Khimad: దేశీ వైన్... చలికాలంలో తాగితే శరీరానికి వెచ్చదనం, ఆరోగ్యం కూడా
కిమాడ్ అనే దేశీ వైన్‌కు తూర్పు భారతదేశంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది.
తూర్పు భారతదేశంలో ప్రముఖమైన పానీయం కిమాడ్. దీన్ని దేశీ వైన్‌గా పిలుచుకుంటారు. ఇది కొన్ని రాష్ట్రాల్లో సాంప్రదాయ పానీయం. పండుగలకు, వివాహ సమయాల్లో దీన్ని లీటర్ల కొద్దీ తయారుచేసి బంధుమిత్రులంతా ఆనందంగా తాగుతారు. దాల్చిన చెక్క, లవంగం, యాలకులు, సుగంధాలు, కాస్త ఆల్కహాల్ వంటివి కలిపి దీన్ని తయారుచేస్తారు. తాగితే కిక్కెక్కడం ఖాయమట. అందుకే దీన్ని దేశీయ మద్యంగా కూడా కొంతమంది భావిస్తారు. దీన్ని కేవలం మగవారే కాదు మహిళలు కూడా తాగుతారు. తూరూ రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అసోం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర, సిక్కింలలో ఇది చాలా పాపులర్ పానీయం.
ఇంట్లోనే చేసుకోవచ్చు...
కిమాడ్ పానీయాన్ని ఇంట్లో కూడా సులువుగా చేసుకోవచ్చు. నీళ్లు, ఆకుపచ్చ యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, ఒక టీ బ్యాగు, పంచదార, నారింజ రసం, నారింజ ఎండు తొక్కలు, లిక్కర్ (జిన్ లేదా వోడ్కా) కలిపి కిమాడ్ ను తయారుచేస్తారు.
లాభాలెన్నో...
ఈ దేశీ వైన్ ఆరోగ్యానికి చాలా మంచిదని తూర్పు రాష్ట్రాల వారి నమ్మకం. ముఖ్యంగా చలికాలంలోనే దీన్ని ఎక్కువగా తాగుతారు. యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు వంటివి కలిపి చేయడం వల్ల శరీరానికి వెచ్చదనం కలుగుతుంది. నేరుగా ఆల్కహాల్ తాగే కన్నా దీన్ని తాగడం చాలా మంచిది. దాల్చిన చెక్క, లవంగం ఉండడం వల్ల గొంతుకు ఉపశమనం కలుగుతుంది. అంతేకాదు గొంతు, ముక్కు, ఊపిరితిత్తుల్లో పట్టే శ్లేష్మాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. దీనివల్ల జలుబు, ముక్క దిబ్బడ, గొంతు నొప్పి వంటి సమస్యలు కలగవు. ముఖ్యంగా ఇందులోని దాల్చిన చెక్క జలుబు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పాలీఫెనాల్స్, ప్రోయాంతో సైనిడిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ రోగనిరోధక శక్తిని సహజంగానే పెంచుతుంది. చల్లనివాతావరణంలో బ్యాక్టిరియా, వైరస్‌ల వల్ల కలిగే అనారోగ్యాల నుంచి శరీరాన్ని కాపాడుతుంది.
గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.
Also read: పసుపు అధికంగా తింటే శరీరంలో ఐరన్ లోపించే అవకాశం... ఇంకా ఎన్నో సమస్యలు
Also read: మీ పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్ వేయిస్తున్నారా... తల్లిదండ్రులుగా మీరు ఈ విషయాలు తెలుసుకోవాలి
Also read: సజ్జ రొట్టె లేెదా జొన్న రొట్టె... ఈ రెండింటిలో బరువు తగ్గేందుకు ఏది తింటే బెటర్?
Also read: ఆవలింతలు వస్తున్నాయా... అయితే మెదడు మీకేదో చెప్పాలనుకుంటోంది
Also read: అతిగా నీళ్లు తాగితే ఎంత ప్రమాదమో తెలుసా?