News
News
వీడియోలు ఆటలు
X

Rice: పాలిష్ చేసిన బియ్యం తినడం వల్ల డయాబెటిస్ వచ్చే ఛాన్స్

ఇప్పుడు మార్కెట్లో మనకు దొరికేవి అధికంగా బాగా పాలిష్ చేసిన బియ్యమే.

FOLLOW US: 
Share:

బిర్యానీలకు, ఫ్రైడ్ రైస్‌లకు చివరికి ఇంట్లో రోజూ వండే వైట్ రైస్‌కు కూడా మనం వాడేవి పాలిష్ చేసిన బియ్యమే. అధికంగా పాలిష్ చేసిన బియ్యం తినడం వల్ల డయాబెటిస్ వచ్చే అవకాశం పెరుగుతుందని చెబుతున్నారు ఆహారనిపుణులు. వారి అభిప్రాయం ప్రకారం పాలిష్ చేసిన బియ్యం అంటే గింజపై ఉన్న పొట్టు, ఊక, సూక్షక్రిములు, కొంతమొత్తంలో పోషకాలను తొలగించడం. ఈ పాలిష్ బియ్యం స్టార్చ్ అధికంగా ఉండే పదార్థం. 

అన్‌పాలిష్డ్ బియ్యం అంటే...
ఇది ఒకరకంగా బ్రౌన్ రైస్ అనే చెప్పుకోవాలి. పైన పొట్టు మాత్రమే తీసి వదిలేస్తారు. వీటిలో పోషకాలు అలానే ఉంటాయి. అందుకే ఆరోగ్యమైనదిగా చెబుతారు ఆహారనిపుణులు. అయితే గింజ లావుగా ఉంటుంది. బిర్యానీలు వంటివి చేసుకున్నా రుచిగా రావు. అందుకే ప్రజలు పాలిష్ రైస్ వైపు మొగ్గుచూపుతున్నారు. 

పాలిషింగ్ ఇలా చేస్తారు
ధాన్యం గింజల్ని రైస్ పాలిషర్ మెషీన్ ద్వారా బియ్యంగా మారుస్తారు. ఈ యంత్రాలు ధాన్యంగింజలు పొట్టును మొదట తీసేస్తుంది. తరువాత పాలిషింగ్ చేస్తుంది. ఇందులో గింజపై పొరను తీసేస్తుంది. మిల్లింగ్ చేయడం ద్వారా బియ్యం గింజ తెల్లగా, సన్నగా మారుతుంది. ఈ మిల్లింగ్ స్తూపాకారంలో ఉన్న సోరెల్ సిమెంట్ పూల వేసిన యంత్రంలో జరుగుతుంది. 

పోషకాలు ఉండవు
పాలిష్ చేశాక బియ్యం మెరుస్తూ తెల్ల రంగులోకి మారతాయి. పాలిష్ చేయని బియ్యం గోధుమ రంగులో ఉంటాయి. పాలిష్ చేసినవి మృదువుగా సన్నగా ఉంటే, రెండోది లావుగా, అసమాన కొలతలతో ఉంటాయి. పాలిష్ చేయని బియ్యంతో పోలిస్తే, పాలిష్ చేసిన బియ్యంలో ఫైబర్ చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఉడికించడం చాలా సులువు. కానీ వీటిలో పోషక విలువలు చాలా తక్కువగా ఉంటాయి. తిన్నా పెద్దగా లాభం ఉండదు. అదే పాలిష్ చేయని బియ్యాన్ని తింటే ఇనుము, మెగ్నీషియం, జింక్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. 

పాలిష్ చేసిన బియ్యంలో తేమ, బయోటిన్, ఖనిజాలు, నియాసిన్, ప్రొటీన్, ఫ్యాటీ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది. ఆహారనిపుణుల చెప్పిన ప్రకారం ఫైబర్, ప్రొటీన్ లేని బియ్యంతో వండిన ఆహారం అసంపూర్ణమైన ఆహారంతో సమానం. 

డయాబెటిస్ వచ్చే రిస్క్
పాలిషింగ్ చేసేప్పడు కీలకమైన విటమిన్లు, ఖనిజాలు పోతాయి. బియ్యం పై పొరల్లో మధుమేహం రాకుండా కాపాడే పోషకాలు కూడా ఉంటాయి. అవి కూడా పోతాయి. దీంతో పాలిష్ చేసిన బియ్యం తినడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. దీన్ని తిన్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరుగుతాయి. కాబట్టి డయాబెటిస్ ఉన్న వారు పాలిస్ చేసిన అన్నాన్ని తగ్గించి, బ్రౌన్ రైస్ తినడం మొదలుపెట్టాలి. 

గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.

Also read: సంతానం కోసం ప్రయత్నిస్తున్నారా? ఇవి తింటే.. మీ కోరిక నెరవేరుతుంది.. హార్వర్డ్ స్డడీ

Also read: వార్నీ... ఈ యూనివర్సిటీలో తినడం, తాగడం నేర్పిస్తారట, చివరికి అది కూడా...

Also read: అంధుల పాలిట వరం బ్రెయిలీ లిపి... అసలు ఎవరీ బ్రెయిలీ? అతనెందుకు ఈ లిపిని కనిపెట్టారు?

Also read: దేశీ వైన్... చలికాలంలో తాగితే శరీరానికి వెచ్చదనం, ఆరోగ్యం కూడా

Also read: పసుపు అధికంగా తింటే శరీరంలో ఐరన్ లోపించే అవకాశం... ఇంకా ఎన్నో సమస్యలు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌  చేయండి.
Published at : 05 Jan 2022 07:13 AM (IST) Tags: Diabetes డయాబెటిస్ Polished rice Unpolished rice

సంబంధిత కథనాలు

ఈ అలవాట్లు మీకున్నాయా? జాగ్రత్త, డయాబెటిస్ రావొచ్చు!

ఈ అలవాట్లు మీకున్నాయా? జాగ్రత్త, డయాబెటిస్ రావొచ్చు!

Children Health: పిల్లలకి ఫీవర్‌గా ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఈ తప్పులు అసలు చేయొద్దు

Children Health: పిల్లలకి ఫీవర్‌గా ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఈ తప్పులు అసలు చేయొద్దు

Heatstroke: సమ్మర్‌ స్ట్రోక్ నుంచి బయటపడాలంటే ఈ ఫుడ్స్ తప్పకుండా మెనూలో చేర్చుకోవాల్సిందే

Heatstroke: సమ్మర్‌ స్ట్రోక్ నుంచి బయటపడాలంటే ఈ ఫుడ్స్ తప్పకుండా మెనూలో చేర్చుకోవాల్సిందే

Skipping Meals: భోజనం మానేస్తున్నారా? దానివల్ల శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?

Skipping Meals: భోజనం మానేస్తున్నారా? దానివల్ల శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?

Pregnant Travel Tips: గర్భిణీలు ప్రయాణాలు చేయొచ్చా? ఒకవేళ చేయాల్సి వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి

Pregnant Travel Tips: గర్భిణీలు ప్రయాణాలు చేయొచ్చా? ఒకవేళ చేయాల్సి వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి

టాప్ స్టోరీస్

IPL 2023 Final: కప్ ఎవరిదైనా ఆరెంజ్, పర్పుల్ క్యాప్‌లు వీరికే - ఇద్దరూ గుజరాత్ ప్లేయర్లే!

IPL 2023 Final: కప్ ఎవరిదైనా ఆరెంజ్, పర్పుల్ క్యాప్‌లు వీరికే - ఇద్దరూ గుజరాత్ ప్లేయర్లే!

RGV: ఎన్టీఆర్‌‌ను చంపిన వాళ్లే, రక్తం తుడుచుకుని వచ్చి అభిషేకాలు చేస్తున్నారు - ఆర్జీవీ సీరియస్ కామెంట్స్!

RGV: ఎన్టీఆర్‌‌ను చంపిన వాళ్లే, రక్తం తుడుచుకుని వచ్చి అభిషేకాలు చేస్తున్నారు - ఆర్జీవీ సీరియస్ కామెంట్స్!

NTR కి నిజమైన రాజకీయ, పరిపాలన వారసుడు సీఎం కేసిఆర్ : మంత్రి ఎర్రబెల్లి

NTR కి నిజమైన రాజకీయ, పరిపాలన వారసుడు సీఎం కేసిఆర్ : మంత్రి ఎర్రబెల్లి

కడుపున పుడితే వారసులు కారు, ఎన్టీఆర్‌కు అసలైన వారసుడు ఆయనే - జగన్‌కు జీవితాంతం రుణపడతా: లక్ష్మీ పార్వతి

కడుపున పుడితే వారసులు కారు, ఎన్టీఆర్‌కు అసలైన వారసుడు ఆయనే - జగన్‌కు జీవితాంతం రుణపడతా: లక్ష్మీ పార్వతి