ఖలిస్థాన్ వేర్పాటువాది నిజ్జర్ హత్య కేసులో కీలక పరిణామం, ముగ్గురు భారతీయులు అరెస్ట్
Nijjar Killing: కెనడాలో నిజ్జర్ హత్య కేసులో ముగ్గురు భారతీయులను కెనడా పోలీసులు అరెస్ట్ చేశారు.
Nijjar Killing Case: కెనడాలో సంచలనం సృష్టించిన ఖలిస్థాన్ వేర్పాటువాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముగ్గురు అనుమానితులు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురూ భారతీయులే కావడం ఇంకాస్త అలజడిని పెంచింది. హర్‌దీప్ సింగ్ నిజ్జర్‌ని హత్య చేసిన Hit Squadలో ఈ ముగ్గురూ సభ్యులే అని కెనడా పోలీసులు అనుమానిస్తున్నారు. గతేడాది జూన్‌లో జరిగిన ఈ హత్య రెండు దేశాల మధ్య విభేదాలను పెంచింది. నిజ్జర్ హత్యలో భారత్ హస్తం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలు ఈ విభేదాలకు కారణమైంది. కరణ్ బరర్, కమల్‌ప్రీత్ సింగ్, కరణ్‌ప్రీత్ సింగ్ ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. కెనడాలోనే నాన్ పర్మినెంట్ రెసిడెంట్స్‌గా దాదాపు ఐదేళ్లుగా నివసిస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. వాళ్ల ఫొటోలనూ విడుదల చేశారు. ఈ ముగ్గురిపైనా ఫస్ట్ డిగ్రీ మర్డర్ కేసు నమోదు చేశారు. అయితే...ఈ ముగ్గురిలో ఎవరి పేరూ గత రికార్డుల్లో లేదని, పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నామని వెల్లడించారు. ఇప్పటికే స్పెషల్ టీమ్‌తో విచారణ మొదలు పెట్టినట్టు తెలిపారు.
"ఈ కేసులో రకరకాల బృందాలతో విచారణ కొనసాగిస్తున్నాం. కేవలం ఈ ముగ్గురితోనే విచారణ పూర్తికాదు. అవసరమైతే భారత ప్రభుత్వంతోనూ సంప్రదింపులు జరుపుతాం. ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వస్తే ఆ మేరకు చర్చిస్తాం"
- కెనడా పోలీస్ అధికారులు
ఏం జరిగింది..?
గతేడాది జూన్ 18న సుర్రే ప్రాంతంలో గురుద్వారలో ప్రార్థనలు చేసుకుని బయటకు వచ్చిన సమయంలోనే హర్‌దీప్ సింగ్ నిజ్జర్‌పై కొందరు దుండగులు కాల్పులు జరిపారు. ఆయన కార్‌ని అడ్డగించి కాల్చి అక్కడి నుంచి పరారయ్యారు. హాస్పిటల్‌కి తరలించినప్పటికీ అప్పటికే తీవ్ర రక్తస్రావం కావడం వల్ల నిజ్జర్ మృతి చెందాడు. అప్పటి నుంచి కెనడాలో రాజకీయ వాతావరణం పూర్తిగా మారిపోయింది. భారత్‌కి చెందిన వ్యక్తులే కచ్చితంగా ఈ పని చేసి ఉంటారని జస్టిన్ ట్రూడో ఆరోపించడమూ ఈ వాతావరణాన్ని ఇంకాస్త వేడెక్కించింది. భారత్ మాత్రం ఈ ఆరోపణల్ని తీవ్రంగా ఖండించింది. అయినా విచారణకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని తేల్చి చెప్పింది. హర్‌దీప్ సింగ్ నిజ్జర్‌ని NIA 2020లోనే టెర్రరిస్ట్‌గా ప్రకటించింది. ఈ కేసులో భారతీయుల్ని అరెస్ట్ చేసిన నేపథ్యంలో కెనడా ఎంపీ జగ్‌మీత్ సింగ్ X వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. భారత్ హస్తం ఉందనడానికి ఇదే సాక్ష్యం అని విమర్శించారు.
The Indian government hired assassins to murder a Canadian citizen on Canadian soil - at a place of worship.
— Jagmeet Singh (@theJagmeetSingh) May 3, 2024
Today 3 arrests were made.
Let me be clear - any Indian agent or state actor that ordered, planned or carried out this murder must be exposed and met with the full force…
Also Read: Tesla: చెక్కతో తయారు చేసిన టెస్లా వెహికిల్‌ని చూశారా, లుక్ అదిరిపోయింది