By: Ram Manohar | Updated at : 26 Nov 2022 03:46 PM (IST)
మహిళల వస్త్రధారణపై బాబా రామ్‌దేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Baba Ramdev Tongue Slip:
ఏమీ ధరించకపోయినా..
యోగా గురువు రామ్ దేవ్ బాబా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళల దుస్తుల గురించి మాట్లాడుతూ నోరు జారారు. "మహిళలు చీరలు కట్టుకున్నా అందంగా ఉంటారు. సల్వార్ వేసుకున్నా బాగానే కనిపిస్తారు. నా కళ్లకైతే...వాళ్లు ఏమీ వేసుకోకపోయినా అందంగా కనిపిస్తారు" అని అన్నారు. ఈ కామెంట్స్ చేసిన సమయంలో వేదికపై మహారాష్ట్ర డిప్యుటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ సతీమణి అమృత ఫడణవీస్ కూడా ఉన్నారు. రామ్ దేవ్ బాబా వ్యాఖ్యలతో షాక్ అయిన ఆమె...ఆ అసహనాన్ని బయట పెట్టకుండా అలా నవ్వుతూ ఊరుకున్నారు. ఆమెతో పాటు అక్కడ సీఎం ఏక్‌నాథ్ శిందే కొడుకు, ఎంపీ శ్రీకాంత్ శిందే కూడా అక్కడే ఉన్నారు. ఫలితంగా....ఈ వ్యాఖ్యలు ఇంకా దుమారం రేపుతున్నాయి. రాజకీయ నాయకుల సమక్షంలో అలా మాట్లాడుతున్నా ఎవరూ నోరు మెదపకపోవడంపైనా విమర్శలు వస్తున్నాయి. మహారాష్ట్రలోని థానేలో
మహిళల కోసం ఓ యోగా సైన్స్ క్యాంప్ నిర్వహించారు బాబా రాం దేవ్. ఆ సమయంలో అందరూ సల్వార్ సూట్‌లతో వచ్చారు. ఆ తరవాత జరిగిన కార్యక్రమానికీ మహిళలు అలా సల్వార్ సూట్‌లలోనే వచ్చారు. దీనిపై స్పందించిన రామ్ దేవ్ బాబా "మరే ఇబ్బంది లేదు. మీరు ఇంటికి వెళ్లి చీరలు కట్టుకోవచ్చు" అని అన్నారు. అంతటితో ఆగకుండా మహిళలు ఏమీ ధరించకపోయినా బాగానే కనిపిస్తారంటూ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ స్పందించారు. మహిళలను కించపరిచినందుకు దేశానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
महाराष्ट्र के उपमुख्यमंत्री जी की पत्नी के सामने स्वामी रामदेव द्वारा महिलाओं पर की गई टिप्पणी अमर्यादित और निंदनीय है। इस बयान से सभी महिलाएँ आहत हुई हैं, बाबा रामदेव जी को इस बयान पर देश से माफ़ी माँगनी चाहिए! pic.twitter.com/1jTvN1SnR7
— Swati Maliwal (@SwatiJaiHind) November 26, 2022
సల్మాన్‌పై సంచలన వ్యాఖ్యలు..
బాలీవుడ్ బాద్‌షా సల్మాన్ ఖాన్‌పై ఇటీవలే సంచలన వ్యాఖ్యలు చేశారు యోగా గురువు బాబా రామ్‌దేవ్. సల్మాన్ ఖాన్ డ్రగ్స్ తీసుకుంటాడని బాబా రామ్‌దేవ్ ఆరోపించారు. సల్మాన్ ఖాన్‌తో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీపై కూడా బాబా ఆరోపణలు చేశారు.
" సినిమా పరిశ్రమను డ్రగ్స్ చుట్టుముట్టింది. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ డ్రగ్స్ తీసుకుంటాడు. ఆమిర్ ఖాన్ డ్రగ్స్ తీసుకుంటారా? లేదా? నాకు తెలియదు. షారుక్ ఖాన్ కుమారుడు డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడి జైలుకు వెళ్లి వచ్చాడు. ఇక హీరోయిన్ల గురించి
ఆ దేవుడికి మాత్రమే తెలుసు. రాజకీయాల్లో కూడా డ్రగ్స్ అడుగుపెట్టింది. ఎన్నికల సమయంలో మద్యం పంపిణీ జరుగుతోంది. డ్రగ్ అడిక్షన్ నుంచి భారత్‌ను విముక్తి చేసేందుకు మనమంతా కట్టుబడి ఉండాలి. దీని కోసం మేము ఉద్యమం చేస్తాం. "
-బాబా రామ్‌దేవ్, యోగా గురువు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో ఏర్పాటు చేసిన ఆర్యవీర్, వీరాంగన సదస్సులో బాబా రామ్‌దేవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలీవుడ్, డ్రగ్స్ వాడకంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.రామ్‌దేవ్ బాబా చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో అప్పట్లో వైరల్‌గా అయింది.
TTWREIS Admissions: తెలంగాణ ఎస్టీ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు, నోటిఫికేషన్ వెల్లడి! వివరాలివే!
Love Marriage : ఖండాలు దాటిన ప్రేమ, ఒక్కటైన తెలంగాణ అబ్బాయి, నెదర్లాండ్స్ అమ్మాయి
Waltair Veerayya Success Event : వాల్తేరు వీరయ్య విజయోత్సవ సభలో అపశృతి, తొక్కిసలాటలో పలువురికి గాయాలు
Tarak Ratna Health Update : విషమంగానే తారకరత్న ఆరోగ్య పరిస్థితి, బెంగళూరు ఆసుపత్రికి చేరుకున్న చంద్రబాబు
ABP Desam Top 10, 28 January 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Nizamabad News KTR : దేశానికి బీజేపీ చేసిందేమీ లేదు - ఎన్నికలకు ఎప్పుడయినా రావొచ్చన్న కేటీఆర్ !
CCL 2023: మూడేళ్ల తర్వాత జరగనున్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్ - క్రికెటర్లుగా మారనున్న హీరోలు!
Jagan To Delhi : అమరావతిలోనే సీఎం జగన్ -మరి టూర్లు ఎందుకు క్యాన్సిల్ ? ఢిల్లీకి ఎప్పుడు ?
Australian Open 2023: చరిత్ర సృష్టించిన సబలెంకా - మొదటి గ్రాండ్‌స్లామ్ విజేతగా నిలిచిన బెలారస్ ప్లేయర్!