World Braille Day 2022: అంధుల పాలిట వరం బ్రెయిలీ లిపి... అసలు ఎవరీ బ్రెయిలీ? అతనెందుకు ఈ లిపిని కనిపెట్టారు?
జనవరి 4న ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం. బ్రెయిలీ లిపిని కనిపెట్టిన వ్యక్తి లూయిస్ బ్రెయిలీ జన్మదినం సందర్భంగా ఈ దినోత్సవాన్ని నిర్వహించుకుంటాం.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంధులకు వరంలా మారింది బ్రెయిలీ లిపి. దీని కారణంగానే ఎంతో మంది చూపులేనివారు చదువుకోగలుగుతున్నారు. రాయడం, చదవడం ఈ రెండూ ఏదైనా నేర్చుకోవడానికి చాలా ముఖ్యమైన అంశాలు. ఆ రెండు అంధులు చేయగలుగుతున్నారంటే దానికి కారణం లూయిస్ బ్రెయిలీ అనే ఫ్రెంచ్ శాస్త్రవేత్త.
అంధులకు బ్రెయిలీ లిపి ఎంత అవసరమో చెప్పడానికి ప్రతి ఏడాది జనవరి 4న ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని నిర్వహించుకుంటారు. బ్యాంకులు, రెస్టారెంట్లు, ఆసుపత్రులు వంటి చోట్ల తమ ప్రింటెడ్ మెటీరియల్ ను బ్రెయిలీ లిపిలో కూడా అందించాలన్న డిమాండ్ ఉంది. కానీ ఎక్కడా అది జరగడం లేదు. ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని ప్రతి ఏడాది జనవరి 4న నిర్వహించాలని ఐక్యరాజ్య సమితి 2018లో నిర్ణయించింది. తొలి బ్రెయిలీ దినోత్సవాన్ని 2019లో నిర్వహించారు.
ఎవరు ఈ బ్రెయిలీ?
లూయిస్ బ్రెయిలీ పారిస్‌కు దగ్గర్లోని క్రూవే అనే గ్రామంలో జనవరి 4న 1809న జన్మించారు. మూడవ ఏట తన తండ్రి కుట్టుపనిచేస్తుండగా వెళ్లి ప్రమాదవశాత్తూ రెండు కళ్లను పోగొట్టుకున్నారు. తరువాత ఓ అంధుల పాఠశాలకు వెళ్లి చదువుకున్నారు. అప్పట్లో ‘లైన్ టైపు’ పద్ధతిలో అంధులకు చదువుచెప్పేవారు. అంటే చదివే అక్షరాలన్నీగీతలా రూపంలో ఉంటాయి. లూయిస్ 17 ఏళ్లకే అదే స్కూల్లో టీచర్ గా పనిచేయడం ప్రారంభించారు. అంధులకు మరింత సులువైన, ప్రభావవంతమైన లిపి ఉండాలని అభిప్రాయపడ్డారు. గీతల రూపంలో ఉన్న లిపి అంధులకు సరైనది కాదని, చుక్కల రూపంలో ఉంటే మంచిదని భావించారు. అయితే ఓ సైనికాధికారి చీకటిలో కూడా సైనికులు చదువుకునేలా 12 ఉబ్బెత్తు చుక్కలతో సంకేత లిపిని తయారుచేశారు.
ఆ చుక్కలను ఆరు చుక్కలుగా కుదించి అంధుల కోసం ఓ లిపిని రూపొందించారు బ్రెయిలీ. ఈ చుక్కలను అవసరమైనట్టు పేర్చుతూ అక్షరాలను, అంకెలను, చిహ్నాలను తయారుచేశారు. అదే బ్రెయిలీ లిపి. ఆ లిపి గుర్తింపు పొందకముందే, ప్రాచుర్యంలోకి వెళ్లకముందే బ్రెయిలీ క్షయ వ్యాధితో 43 ఏళ్లకే మరణించారు. ఆయన మరణించినా బ్రెయిలీ లిపి రూపంలో అంధుల మనసుల్లో జీవించే ఉన్నారు లూయిస్ బ్రెయిలీ.
Also read: దేశీ వైన్... చలికాలంలో తాగితే శరీరానికి వెచ్చదనం, ఆరోగ్యం కూడా
Also read: పసుపు అధికంగా తింటే శరీరంలో ఐరన్ లోపించే అవకాశం... ఇంకా ఎన్నో సమస్యలు
Also read: మీ పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్ వేయిస్తున్నారా... తల్లిదండ్రులుగా మీరు ఈ విషయాలు తెలుసుకోవాలి
Also read: సజ్జ రొట్టె లేెదా జొన్న రొట్టె... ఈ రెండింటిలో బరువు తగ్గేందుకు ఏది తింటే బెటర్?
Also read: అతిగా నీళ్లు తాగితే ఎంత ప్రమాదమో తెలుసా?