World Brain Tumor Day 2025 : ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ దినోత్సవం.. మెదడులో కణితులు ప్రాణాంతకమా? చరిత్ర, చికిత్సలు ఇవే
Brain Tumor : మెదడులో కణితపై అవగాహన కల్పిస్తూ ప్రపంచ వ్యాప్తంగా వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే నిర్వహిస్తున్నారు. దీని చరిత్ర, ప్రాముఖ్యత, థీమ్ వంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

World Brain Tumor Day : మెదడులో ఏర్పడే కణితులపై అవగాహన కల్పిస్తూ ప్రతి ఏడాది జూన్ 8వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా బ్రెయిన్ ట్యూమర్ డే నిర్వహిస్తున్నారు. బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడేవారికి, వారి కుటుంబాలకు మద్ధతునిస్తూ.. సమస్యపై అవగాహన కల్పిస్తున్నారు. ముందుస్తుగా దీనిని ఎలా గుర్తించాలో చెప్తూ.. దీనికి సంబంధించిన చికిత్సపై పరిశోధనలు పెంచేలా ఈ డేని నిర్వహిస్తున్నారు. అసలు బ్రెయిన్ ట్యూమర్ అంటే ఏమిటి? దాని చరిత్ర, ప్రాముఖ్యత, లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూసేద్దాం.
బ్రెయిన్ ట్యూమర్
మెదడులో కొన్ని అసాధారణ కణాలు పెరిగి ముద్దగా ఏర్పడడాన్నే బ్రెయిన్ ట్యూమర్ అంటారు. ఇది మెదడుపై ఒత్తిడి తెచ్చి సరిగ్గా పనిచేయకుండా చేస్తాయి. దీనిలో రెండు రకాల కణితలు ఉన్నాయి. ఒకటి క్యాన్సర్ కాని కణితలు. అయితే ఇది నెమ్మెదిగా పెరుగుతుంది కానీ వ్యాప్తి చెందదు. కానీ మెదపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. రెండోది ప్రాణాంతక క్యాన్సర్‌కు దారి తీస్తుంది. త్వరగా పెరగడంతో పాటు పక్కన ఉన్న కణజాలానికి కూడా వ్యాపిస్తుంది. అందుకే దీని గురించి అవగాహన అవసరం.
బ్రెయిన్ ట్యూమర్ డే చరిత్ర
ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ దినోత్సవాన్ని 2000 సంవత్సరంలో జర్మన్ బ్రెయిన్ ట్యూమర్ అసోసియేషన్ ప్రారంభించింది. ఈ సంస్థ బ్రెయిన్ ట్యూమర్ రోగులకు మద్ధతు ఇవ్వడం, ప్రజలకు అవగాహన కల్పించేందుకు దీనిని స్టార్ట్ చేసింది. అప్పటి నుంచి అనేక దేశాల్లో జూన్ 8వ తేదీని ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ డే నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ.. విద్యాకార్యక్రమాలు చేపడతూ, ఫండ్స్ కలెక్ట్ చేస్తూ బ్రెయిన్ ట్యూమర్ డే జరుపుతున్నారు.
బ్రెయిన్ ట్యూమర్ డే ప్రాముఖ్యత
బ్రెయిన్ ట్యూమర్‌ను ముందుగానే గుర్తించి.. దానికి చికిత్స తీసుకోవడంపై ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ డే అవగాహన కల్పిస్తుంది. ఇప్పటికే ఈ సమస్యతో ఇబ్బంది పడేవారికి సహాయం చేస్తూ.. వారికి, వారి కుటుంబాలకు మెదడులోని కణితులు, తీసుకోవాల్సిన చికిత్సపై అవగాహన కల్పించడానికి హెల్ప్ అవుతుంది. దాని లక్షణాలు, చికిత్స విధానాలు, ప్రమాదాలు గురించి చర్చించి వీలు కల్పిస్తుంది. చికిత్స విధానాలను అప్డేట్ చేయడానికి అవసరమైన పరిశోధనల కోసం ఫండ్స్ రైజ్ చేయడం కూడా దీనిలో భాగమేనని గుర్తు చేస్తుంది.
బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు
బ్రెయిన్ ట్యూమర్ ఉంటే తరచుగా, తీవ్రమైన తలనొప్పి వస్తుంది. కళ్లు తిరగడం, వాంతులు కావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కంటిచూపు మందగించడం, సరిగ్గా మాట్లాడలేకపోవడం జరుగుతుంది. మతిమరుపు పెరుగుతుంది. పర్సనాలిటీలో మార్పులు వస్తాయి. బ్యాలెన్స్ తప్పిపోతారు. మూర్ఛ వంటి లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయి.
బ్రెయిన్ ట్యూమర్ చికిత్స
మెదడులో ఏర్పడిన కణితలను సర్జరీ ద్వారా తొలగిస్తారు. రేడీషన్ థెరపీ కూడా చికిత్సలో భాగమే. కొన్ని సందర్భాల్లో కీమో థెరపీ ద్వారా నయం చేస్తారు. కొన్ని రకాల మందులను వైద్యులు సూచిస్తారు. ముందుగానే దీనిని గుర్తిస్తే సమస్యను త్వరగా దూరం చేసుకోగలుగుతారని గుర్తించుకోవాలి.






















