. త‌నపై జ‌రిగిన హ‌త్యాయ‌త్నం గురించి కూడా ట్రంప్ మాట్లాడారు. ప్ర‌సంగిస్తున్న‌ప్పుడు చెవికి దెబ్బ త‌గిలిన‌ప్పుడు అది బుల్లెట్ అని తన‌కు అర్థ‌మైంద‌ని ట్రంప్ అన్నారు. ఇక‌పై దేవుడ్ని న‌మ్మ‌ని వారి గురించి కూడా మ‌నం ఆలోచించ‌డం మొద‌లుపెట్టాల‌ని, త‌న‌పై జ‌రిగిన హ‌త్యాయ‌త్నం త‌ర్వాత దేవుడి మీద న‌మ్మ‌కం పెరిగింద‌ని ట్రంప్ చెప్ప‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

మ‌స్క్‌కు ట్రంప్ జాబ్ ఆఫ‌ర్

ఇంట‌ర్వ్యూ మ‌ధ్య‌లో మాట్లాడుతూ ఎల‌న్ మ‌స్క్‌కు జాబ్ ఆఫ‌ర్ చేశారు ట్రంప్‌. మా ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక క‌లిసి ప‌నిచేద్దామ‌న్నారు. ఖ‌ర్చుల నియంత్ర‌ణ బాధ్య‌త‌ల‌ను చూసుకోవాల‌ని మ‌స్క్‌ను కోరారు. ఖ‌ర్చుల నియంత్ర‌న‌లో మ‌స్క్ గొప్ప నిపుణుడ‌ని ట్రంప్ ప్ర‌శంసించారు. ఆయ‌న కంపెనీల్లో కాస్ట్ క‌టింగ్ చాలా ప్ర‌భావవంతంగా అమ‌ల‌వుతుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. టాక్స్ పేయ‌ర్ల నుంచి వ‌సూలు చేసే ప్ర‌తి రూపాయిని జాగ్ర‌త్త‌గా వినియోగించ‌డ‌మే త‌న ల‌క్ష్య‌మ‌ని ఆయ‌న అన్నారు. వారి క‌ష్టార్జితాన్ని వృథా చేయ‌డం త‌న‌కు ఇష్టం లేద‌ని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఈ జాబ్ ఆఫ‌ర్‌ను స్వీక‌రిస్తే అమెరికాకు కూడా ప్ర‌యోజ‌నం చేకూరుతుంద‌ని మ‌స్క్‌తో అన్నారు.

వ‌ల‌స‌దారుల‌పై ఉక్కుపాదం

ఈ ఇంట‌ర్వ్యూలో అనేక ప్ర‌పంచ స‌మ‌స్య‌లు, సంక్షోభ ప‌రిస్థితులపై చ‌ర్చ జ‌రిగింది. 2019 ఎన్నికల్లో ఓటమి, పెన్సిల్వేనియా బట్లర్ ప్రాంతంలో జరిగిన ప్రాణాంతక దాడి, భారత్‌తో ఉన్న సంబంధాలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్- పాలస్తీనా దేశాల మధ్య తలెత్తిన సంక్షోభ పరిస్థితులు, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పరిపాలన, అఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా బలగాలను ఉపసంహరించుకోవడం త‌దిత‌ర అంశాల‌పై ట్రంప్ స్పందించారు. తాను అదికారంలోకి వ‌చ్చిన వెంట‌నే అక్ర‌మ వ‌ల‌స‌ల‌పై ఉక్కు పాదం మోపుతాన‌ని ట్రంప్ స్ప‌ష్టం చేశారు. అమెరికాకు అక్రమంగా వలస వెళ్లే వివిధ దేశాల పౌరులను రాడికల్స్‌గా, టెర్రరిస్టులుగా ట్రంప్ అభివర్ణించారు. నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో వ‌ల‌స‌దారుల ప్ర‌భావం తీవ్రంగా ఉంటుందని తాను భావిస్తున్న‌ట్టు చెప్పారు. ఎన్నికలను నిష్ఫక్షపాతంగా జరిపించాల్సిన అవసరం ఉందని అభిప్రాయ‌ప‌డ్డారు. 

అమెరికన్ల కలలు సాకారం చేస్తా..

అమెరికన్ల కలలను సాకారం చేయ‌డానికి త‌న వ‌ద్ద ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. భారీ కంపెనీలను స్థాపించాల్సిన అవసరాన్ని ఆయ‌న గుర్తు చేశారు. అమెరిక‌న్ ప్రజలకు స్వదేశంలోనే కోరుకున్న ఉద్యోగాలు అందుబాటులోకి తీసుకుని రావాలనేదే తన లక్ష్యమని చెప్పారు. ఈ సంద‌ర్భంగా క‌మ‌లా హ్యారిస్‌పై ప‌లు ఆరోప‌ణ‌లు చేశారు. ఆమె న‌ల్ల జాతీయురాలిగా గుర్తింపు పొంద‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నార‌ని చెప్పారు. అమెరికాలో భార‌తీయ‌త‌ను ప్రోత్స‌హించేలా ఆమె వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ట్రంప్ దుయ్య‌బ‌ట్టారు. 

భార‌తీయులంటే గౌర‌వ‌మే కానీ..

భార‌తీయుల‌న్నా, న‌ల్ల జాతీయుల‌న్నా త‌న‌కు అపార‌మైన గౌర‌వం ఉంద‌ని, కానీ ఆమెలా రాజ‌కీయాల కోసం వాడుకోవ‌డం లేద‌ని విమ‌ర్శించారు. మీడియా, సోష‌ల్ మీడియా వేదిక‌ల్లో ఎదుర‌య్యే ప్ర‌శ్న‌ల‌కు సమాధానాలు చెప్పకుండా క‌మ‌లా హ్యారిస్ త‌ప్పించుకుంటున్నార‌ని ట్రంప్ విమ‌ర్శించారు. కమలా డెమోక్రటిక్ అభ్యర్థిగా నామినేట్ అయిన నాటి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు తనతో డిబేట్లకు ముందుకు రావట్లేదని డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget