అన్వేషించండి

సహనాన్ని పిరికితనం అనుకోవద్దు- ఏం జరిగినా పోలీసులదే బాధ్యత- పలివెల ఘటనపై బండి హెచ్చరిక

మునుగోడు నియోజకవర్గం నాంపల్లిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన బండి సంజయ్‌... సీఎం కేసీఆర్, టీఎన్జీవో నాయకులపై విరుచుకుపడ్డారు.

మునుగోడులో జరిగేది కురుక్షేత్రమేనన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షడు బండి సంజయ్‌. ధర్మం బీజేపీ వైపే ఉందని అభిప్రాయపడ్డారు. ప్రజల కోసం రాజీనామా చేసిన మొనగాడు రాజగోపాల్ రెడ్డి అంటూ కామెంట్ చేశారు. ఆపదొస్తే ఆదుకునే రాజగోపాల్ రెడ్డి కావాలా? గెలిపిస్తే కేసీఆర్ గడీల వద్ద కాపాలా కాసే బానిస కావాలా? ఆలోచించి ఓటేయండని ప్రజలకు పిలుపునిచ్చారు. 

ఏనాడు ఈటల రాజేందర్ ఆవేశంగా మాట్లాడరు. సంయమనంతో మాట్లాడతారు.. అందుకే హుజూరాబాద్ ప్రజలు ఆశీర్వదించారు. అలాంటి వ్యక్తిపై పలివెలలో మాట్లాడుతుంటే దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్మం కోసం పనిచేసే కార్యకర్తలమని... సంయమనాన్ని, సహనాన్ని పిరికితనంగా భావించొద్దని ప్రత్యర్థులకు సూచించారు. ఇక్కడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా పోలీసు అధికారులదే బాధ్యతని... సీఎం కూడా కాపడలేరని హెచ్చరించారు. 

మునుగోడు నియోజకవర్గం నాంపల్లిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన బండి సంజయ్‌... సీఎం కేసీఆర్, టీఎన్జీవో నాయకులపై విరుచుకుపడ్డారు. ప్రచారం ముగిసినా మునుగోడులో తిష్టవేసే టీఆర్ఎస్ గూండాలను తరిమికొట్టాలన్నారు. మునుగోడులో జరుగుతోంది కురక్షేత్రమేనని... ఈ యుద్దంలో ధర్మం బీజేపీవైపే ఉందన్నారు బండి సంజయ్. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నాయకులు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా మునుగోడు గడ్డపై ఎగిరేది కాషాయ జెండానే అని ధీమా వ్యక్తం చేశారు. సీఎం మోచేతి నీళ్లు తాగుతూ ఉద్యోగుల జీవితాలను ఫణంగా పెట్టి అక్రమాస్తులు కూడగట్టిన ఆ ముగ్గురు టీఎన్జీవో నాయకుల బండారం బయటపెడతానని హెచ్చరించారు.

బీసీలు ఉన్నత చదువులు చదువుకుంటే టీఆర్ఎస్‌ను పట్టించుకోరనే భయంతోనే గొర్రెలు, బర్రెలతో సరిపెడుతూ బానిసలుగా చూస్తున్నారని ఆరోపించారు బండి సంజయ్‌. పోడు సమస్యలు పట్టించుకోలేదన్నారు. అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు ఇచ్చే సంగతి చెప్పలేదని ధ్వజమెత్తారు. వడ్డెర, ముదిరాజ్ సహా బీసీ కులస్తుల బాధలు చెప్పలేదని ఆక్షేపించారు. మునుగోడులో చదువుకున్న యువతీ యువకులు  ఉద్యోగాల్లేక ఆటో, క్యాబ్ డ్రైవర్లుగా పనిచేస్తుంటే.. కనీసం స్పందించలేదని విమర్శించారు. 

కేసీఆర్ దమ్ముంటే  మునుగోడులో ఎంతమంది యువతకు ఉద్యోగాలిచ్చారో శ్వేత పత్రం విడుదల చెయ్యాలని డిమాండ్‌ చేశారు. ఏమీ మాట్లాడకుండా  సర్కస్‌ మాదిరిగా ఆ నలుగురు ఎమ్మెల్యేలను తీసుకొచ్చి ఏదో చెప్పి వెళ్లిపోయారన్నారు. అసలు టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి ఎక్కడ? దొంగ లెక్క తిరుగుతున్నరా? బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మొనగాడు.. కేసీఆర్ గల్లా పట్టి గుంజుకొచ్చిన మొనగాడు కావాలా? గడీల దగ్గర కాపాలా కాసేటోలు కావాల్నా? అని మునుగోడు ప్రజలు చర్చించుకోవాలని బండి పిలుపునిచ్చారు. 

మునుగోడులో పెద్ద ఎత్తున ఆర్టీసీ కార్మికులున్నారని... కేసీఆర్‌ వల్ల 34 మంది కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే కనీసం భరోసా ఇచ్చే ప్రయత్నం చేయలేదన్నారు బండి సంజయ్. ఆర్టీసీ కార్మికుల కోసం పోరాడిన అశ్వథ్దామరెడ్డి ఉద్యోగం కోల్పోయి ఇబ్బంది పడుతున్నారన్నారు. ఓటేసే ముందు బలిదానం చేసిన ఆర్టీసీ కార్మికుల పోరాటాలు గుర్తు చేసుకోవాలని ఆర్టీసీ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. 

కొంతమంది టీఎన్జీవో నాయకులు ఉద్యోగుల జీవితాలను నాశనం చేస్తున్నారని ఆరోపించారు బండి సంజయ్‌. నేను వాళ్లకు క్షమాపణ చెప్పాల్నా.... మీరే ముక్కు నేలకు రాసి ఉద్యోగులకు క్షమాపణ చెప్పాలన్నారు. పొర్లు దండాలు చేయాలే.. మీ స్వప్రయోజనాల కోసం, మీ ప్రమోషన్లు, పైరవీల కోసం సీఎం దగ్గర మోకరిల్లినారని విమర్శలు చేశారు. మీ సంగతి చూస్తాం... మీ బండారం బయటపెడతాం... ఏసీబీకి పట్టుబడ్డోళ్లు... మీరు... ఏనాడైనా ఉద్యోగుల మనోభావాలను పట్టించుకున్నరా? వాళ్ల సమస్యలు పట్టించుకున్నరా? అందుకే మిమ్ముల్ని పక్కా తిడతా... సీఎం మోచేతి నీళ్లు తాగే బానిసబతుకులు బతుకున్న ఆ కొద్దిమంది టీఎన్జీవో నాయకులు అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు బండి సంజయ్‌.

హెచ్ఆర్‌సీ తగ్గిస్తే కూడా నోరు మెదపని దద్దమ్మలు టీఎన్జీవో నాయకులని విమర్శించారు బండి. బీజేపీ పోరాడితే తప్ప జీతాలు కూడా సక్రమంగా ఇవ్వలేని దుస్థితిలో ఉంటే ఎన్నడైనా సర్కార్ ను నిలదీశారా? మీకేమో కోట్ల ఆస్తులున్నయ్... కానీ ఉద్యోగులు సక్రమంగా జీతాలు రాకపోతే లోన్లు కట్టలేక, కిరాయి కట్టలేక అల్లాడుతున్నారని ధ్వజమెత్తారు. 3 డీఏలు ఇయ్యలే.. సరెండర్ లీవ్స్ లేవు.. 317 జీవోతో చెట్టుకొకరు పుట్టకొకరుగా మారిండ్రు.. ఎందుకు నిలదీయలేదన్నారు. 

వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయ్... ఏండ్ల తరబడి నియామకాల్లేవు... నిరుద్యోగ యువత అల్లాడుతున్నారు. మీరెందుకు ఉద్యోగాలు భర్తీ చేయాలని అడిగిన పాపానికి స్టేషన్‌ల చుట్టూ కొందరు యువత తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బండి. తాను బరాబర్ మాట్లాడతా.. ఉద్యోగుల కోసం జైలుకు వెళ్లొచ్చానన్నారు. బీజేపీ కార్యకర్తలు లాఠీ దెబ్బలు తిన్నారని... కేసులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. 

స్కూళ్లలో 20 వేల స్కావెంజర్లను తీసేసి చదువు చెప్పే హెడ్మాస్టర్లతో బాత్రూంలు కడిగిస్తున్న మూర్ఖులు ఈ పాలకులని బండి సంజయ్‌ ధ్వజమెత్తారు. మీరు రండి బాత్రూంలు కడగడానికి? డీఈవో, ఎంఈవో, హెడ్మాస్టర్ పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయ్. ఎందుకు కొట్లాడటం లేదు? పీఆర్సీ గురించి అడగరు? అని టీఎన్జీవో నాయకులను ప్రశ్నించారు. 

ఒక్కసారి క్షేత్రస్థాయిలోకి పోయి ఉద్యోగులు ఏమనుకుంటున్నరో.. ఎందుకు ఆలోచించడం లేదని బండి నిలదీశారు. డీఏల్లేవు, బెన్ ఫిట్స్ లేవు.. క్రమశిక్షణ కలిగిన పోలీస్ వ్యవస్థలో ఉండి మాట్లాడలేని దుస్థితి.. రాత్రింబవళ్లు తిండి తిప్పల్లేక అల్లాడుతుంటే ఎందుకు మాట్లాడటం లేదన్నారు. 

ఈ ముగ్గురు, నలుగురు టీఎన్జీవో నాయకులారా.. నోరెందుకు విప్పరు? ఏసీబీ కేసులో అడ్డంగా దొరికినోలు ఇయాళ మంత్రులైండ్రు అని బండి విమర్శించారు. మీ జెండాలు కలిసినాయ్... పార్టీలు కలిసినాయ్.. సంతోషమే.. కానీ కొంతమంది మనసులు కూడా కలిసినాయ్... మీ సంగతి తెల్వదా? నన్ను కెలికితే మీ బండారం బయటపెడతా...మీ సంగతి చూస్తా అంటూ హెచ్చరించారు. 

ఇప్పటికైనా క్షమాపణ కోరాలని... ఇన్నాళ్లు సీఎం దగ్గర మోకరిల్లినం... తప్పు చేసినమని చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. మీరు ధర్నా చేస్తే పిడికెడు మంది ఉద్యోగులు కూడా మీకు మద్దతియ్యలేదని ఎద్దేవా చేశారు. సోషల్ మీడియాలో మిమ్ముల్ని బూతులు తిడుతున్నా మీకు సిగ్గు రావడం లేదని నిలదీశారు. ఉద్యోగులారా... మీకు జరిగిన అన్యాయానికి మునుగోడు ఎన్నికల ద్వారా ప్రతీకారం తీర్చుకోండని పిలుపునిచ్చారు. 

ఎవరెన్ని కుట్రలు చేసినా మునుగోడు గడ్డపై ఎగిరేది కాషాయ జెండానే అన్నారు బండి సంజయ్. సాయంత్రానికి తామంతా వెళ్లిపోతామని... కానీ టీఆర్ఎస్ గూండాలు ఇక్కడే మకాం వేశారని... వాళ్లపై ఎన్నికల కమిషన్ సీరియస్‌గా తీసుకోవాలన్నారు. సాయంత్రం 6 గంటల తరువాత ఇక్కడే స్థానికేతరులు ఎవరున్నా ఉరికించి కొట్టాలని పిలుపునిచ్చారు.  

మునుగోడులో ఉన్న సమస్యలేమిటి? ఏయే హామీలిచ్చినం... ఎన్ని నెరవేర్చినం... ఎప్పుడు అమలు చేస్తారో.. అభివృద్ధి గురించి ప్రస్తావించకుండా భయంతో పారిపోయిన పిరికిపంద ముఖ్యమంత్రి కేసీఆర్ అని బండి సంజయ్ ధ్వజమెత్తారు. కోదారి శ్రీనన్న రాసిన సూడు సూడు నల్లగొండ పాటను కూడా తానే రాసినట్లు చెప్పుకున్న వ్యక్తి కేసీఆర్ అని ఇట్లనే పోతే ఆఖరికి జాతీయ గీతం జనగణమన కూడా తానే రాసినని చెప్పుకుంటారని ఎద్దేవా చేశారు. 

మునుగోడులోని బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల గురించి కనీసం ప్రస్తావించకపోవడాన్ని బండి తప్పుపట్టారు. చేనేత గురించి చెప్పినవన్నీ అబద్దాలేనన్నారు. గతంలో చేనేతలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ గురించి మాట్లాడలేదని ఆక్షేపించారు. బతుకమ్మ చీరల ఆర్డర్ చేనేత కార్మికులకు ఇయ్యలని డిమాండ్ చేశారు.  జీఎస్టీ వేయాలని చెప్పింది టీఆర్ఎస్సే అని... డ్రంకన్ డ్రైవ్ పెట్టి గౌడన్నలకు ఉపాధి లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. తాటిచెట్లు ఎక్కి చనిపోతున్నా కనీస సాయం చేయట్లేదన్నారు. గొల్ల కురమలను దారుణంగా మోసం చేస్తున్నారని... వాళ్ల ఖాతాలో వేసిన సొమ్మును ఫ్రీజ్ చేశారని తెలిపారు. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
World's Worst Tsunami: ఆ మహా ప్రళయానికి 20 ఏళ్లు -  మానవాళి మరచిపోలేని పీడకల, రాకాసి అలలు మిగిల్చిన కన్నీళ్లు!
ఆ మహా ప్రళయానికి 20 ఏళ్లు - మానవాళి మరచిపోలేని పీడకల, రాకాసి అలలు మిగిల్చిన కన్నీళ్లు!
Airtel Not Working: డౌన్ అయిన ఎయిర్‌టెల్ - యూజర్లకు చుక్కలు!
డౌన్ అయిన ఎయిర్‌టెల్ - యూజర్లకు చుక్కలు!
Boxing Day Test Live Updates: వివాదంలో చిక్కుకున్న కోహ్లీ.. నిషేధమా..? లేక జరిమానా..? ఐసీసీ రూల్ బుక్ ఏం చెబుతోందంటే..?
వివాదంలో చిక్కుకున్న కోహ్లీ.. నిషేధమా..? లేక జరిమానా..? ఐసీసీ రూల్ బుక్ ఏం చెబుతోందంటే..?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సునామీ బీభత్సానికి 20 ఏళ్లు, ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్న మత్స్యకారులుఅయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తతగుంతలమయమైన రోడ్లు, డ్రోన్‌లతో వింత నిరసనలుMS Dhoni Christmas Santa | జివా అడిగితే ధోనీ చేయకుండా ఉంటాడా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
World's Worst Tsunami: ఆ మహా ప్రళయానికి 20 ఏళ్లు -  మానవాళి మరచిపోలేని పీడకల, రాకాసి అలలు మిగిల్చిన కన్నీళ్లు!
ఆ మహా ప్రళయానికి 20 ఏళ్లు - మానవాళి మరచిపోలేని పీడకల, రాకాసి అలలు మిగిల్చిన కన్నీళ్లు!
Airtel Not Working: డౌన్ అయిన ఎయిర్‌టెల్ - యూజర్లకు చుక్కలు!
డౌన్ అయిన ఎయిర్‌టెల్ - యూజర్లకు చుక్కలు!
Boxing Day Test Live Updates: వివాదంలో చిక్కుకున్న కోహ్లీ.. నిషేధమా..? లేక జరిమానా..? ఐసీసీ రూల్ బుక్ ఏం చెబుతోందంటే..?
వివాదంలో చిక్కుకున్న కోహ్లీ.. నిషేధమా..? లేక జరిమానా..? ఐసీసీ రూల్ బుక్ ఏం చెబుతోందంటే..?
Crime News: కామారెడ్డి జిల్లాలో కలకలం - చెరువులో శవాలుగా ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, అసలేం జరిగిందంటే?
కామారెడ్డి జిల్లాలో కలకలం - చెరువులో శవాలుగా ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, అసలేం జరిగిందంటే?
Shruthi Haasan : పెళ్లి కంటే రిలేషన్​షిప్​లో ఉండడమే ఇష్టం... పెళ్లిపై మరోసారి శృతి హాసన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
పెళ్లి కంటే రిలేషన్​షిప్​లో ఉండడమే ఇష్టం... పెళ్లిపై మరోసారి శృతి హాసన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Ind Vs Aus Test Series: హోరాహోరీగా బాక్సింగ్ డే టెస్టు - చివరి సెషన్లో సత్తా చాటిన భారత బౌలర్లు
హోరాహోరీగా బాక్సింగ్ డే టెస్టు - చివరి సెషన్లో సత్తా చాటిన భారత బౌలర్లు
SBI Special FD: ఎఫ్‌డీపై ఎక్కువ రాబడి కావాలంటే ఎస్‌బీఐ వైపు చూడండి - స్పెషల్‌ స్కీమ్‌ స్టార్టెడ్‌
ఎఫ్‌డీపై ఎక్కువ రాబడి కావాలంటే ఎస్‌బీఐ వైపు చూడండి - స్పెషల్‌ స్కీమ్‌ స్టార్టెడ్‌
Embed widget