Ajit Pawar Income Tax: డిప్యూటీ సీఎంకు ఐటీ శాఖ షాక్.. రూ.1000 కోట్ల విలువైన ఆస్తులు జప్తు!
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్‌కు చెందిన దాదాపు రూ.1000 కోట్ల విలువైన ఆస్తులను ఐటీ శాఖ జప్తు చేసింది.

మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్‌కు ఐటీ శాఖ షాక్ ఇచ్చింది. ఆయన బినామీలకు చెందినవిగా చెప్తోన్న దాదాపు 1000 కోట్ల విలువైన ఆస్తులను ఐటీ శాఖ జప్తు చేసింది.
Income Tax attached Properties of Ajit Pawar
— Kirit Somaiya (@KiritSomaiya) November 2, 2021
1. Jarandeshwar sugar factory
₹600 crore
2. South Delhi flat ₹20 crores
3. Nirmal office of Parth pawar
₹25 crores
4. Goa Resort "Nilaya" of ₹250 crores @BJP4India pic.twitter.com/jObd05BNde
అజిత్ పవార్‌కు చెందిన రూ.1000 కోట్ల విలువైన మొత్తం 5 ఆస్తులను ఐటీ శాఖ జప్తు చేసినట్లు ఏఎన్ఐ వార్త సంస్థ వెల్లడించింది. ముంబయిలోని పవార్ కార్యాలయం కూడా ఇందులో ఉంది.
దక్షిణ దిల్లీలో ఉన్న అజిత్ పవార్‌కు చెందిన 20 కోట్ల విలువైన ఓ ఫ్లాట్‌ను కూడా సీజ్ చేసినట్లు ఏబీపీ సమాచారం. నిర్మల్ టవర్‌లో ఉన్న పవార్ కార్యాలయం విలువ రూ.25 కోట్లు ఉంటుంది.
మరిన్ని ఆస్తులు..
- జరందేశ్వర్ షుగర్ ఫ్యాక్టరీ- విలువ రూ.600 కోట్లు
- గోవాలోని నిలయ రిసార్ట్- విలువ రూ.250 కోట్లు
- మహారాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 27 ఫ్లాట్లు- విలువ రూ.500 కోట్లు
గత నెలలో పవార్ సోదరి ఇళ్లు, కంపెనీలపై ఐటీ శాఖ దాడులు చేసింది. అజిత్ పవార్, ఆయన దగ్గరివారికి చెందిన దాదాపు 70 చోట్ల ఆదాయ పన్నుశాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. పన్ను ఎగవేత ఆరోపణలపై ఈ దాడులు చేసింది ఐటీ శాఖ.
Also Read: Corona Cases: దేశంలో భారీగా తగ్గిన కరోనా ఉద్ధృతి.. కొత్తగా 10 వేల కేసులు
Also Read: VS Achuthanandan Hospitalized: ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రికి అస్వస్థత.. ఐసీయూలో చికిత్స
Also Read: By Election Results 2021:అసోం, మధ్యప్రదేశ్‌లో భాజపా ముందంజ.. బంగాల్‌లో టీఎంసీ హవా
Also read: తీపి అధికంగా తింటున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే
Also read: ఈ పాపులర్ బ్రేక్‌ఫాస్ట్ మీ గుండెకు హాని చేయచ్చు... జాగ్రత్త
Also read: వారానికి రెండు సార్లు తింటే చాలు... మతిమరుపు మీ మెదడును చేరదు
Also read: నిమ్మరసం చేర్చిన కాఫీ తాగితే కెలోరీలు కరిగిపోయే ఛాన్స్... ఇది నిజమేనా?
Also Read: ఆ రాష్ట్రాల్లో దీపావళి అంటే బాణసంచాతో మినీ యుద్ధమే.. ఇంతకీ క్రాకర్స్ ఎందుకు కాల్చాలో తెలుసా..!
Also Read:యక్ష ప్రశ్నలంటే ఏంటి.. వాటికి సమాధానం ఎవరు ఎవరికి ఏ సందర్భంలో చెప్పారు..
Also Read: మడి వంట అంటే ఏంటి... ఇది పాటించకపోతే ఏమవుతుంది..!
Also Read: కాకులకు చావు ఉండదా. కాకికి-కర్మ కాండలకు సంబంధం ఏంటి ...!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

