అన్వేషించండి

MP Pappu Yadav: పురుష నేతల బెడ్‌రూమ్‌ల నుంచే 90 శాతం మహిళా నేతలు వస్తారు - బీహార్ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు - వదిలేస్తారా..స్టార్ట్ చేశారు!

Bihar: మహిళా రాజకీయ నేతలపై బీహార్ ఎంపీ పప్పూ యాదవ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మహిళా నేతలు 90 శాతం మంది పురుష నేతల బెడ్ రూమ్స్ నుంచి వస్తారని ఆయన చెబుతున్నారు.

Bihar MP Pappu Yadav controversial comments on women politicians:  వివాదాస్పద వ్యాఖ్యలు చేసే బీహార్ స్వతంత్ర ఎంపీ పప్పూ యాదవ్, తాజాగా మహిళా రిజర్వేషన్లు, మహిళా నేతలపై చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో పెను దుమారాన్ని రేపుతున్నాయి.  మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుపై చర్చ జరుగుతున్న తరుణంలో పప్పూ యాదవ్ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి 90 శాతం మంది మహిళలు రాజకీయ నాయకుల గదుల్లోకి వెళ్లకుండా రాజకీయం చేయలేరు అని వ్యాఖ్యనించి దుమారం రేపారు.

పప్పు యాదవ్ సంచలన ఆరోపణలు

భారతదేశంలో మహిళలను దేవతలుగా కొలుస్తారని, కానీ వాస్తవంలో వారికి ఇక్కడ ఎప్పటికీ గౌరవం దక్కదని పప్పు యాదవ్ వ్యాఖ్యానించారు. దీనికి వ్యవస్థ , సమాజమే బాధ్యత వహించాలని ఆయన పేర్కొన్నారు. అయితే, చర్చను మరింత వివాదంలోకి నెట్టిన అంశం ఏమిటంటే—రాజకీయాల్లోకి వచ్చే మహిళల్లో అత్యధికులు 90 శాతం  నాయకుల ప్రసన్నం కోసం వారి  బెడ్ రూమ్ వరకు వెళ్లాల్సి వస్తోందని, అలా చేయనిదే వారికి అవకాశాలు రావడం లేదని ఆయన చేసిన   వ్యాఖ్యలు రాజకీయ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేశాయి.  

తన వ్యాఖ్యలను సమర్థించుకున్న పప్పు యాదవ్
 
పప్పు యాదవ్ తన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ, తాను వ్యవస్థలోని కుళ్లును ఎండగడుతున్నానని చెబుతున్నారు. రాజకీయాల్లో పురుషాధిక్యత ఎంత దారుణంగా ఉందో చెప్పడమే తన ఉద్దేశమని ఆయన అంటున్నప్పటికీ, ఆయన వాడిన భాష మాత్రం ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న మహిళా నేతలందరినీ కించపరిచే విధంగా ఉందన్న విమర్శలు వస్తున్నాయి. మహిళల పోరాటాన్ని, వారి ప్రతిభను తక్కువ చేస్తూ, వారి ఎదుగుదలకు కేవలం  అనుకూలతలు మాత్రమే కారణమని చిత్రీకరించడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.

 రిజర్వేషన్లపై  కోటాలో కోటా వాదన

మహిళా రిజర్వేషన్ల విషయంలో పప్పు యాదవ్ మొదటి నుంచీ ఒక ప్రత్యేక వాదన వినిపిస్తున్నారు. రిజర్వేషన్లు కేవలం ఉన్నత వర్గాల మహిళలకే  పరిమితం కాకూడదని, అందులో ఓబీసీ, దళిత మరియు మైనారిటీ మహిళలకు ప్రత్యేక కోటా ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో, కేవలం నగరాల్లో ఉండే గ్లామరస్ మహిళలే చట్టసభలకు వస్తారని, గ్రామీణ మహిళలకు అన్యాయం జరుగుతుందని ఆయన అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ వాదనను వినిపించే క్రమంలో ఆయన వాడుతున్న పదజాలం మహిళా ద్వేషపూరితం  గా ఉందని మహిళా సంఘాలు మండిపడుతున్నాయి.   

 రాజకీయ పార్టీల ఆగ్రహం

పప్పు యాదవ్ వ్యాఖ్యలపై అన్ని రాజకీయ పార్టీల మహిళా నేతలు ఏకమై నిరసన తెలుపుతున్నారు.  0 శాతం మహిళలను అవమానించే హక్కు ఆయనకు ఎవరిచ్చారు?" అని మహిళా ఎంపీలు ప్రశ్నిస్తున్నారు. ఆయన వ్యాఖ్యలు మహిళా శక్తిని కించపరచడమే కాకుండా, కొత్తగా రాజకీయాల్లోకి రావాలనుకునే యువతుల్లో భయాందోళనలు సృష్టిస్తాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మహిళా కమిషన్ ఈ వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుని వివరణ కోరింది. 

పప్పు యాదవ్ ఇప్పుడే కాదు..  ఆయన మాట్లాడిన ప్రతీసారి వివాదాస్పదం అవుతూనే ఉంటుంది. లాలూ ప్రసాద్ యాదవ్ కు ఒకప్పుడు అత్యంత సన్నిహితంగా ఉన్న ఆయన ఇప్పుడు పూర్ణియా నుంచి కాంగ్రెస్ మద్దతు తో ఇండిపెండెట్ గా గెలుస్తూ వస్తున్నారు. 

 

టాప్ హెడ్ లైన్స్

CSK Coaching Crisis: ఫ్లెమింగ్ బాటలోనే మరో సిఎస్కే లెజెండ్.. హస్సీకి ఇంగ్లాండ్ టీమ్ ఆఫర్, చెన్నై క్యాంప్ లో క‌ల‌క‌లం!
ఫ్లెమింగ్ బాటలోనే మరో సిఎస్కే లెజెండ్.. ఆ దిగ్గజానికి ఇంగ్లాండ్ టీమ్ ఆఫర్, చెన్నై క్యాంప్ లో క‌ల‌క‌లం!
Pithapuram Roads: పవన్ కళ్యాణ్ చొరవతో పిఠాపురంలో రోడ్లకు మహర్దశ - 307 కిలోమీటర్ల కొత్త రోడ్ల నిర్మాణం
పవన్ కళ్యాణ్ చొరవతో పిఠాపురంలో రోడ్లకు మహర్దశ - 307 కిలోమీటర్ల కొత్త రోడ్ల నిర్మాణం
Virat T20 Origin:  కోహ్లీ ఫస్ట్ టి20 ఇన్నింగ్స్ ను చూసి ఫిదా అయిన ఆర్సీబీ స్కౌట్.. ఐపీఎల్ వేలంలో ఢిల్లీ మిస్టేక్ ను ఎన్ క్యాష్ చేసుకున్న ఆర్సీబీ మేనేజ్మెంట్!
కోహ్లీ ఫస్ట్ టి20 ఇన్నింగ్స్ ను చూసి ఫిదా అయిన ఆర్సీబీ స్కౌట్.. ఐపీఎల్ వేలంలో ఢిల్లీ మిస్టేక్ ను ఎన్ క్యాష్ చేసుకున్న ఆర్సీబీ మేనేజ్మెంట్!
Viral Video: వీడియో కాల్‌లోనే కడసారి చూపులు - క్షీణిస్తున్న మానవ సంబంధాలపై సజ్జనార్ ఆవేదన
వీడియో కాల్‌లోనే కడసారి చూపులు - క్షీణిస్తున్న మానవ సంబంధాలపై సజ్జనార్ ఆవేదన

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
Trinadha Rao Nakkina: 'జెన్ జీ'కి ఫ్యామిలీ ఎమోషన్స్ తెలియడం లేదు... 'అనకాపల్లి' ఇంటర్వ్యూలో త్రినాథరావు నక్కిన
'జెన్ జీ'కి ఫ్యామిలీ ఎమోషన్స్ తెలియడం లేదు... 'అనకాపల్లి' ఇంటర్వ్యూలో త్రినాథరావు నక్కిన
Embed widget