అన్వేషించండి

Army chief: ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం- దేనికైనా రెడీగా ఉన్నాం: ఆర్మీ చీఫ్

Army chief: వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వద్ద పరిస్థితి ఇప్పటికి నిలకడగానే ఉందని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే అన్నారు.

Army chief: వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వద్ద ప్రస్తుత పరిస్థితులపై సైన్యాధిపతి జనరల్ మనోజ్ పాండే కీలక వ్యాఖ్యలు చేశారు. 'ది చాణక్య డైలాగ్స్‌' నిర్వహించిన ఓ సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా చైనాతో సరిహద్దు సమస్యలపై కూడా ఆయన స్పందించారు. 

" వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వద్ద పరిస్థితి ఇప్పటికి నిలకడగానే ఉంది. కానీ ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. వివాదాస్పదమైన ఏడు ప్రదేశాల్లో నాలుగు చోట్ల సమస్య పరిష్కారమైంది. మిగిలిన రెండింటిపై దృష్టిపెట్టాం. కానీ, వాస్తవాధీన రేఖ వద్ద చైనా బలగాల ఉపసంహరణ మాత్రం జరగడంలేదు. ప్రస్తుతం రెండు పక్షాల మధ్య దౌత్య, రాజకీయ, సైనిక స్థాయుల్లో చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి చర్చల వల్లే మనం ఐదు చోట్ల పరిష్కారాలు కనుగొన్నాం.  "
-                                    జనరల్‌ మనోజ్‌పాండే, ఆర్మీ చీఫ్‌  

దేనికైనా రెడీ 

వివాదాస్పద ప్రదేశాల నుంచి చైనా బలగాల ఉపసంహరణ అంత వేగంగా జరగడం లేదని ఆర్మీ చీఫ్ అన్నారు. అయితే చర్చల వల్లే పరిష్కారం లభిస్తుందన్నారు.

" కేవలం శిక్షణ కోసం వచ్చిన కొన్ని బ్రిగేడ్లు మాత్రమే వెనక్కివెళ్లాయి. ఎల్‌ఏసీని దృష్టిలో పెట్టుకొని చూస్తే మాత్రం పెద్దగా బలగాల సంఖ్యలో తగ్గుదల ఏమీ లేదు. భారత్‌ వైపు నుంచి మౌలిక వసతుల కల్పన , అభివృద్ధి కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు రిజర్వు బలగాలను సిద్ధంగా ఉంచాం.                           "
-జనరల్ మనోజ్ పాండే, ఆర్మీ చీఫ్

రక్షణ మంత్రి

రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇటీవల ఆర్మీ కమాండర్లను హుటాహుటిన పిలిచి మీటింగ్ పెట్టారు. తూర్పు లద్దాఖ్ వద్ద ఏవైనా అనుకోని ఘటనలు జరిగితే దీటుగా బదులిచ్చేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. అత్యున్న స్థాయిలో అన్ని వ్యూహాలూ సిద్ధం చేసుకోవాలని సూచించారు. మిలిటరీ కమాండర్స్ కాన్ఫరెన్స్‌లో భారత సైన్యంపై ప్రశంసలు కురిపించారు రాజ్‌నాథ్ సింగ్. దేశ భద్రతకు కట్టుబడి ఉన్న సైనికులందరికీ కితాబునిచ్చారు.

"భారత సైన్యంపై, వారి నాయకత్వంపై మాకు పూర్తి స్థాయి నమ్మకం ఉంది. ఎలాంటి ఆపరేషన్లు చేపట్టేందుకైనా మనం సిద్ధంగా ఉండాలి" అన్నారు రాజ్‌నాథ్. ఇదే సమయంలో ఉగ్రవాదంపై పోరాడుతున్న సైన్యం నిబద్ధతను పొగిడారు. ఆత్మనిర్భరత సాధించేందుకు అవసరమైన సాంకేతికతను అందిపుచ్చుకోవటాన్నీ ప్రశంసించారు.  

భారత్, చైనా మధ్య దాదాపు రెండేళ్లుగా యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. సరిహద్దు ప్రాంతంలో నెలకొన్న వివాదం క్రమంగా పెరుగుతూ వచ్చింది. గల్వాన్ ఘటన తరవాత అది తారస్థాయికి చేరుకుంది. చర్చలు జరుగుతున్నా చైనా ఏ మాత్రం వాటిని లెక్కలోకి తీసుకోకుండా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. దీంతో డ్రాగన్‌కు గట్టి బదులు ఇచ్చేందుకు భారత్ రెడీ అవుతున్నట్లు కనిపిస్తుంది.

Also Read: Australia Cruise Ship Covid: మళ్లీ కరోనా కలకలం- ఆ నౌకలో 800 మందికి వైరస్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget