Riteish Deshmukh Emotion: వెక్కి వెక్కి ఏడ్చిన జెనిలియా భర్త రితీశ్ దేశ్ ముఖ్
Ritesh Crying: బాలీవుడు సుప్రసిద్ధ నటుడు రితీశ్ దేశ్ ముఖ్ వెక్కి వెక్కి ఏడ్చారు. తండ్రి విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఎమోషన్ అయ్యారు..
Riteish Emotion: నాన్న...మనల్ని ఎప్పుడూ వెంటాడే ఓ ఎమోషన్. తండ్రి దగ్గర ఉన్నవాళ్లకు ఈ ఎమోషన్ గురించి పెద్దగా తెలియకపోవచ్చు కానీ...తండ్రి దూరమైనవాళ్లకే తెలుస్తుంది ఆ బాధ. చిన్నప్పటి నుంచి వేలుపట్టి నడిపించిన జ్ఞాపకాలన్నీ ఒక్కసారిగా కళ్లముందు కదలాడి కన్నీళ్ల రూపంలో బయటకు వచ్చేస్తాయి.ఆ సమయంలో మనం ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం అనేది కూడా జ్ఞప్తికి రాదు. ఎక్కిఎక్కి ఏడ్చేస్తాం. తన కామెడీ టైమింగ్ తో కడుపుబ్బా నవ్వించిన బాలీవుడ్ నటుడు రితీశ్ దేశ్ ముఖ్( Ritesh Deshmukh) తాను కన్నీరు పెట్టుకుని ఫ్యాన్స్ కంట కన్నీళ్లు తెప్పించాడు.
వెంటాడిన తండ్రి జ్ఞాపకాలు
మహారాష్ట్ర(Maharastra)లోని లాతూర్‌లో జరిగిన కార్యక్రమంలో బాలీవుడ్ నటుడు రితీష్ దేశ్‌ముఖ్ ఎమోషనల్ అయ్యారు. తన దివంగత తండ్రి, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్(Vilasarao Deshmukh) గురించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తండ్రి విగ్రహాన్ని ఆవిష్కరించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తండ్రిని గుర్తుచేసుకుంటూ ఆయన వెక్కి వెక్కి ఏడ్చారు. సాహెబ్ తమ నుంచి దూరమై అప్పుడే పుష్కరకాలం అయిపోయిందంటూ బాధపడ్డారు. ఆయన లేకపోవడం ఎంతో బాధ కలిగించిందన్నారు. విలాసరావు సాహెబ్ మనముందు లేకపోయినా... ఆయన చేసిన మంచి పనులు ఎప్పుడూ ప్రజల్లో గుర్తుంటాయన్నారు. ఆయన గొప్పతనం ఎప్పటికీ మసకబారదన్నారు. మహారాష్ట్ర పేదల గుండెల్లో ఆయన చిరకాలం బతికే ఉంటాడని కొనియాడారు. ఆయన గొప్పతనం మసకబారదంటూ...పేద ప్రజల కోసం ఆయన బలంగా నిలబడ్డాడని రితీశ్ ఎమోషనల్ అయ్యాడు. ఈరోజు ఆయన భౌతికంగా లేకపోయినా, మనపై ఆయన ప్రేమ ఎప్పటికీ ఉంటుందన్నారు.
తండ్రిపై అమితమైన ప్రేమ
ఇటీవల విడుదలైన యానిమల్(Animal) సినిమా చూశాం కదా...అందులో హీరో తండ్రిపై పిచ్చిప్రేమ పెంచుకుంటాడు. అతన్ని చంపడానికి యత్నించిన ప్రతిఒక్కరినీ వెతికివెతికి చంపుతాడు. ఈసారి నీపై ఈగ వాలిందంటే... ఢిల్లీనే తగలబెట్టేస్తానని తండ్రికే చెబుతాడు. భార్యతో సహా చుట్టూ ఉన్నవారంతా అతినికి పిచ్చి పట్టిందంటారు. కానీ తనకు మాత్రమే తెలుసు... తన తండ్రిపై తనకు ఉన్న ప్రేమ ఏంటో. సరిగ్గా అలాంటి మెంటాలిటీ ఉన్నవాడే రితీశ్ దేశ్ ముఖ్.. తండ్రి రెండుసార్లు మహారాష్ట్రా లాంటి పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా..తనకు మాత్రం తండ్రే కదా. ఆయన చేసిన ముద్దు, ముచ్చట్లు తనకు మాత్రమే జ్ఞాపకం ఉంటాయి. అందుకే ఆయన భౌతికంగా దూరమైనా... ఆ జ్ఞాపకాల నుంచి మాత్రం రితీశ్ ఎప్పుడూ దూరం కాలేడు. గతంలోనూ ఆయన జయంతిని పురస్కరించుకుని రితీశ్ ఎమోషనల్ అయ్యాడు. తన ఇంట్లో హ్యాంగర్‌కు తగిలించిన ఉన్న తండ్రి ట్రేడ్ మార్క్ పొలిటికల్ సూట్ దగ్గరికెళ్లిన రితీశ్.. చొక్కాలోపలికి ఒక చేతిని పోనిచ్చాడు.తండ్రి తనను హత్తుకుని భుజం మీద చెయ్యి వేసి నిమురుతున్న ఫీలింగ్ తీసుకొచ్చాడతను. పక్కనే తండ్రి ఫొటోను చూపించి హ్యాపీ బర్త్ డే అంటూ విష్ చేశాడు. ఎంతో హృద్యంగా అనిపిస్తున్న ఈ వీడియో సోషల్ మీడియా అప్పట్లో బాగా వైరల్ అయ్యింది. విలాస్ అభిమానులందరితో కన్నీళ్లు పెట్టించింది. రెండుసార్లు మహారాష్ట్రకు ముఖ్యమంత్రిగా పనిచేసిన విలాస్ రావు దేశ్ ముఖ్ అనారోగ్యంతో 2012లో మృతి చెందారు. విలాస్ రావు స్వస్థలం లాతూరులో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసిన అభిమానులు....దీన్ని ప్రారంభించేందుకు రితీశ్ తోపాటు ఆయన అన్నను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలోనే మరోసారి రితీశ్ కన్నీరు పెట్టుకున్నారు.