అన్వేషించండి

Special Status: బిహార్‌కి ప్రత్యేక హోదా ఇచ్చే ఆలోచనే లేదు, తేల్చి చెప్పిన కేంద్రం - నితీశ్‌ ఏం చేస్తారు?

Bihar: బిహార్‌కి ప్రత్యేక హోదా ఇచ్చే ఆలోచన తమకు లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. దీనిపై జేడీయూ ఎంపీలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Special Status For Bihar: తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఎన్నో రోజులుగా కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నారు. పైగా ఇప్పుడు NDA మిత్రపక్షాల్లో జేడీయూ కూడా ఉండడం వల్ల స్పెషల్ స్టేటస్ కచ్చితంగా వస్తుందని అంతా భావించారు. కానీ అందుకు కేంద్ర ప్రభుత్వం మాత్రం పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అలాంటి ఆలోచనే లేదని తేల్చి చెబుతోంది. ఈ క్రమంలోనే బిహార్‌లో అప్పుడే రాజకీయాలు వేడెక్కాయి. నితీశ్ కుమార్‌పై రాష్ట్రీయ జనతా దళ్ (RJD) తీవ్రంగా మండి పడుతోంది. బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న క్రమంలోనే జేడీయూ ఎంపీ ఆర్థిక మంత్రిత్వ శాఖని ఓ ప్రశ్న అడిగారు. బిహార్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే ఆలోచన ఉందా అని ప్రశ్నించారు. అందుకు ఆర్థిక శాఖ తరపున సహాయ మంత్రి పంకజ్ చౌదరి "అలాంటి ఆలోచన ఏమీ లేదు" అని సమాధానం చెప్పారు. ప్రత్యేక హోదా వస్తే కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎక్కువ మొత్తంలో నిధులు వస్తాయని నితీశ్ భావిస్తున్నారు. అయితే..రాజ్యాంగంలో మాత్రం ఎక్కడా ప్రత్యేక హోదా ప్రస్తావన లేదు. 1969లో ఐదో ఆర్థిక సంఘం ఈ ప్రతిపాదనలు తీసుకొచ్చింది. ఇప్పటి వరకూ జమ్ముకశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌కి తప్ప మరే రాష్ట్రానికీ ప్రత్యేక హోదా లేదు. ఈ స్టేటస్ వస్తే కేంద్రం నుంచి ఆర్థిక పరంగా ఎక్కువ సహకారం అందుతుంది. వచ్చే నిధుల వాటా పెరుగుతుంది. అయితే...ఇటీవల జరిగిన ఎన్నికల్లోనూ బిహార్ ప్రత్యేక హోదా కీలక అంశమైంది. 

జేడీయూ ఎప్పటి నుంచో ప్రత్యేక హోదా సాధించాలని చూస్తోంది. అయితే..ఈ సారి బీజేపీకి మెజార్టీ రాకపోవడం వల్ల జేడీయూ సాయంతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ప్రత్యేక హోదా అంశం మరోసారి తెరపైకి వచ్చింది. జేడీయూ ఎంపీలు మాత్రం ప్రత్యేక హోదాపై చాలా పట్టుదలతో ఉన్నారు. ఎన్నో ఏళ్లుగా ఇలానే వివక్ష చూపిస్తున్నారని మండి పడుతున్నారు. నితీశ్ కుమార్ గతంలో ఈ హోదా కోసం భారీ ర్యాలీలు నిర్వహించారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ప్రత్యేక ప్యాకేజ్ వచ్చేలా అయినా డిమాండ్ వినిపించాలని జేడీయూ ఎంపీలు భావిస్తున్నారు. కూటములు మార్చడంలో నితీశ్‌కి ట్రాక్‌ రికార్డ్ ఉంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఇండీ కూటమిలో ఉన్న ఆయన ఎన్నికలు దగ్గర పడే సమయానికి NDAలో చేరారు. అప్పుడే ప్రత్యేక హోదా తీసుకొస్తారన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పైగా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు కావడంలో JDU కీలక పాత్ర పోషించింది. అందుకే కచ్చితంగా స్పెషల్ స్టేటస్ వచ్చేస్తుందని అనుకున్నారు. కానీ కేంద్రం ఆ ఆశలపై నీళ్లు చల్లింది. 

Also Read: Kanwar Yatra: కన్వార్‌ యాత్ర వివాదంలో యూపీకి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు, ఉత్తర్వులు ఆపేయాలని నోటీసులు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

హైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలులెబనాన్‌లో పేజర్ పేలుళ్ల కలవరం, ఇజ్రాయేల్‌పై ఆరోపణలుభారత్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు నేడే‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Embed widget