Hypertension: చలికాలంలో రక్తపోటు ఎందుకు పెరుగుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఆరోగ్యం వాతావరణం, ఉష్ణోగ్రతపై కూడా ఆధారపడి ఉంటుంది.

వేసవిలో ఆరోగ్యంగా ఉన్నవారు చలికాలం వచ్చేసరికి మాత్రం చాలా నీరసంగా, అనారోగ్యంగా మారుతారు. ముఖ్యంగా తక్కువ రోగనిరోధక శక్తి, కీళ్ల నొప్పులు, ఉబ్బసం... ఇలాంటి ఆరోగ్యసమస్యలు చలికాలంలో విజృంభిస్తాయి. అలాగే చల్లని వాతావరణంలో చాలామందిని ఇబ్బంది పెట్టే మరో ఆరోగ్య సమస్య రక్తపోటు. వాతావరణంలో ఉష్ణోగ్రత పడిపోవడం ప్రారంభమైనప్పుడు హైబీపీ ఉన్నవారిలో రక్తపోటు పెరగడం మొదలవుతుంది. ఇది గుండె పోటు, గుండె సమస్యల ప్రమాదాన్ని మరింత పెంచుతుంది.
ఎందుకు పెరుగుతుంది?
చల్లని వాతావరణలో రక్తనాళాలు, ధమనులు సంకోచానికి గురవుతాయి. దీని కారణంగా శరీరంలోని వివిధ భాగాలకు రక్తం సరఫరా కావడానికి ఎక్కువ శక్తి అవసరం అవుతుంది. ఫలితం రక్తపోటు పెరుగుతుంది. అలాగే తేమ, వాతావరణ పీడనం, మేఘాల ఆవరణం, చలిగాలి... వంటి ఆకస్మిక మార్పుల వల్ల కూడా రక్తపోటు పెరగచ్చు. ముఖ్యం 65 ఏళ్లు వయసు దాటిన వారిలో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే చలికాలంలో వ్యాయామం చేయకపోవడం, బరువు పెరగడం వంటి వాటి వల్ల కూడా రక్తపోటు పెరిగే అవకాశం ఉంది.
ఆల్కహాల్, కాఫీ దూరం పెట్టాలి
చలికాలంలో కాఫీ, మద్యం తాగే వారి సంఖ్య ఎక్కువ. నిజానికి వీటిని తాగడం వల్ల శరీరంలోని వేడిని త్వరగా కోల్పోతారు. దీని కారణంగా రక్తనాళాలు మరింత కుచించుకుపోతాయి. దీంతో రక్తపోటు ఇంకా పెరిగిపోతుంది. రోజు రెండుసార్లు కంటే కాఫీ తాగకపోవడం ఉత్తమం. అలాగే ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలి.
పొరల దుస్తులు...
ఒకే మందపాటి జాకెట్ లేదా స్వెట్టర్ వేసుకునే బదులు రెండు మూడు పొరల రూపంలో డ్రెస్ వేసుకోవడం ఉత్తమం. ఇలా పొరల దుస్తులు ధరించడం వల్ల వెచ్చగా అనిపిస్తుంది. మందపాటి ఒకే జాకెట్ ధరించడం వల్ల శరీరం సులభంగా వేడిని కోల్పోయే అవకాశం ఉంది.
ఆహారం ఏం తినాలి?
రక్తపోటు ఎక్కువ, తక్కువ కాకుండా చూసుకోవడం ఆహారం కీలకపాత్ర వహిస్తుంది. ఆరోగ్యకరమైన, పోషకాహారాన్ని తినడం వల్ల రక్తపోటు లక్షణాలు తగ్గుతాయి. ఇప్పటికే హైబీపీతో బాధపడేవారు కూరగాయలు, పండ్లు, కొవ్వు తీసేసిన పాలు, అప్పుడప్పుడు మాంసం, చేపలు తింటుండాలి.
గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.
Also read: విడాకులకు దారితీసే ప్రధాన కారణాలు ఇవే... ఈ విషయాల్లో సర్దుకుపోవాల్సిందే
Also read: ఇరవై ఎనిమిది వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు ఒప్పుకున్న కోర్టు... ఆరోగ్యపరంగా రిస్క్ ఉండదా?
Also read: పాలిష్ చేసిన బియ్యం తినడం వల్ల డయాబెటిస్ వచ్చే ఛాన్స్
Also read: సంతానం కోసం ప్రయత్నిస్తున్నారా? ఇవి తింటే.. మీ కోరిక నెరవేరుతుంది.. హార్వర్డ్ స్డడీ
Also read: వార్నీ... ఈ యూనివర్సిటీలో తినడం, తాగడం నేర్పిస్తారట, చివరికి అది కూడా...
Also read: దేశీ వైన్... చలికాలంలో తాగితే శరీరానికి వెచ్చదనం, ఆరోగ్యం కూడా
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

