(Source: ECI/ABP News/ABP Majha)
అమెరికా వంతెన కూలిన ఘటనపై కార్టూన్, భారతీయుల్ని కించపరచడంపై నెటిజన్ల ఫైర్
Francis Scott Key Bridge: అమెరికాలో వంతెన కూలిన ఘటనపై గీసిన ఓ కామిక్ కార్టూన్ దుమారం రేపుతోంది.
Baltimore Bridge Collapse: ఇటీవల అమెరికాలో Francis Scott Key Bridge కూలిన ఘటనలో ఆరుగురు గల్లంతయ్యారు. ఇప్పటికీ వాళ్ల ఆచూకీ దొరకలేదు. ఆ ఆరుగురూ ప్రాణాలతో బయటపడే అవకాశాలు లేవని అధికారులు తేల్చి చెబుతున్నారు. అయితే...ఈ ప్రమాదం జరగక ముందు ఆ షిప్‌లోని భారతీయ సిబ్బంది ముందస్తు అప్రమత్తంగా చేసింది. ఫలితంగా ప్రమాద తీవ్ర తగ్గింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతోషం వ్యక్తం చేశారు. సరైన సమయంలో వాళ్లు అలెర్ట్ చేయకుండా ఉండుంటే పరిస్థితి వేరేగా ఉండేదని అన్నారు. భారతీయ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. అటు అధ్యక్షుడు పొగుడుతుంటే...మరో వైపు ఓ కామిక్ కార్టూన్ సంచలనం సృష్టిస్తోంది. భారతీయులను కించపరుస్తూ కార్టూన్ గీసింది Foxford Comics. సోషల్ మీడియాలో ఈ కార్టూన్‌ని పోస్ట్ చేసింది. అప్పటి నుంచి పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది.</p
Last known recording from inside the Dali moments before impact pic.twitter.com/Z1vkc828TY
— Foxford Comics (@FoxfordComics) March 26, 2024
>
ఈ కామిక్ వీడియోపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రమాదం జరిగే ముందు ఓడలోని భారతీయులంతా కంగారు పడినట్టుగా ఇందులో చూపించారు. అంతే కాదు. ఆ సిబ్బంది అంతా గోచీలు కట్టుకున్నట్టుగా డ్రెసింగ్ చేశారు. ఇది ఇంకాస్త దుమారం రేపింది. భారతీయుల్ని ఇంత దారుణంగా అవమానిస్తారా అంటూ మండి పడుతున్నారు నెటిజన్లు. జాతి వివక్ష అంటూ ఫైర్ అవుతున్నారు. ప్రమాదానికి జరిగే ముందు జరిగింది ఇదే అంటూ ఆ వీడియోని పోస్ట్ చేసింది ఆ కంపెనీ. ఆ వీడియోలో వెనక చాలా అరుపులు కేకలు వినిపించాయి. ఇండియన్స్ ఇంగ్లీష్ ఎలా మాట్లాడే తీరుపైనా సెటైర్‌లు వేశారు. ఇప్పటికే ఈ ట్వీట్‌కి మిలియన్‌ల వ్యూస్ వచ్చాయి. వేలాది కామెంట్స్ వచ్చాయి. ఇండియన్స్‌ని ఇలా కించపరచడమే కాకుండా షిప్ సిబ్బందినీ ఇలా తక్కువ చేసి చూపించినందుకూ మండి పడుతున్నారు నెటిజన్లు.
“These people (Indian Crew of the Ship) are heroes. They saved lives.”#Maryland Gov. Wes Moore says the ship that struck the Francis Scott Key Bridge in #Baltimore issued a #Mayday call, allowing for officials to clear the bridge of as many cars as possible.👇🏻 https://t.co/WQgofyMLZZ pic.twitter.com/67braaOuC3
— Pooja Sangwan ( Modi Ka Parivar ) (@ThePerilousGirl) March 27, 2024
అర్ధరాత్రి ఓడ ప్రయాణిస్తున్న సమయంలో ప్రొపల్షన్ సిస్టిమ్ పని చేయకుండా పోయింది. ఫలితంగా షిప్‌పై సిబ్బంది కంట్రోల్ కోల్పోయింది. దారి మార్చేందుకూ వీల్లేకుండా పోవడం వల్ల నేరుగా వెళ్లి బ్రిడ్జ్‌ని బలంగా ఢీకొట్టింది. ఢీకొడుతుందని ముందే అంచనా వేసిన సిబ్బంది Mayday Signal తో అప్రమత్తం చేసింది. ఇలా ముందుగా అలెర్ట్ చేసిన భారతీయ సిబ్బందికి అధ్యక్షుడు బైడెన్ థాంక్స్ చెప్పారు. చివరికి ఓడను ఆపేందుకు నీళ్లలోకి లంగర్‌లు విసిరింది సిబ్బంది. సిబ్బంది అప్రమత్తం చేయగానే బ్రిడ్జ్‌పై వాహనాల రాకపోకల్ని నిలిపివేశారు. అదే జరగకపోయుంటే ప్రాణనష్టం భారీగా ఉండేది. అప్పటికే కొన్ని వాహనాలతో పాటు 20 మంది నదిలో పడిపోయారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.