Winter-Friendly Plants : చలికాలంలో ఇంట్లో సులభంగా పెంచగలిగే పండ్ల మొక్కలు ఇవే.. ఏవి బెస్ట్ అంటే..
Winter Gardening Tips: చలికాలంలో మొక్కలు సరిగ్గా పెరగవు. కాబట్టి తక్కువ సూర్యరశ్మిలో కూడా పెరిగే మొక్కలు ఏంటో.. వాటిని పెంచడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూసేద్దాం.

Low-Maintenance Fruit Plants for Winter : చలికాలంలో మొక్కలు పెంచడం కష్టం అవుతుంది. ఎందుకంటే నేల చల్లగా ఉంటుంది. సూర్యరశ్మి తగినంతగా అందదు. అందుకే చాలామంది చలికాలంలో మొక్కలు పెరగవు అనుకుంటారు. కానీ శీతాకాలంలో కూడా కొన్ని మొక్కలు ఇంట్లో పెంచుకోవచ్చు. అదేలా అనుకుంటున్నారా... సింపుల్ కొన్ని మొక్కలు తక్కువ వెలుతురు, చలికాలంలో కూడా కుండీలలో బాగా పెరుగుతాయి. పండ్లు, పువ్వులు ఇస్తూ ఉంటాయి. అలాంటి వాటిలో 5 రకాల మొక్కలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇవి చలికాలంలో కూడా బాగా పెరుగుతాయి. మంచి పూతను ఇస్తాయి. కాబట్టి వీటిని మీరు ఇంట్లో కిటికీ దగ్గర బాల్కనీ లేదా గదిలో కూడా సులభంగా పెంచుకోవచ్చు.
నిమ్మ
నిమ్మ మొక్క చలికాలంలో కూడా ఇంట్లో సులభంగా పెరుగుతుంది. దీని సువాసనగల ఆకులు ఇంటికి తాజాదనాన్ని ఇస్తాయి. ఇది తక్కువ సూర్యరశ్మిలో కూడా పెరుగుతుంది. సరైన సంరక్షణ తీసుకుంటే ఏడాది పొడవునా పండ్లను ఇస్తుంది.
స్ట్రాబెర్రీ
స్ట్రాబెర్రీ మొక్క చిన్నది. కాబట్టి దీనిని ఇంట్లో కుండీలలో పెంచుకోవచ్చు. పైగా ఇది చాలా త్వరగా పెరుగుతుంది. దాని ఎర్రటి తీపి స్ట్రాబెర్రీలు చూడటానికి కూడా అందంగా ఉంటాయి. దీనికి ఎక్కువ నీరు, సూర్యరశ్మి అవసరం లేదు.
అత్తి(అంజీర్)
అత్తి మొక్కను కూడా కుండీలలో పెంచుకోవచ్చు. చలికాలంలో కూడా ఇది బాగా పెరుగుతుంది. కాస్త వెలుతురు తగిలితే చాలు ఇది పువ్వులు, పండ్లను రెండింటినీ ఇస్తుంది. అంజీర్ నేరుగా లేదా డ్రైగా తినవచ్చు. కాబట్టి ఇది వింటర్లో పెంచుకోవడానికి పర్ఫెక్ట్ మొక్కల్లో ఒకటిగా నిలుస్తుంది.
నారింజ
నారింజ చెట్టు ఇంట్లో పెంచుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది. తక్కువ సంరక్షణతో పెరుగుతుంది. పెద్ద కేర్ తీసుకోనవసరం లేదు. చలికాలంలో కూడా దృఢంగా పెరుగుతుంది. కాస్త పెద్ద కుండీల్లో వేసుకోవచ్చు. భూమిలో వేస్తే మరింత వేగంగా పెరిగి పండ్లు ఇస్తుంది.
అనాస(పైనాపిల్)
పైనాపిల్ మొక్కను పెంచడానికి పెద్ద ఎండ అవసరం లేదు. అతి తక్కువ వెలుతురు, తక్కువ నీటితో పెరుగుతుంది. చూడడానికి కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. దాని పొడవైన ఆకులు ఇంటికి అందమైన రూపాన్ని ఇస్తాయి.
ఇవన్నీ ఇంట్లో చలికాలంలో సింపుల్గా పెంచుకోవచ్చు. పైగా ఎక్కువ మెయింటైనెన్స్ కూడా అవసరం లేదు. ఈ పండ్లలో విటమని సి ఎక్కువగా ఉంటుంది. చలికాలంలో ఇది చాలా అవసరం. పైగా రోగనిరోధక శక్తిని పెంచుతుంది.






















