అన్వేషించండి

పెరుగు ఎప్పుడు, ఎలా తీసుకోవాలో తెలుసా? ఆయుర్వేద శాస్త్రం ఏం చెబుతోందో చూడండి

పెరుగు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. కానీ దాన్ని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వసాయని ఆయుర్వేద శాస్తం చెబుతోంది.

ఎన్నో పోషకాలు అందించే పెరుగును ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. పులిసిన పెరుగుతో చద్దన్నం కలుపుకుని అందులో కొద్దిగా ఆవకాయ నంచుకుని తింటుంటే భలే రుచిగా ఉంటుంది. చికెన్ బిర్యానీ లేదా ఏ నాన్ వెజ్ వంటకం అయినా కూడా పులియబెట్టిన పెరుగు లేకుండా చేయలేరు. రోగనిరోధక శక్తిని పెంచేందుకు పెరుగు దోహదపడుతుంది. పెరుగు రుచి దాని ఉష్ణోగ్రత, సీజన్, సిద్ధం చేసేందుకు పట్టే సమయం వంటి వాటిపై ఆధారపడి ఉంటుంది. భారతీయులు పెరుగుతో భోజనం ముగించనిదే అన్నం తిన్న తృప్తి ఉండదు. అందుకే తప్పనిసరిగా అందరి ఇళ్ళల్లో పెరుగు ఉంటుంది.

పెరుగు ఎలా, ఎప్పుడు, ఏ సమయంలో తింటే ఆరోగ్యానికి మంచిది అనే విషయం మీద తప్పకుండా అవగాహన ఉండాలి. విరుద్ధమైన ఆహార పదార్థాలతో పెరుగు కలిపి తీసుకోవడం వల్ల అది ఆరోగ్యానికి హాని కూడా చేస్తుంది. అందుకే ఇటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి.

ఎలాంటి పెరుగు తినాలి?

అసంపూర్తిగా ఏర్పడిన పెరుగు తినడం మంచిది కాదు. ఎందుకంటే ఇది జీర్ణం కావడం కష్టం. ఇది వివిధ వ్యాధులకి కారణం అవుతుంది. పూర్తిగా ఏర్పడిన పెరుగు తీపి, కొద్దిగా పుల్లగా ఉంటుంది. దీని రుచి వాతావారణ ఉష్ణోగ్రతపై ఆధారపడి ఉంటుంది. వాతావారణం వేడిగా ఉంటే పెరుగు త్వరగా పులిసిపోతుంది.

పుల్లటి పెరుగు తినకూడదు

ఒకటి లేదా రెండు రోజులు పెరుగు బయట ఉండటం వల్ల అది బాగా పులిసిపోతుంది. అలా విపరీతమైన పుల్లటి పెరుగు తినడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. శరీరంలో పిత్త దోషాన్ని పెంచుతుంది. కడుపులో మంటని కలిగిస్తుంది.

పెరుగు ఎలా తీసుకోవాలి?

పెరుగుని ఎలా తినాలనే దాని గురించి ఆయుర్వేద గ్రంథాలు చెబుతున్నాయి. పెరుగు తినేందుకు కూడా కొన్ని నియమాలు ఉన్నాయి.

⦿ రాత్రి తినాలి

⦿ పెరుగు వేడి చెయ్యకూడదు

 ⦿వేడిగా ఉన్న ఏ పదార్థంతోనూ కలపకూడదు

⦿ వేసవి, వసంత, శరదృతువుల్లో పెరుగు తినకూడదు

⦿ పంచదార, ఉప్పు, తేనె, నెయ్యి, జామకాయ లేదా పచ్చి శెనగపిండితో కలిపి తినాలి

పెరుగుతో కలిపి తీసుకోకూడని ఆహారాలు

విరుద్ధమైన ఆహారాలతో కలిపి పెరుగు తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. చేపలు, పాలు, ఇతర పుల్లని పదార్థాలతో కలిపి తీసుకోకూడదు. వాత, పితా, కఫా అనే మూడు దోషాలు శరీర ఆరోగ్యాన్ని కాపాడే అంశాలు. పెరుగు శరీరంలో వాతాన్ని తగ్గిస్తుంది కానీ కఫాన్ని పెంచుతుంది. పుల్లగా ఉంటే అది పిత్తని కూడా పెంచుతుంది. కఫా పెరుగుదల మధుమేహం, దగ్గు, ఉబ్బసంతో పాటు అనేక రకాల వ్యాధులకి దారితీస్తుంది. పిత్త పెరుగుదల వల్ల పొట్టలో పుండ్లు, రక్త స్రావం, చర్మ రుగ్మతలు వంటి సమస్యలు ఎదురవుతాయి.

ఈ సమస్యలు ఉంటే వద్దు

విరుద్ధమైన ఆహారం తీసుకోవడం వల్ల జీవక్రియకి ఆటంకం, చర్మ వ్యాధులు, గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. విరోచనాల సమయంలో పెరుగు తినడం ప్రయోజనకరంగా ఉంటుంది. బాధకరమైన మూత్ర విసర్జన, ఆమెనోరియా, నిద్రలేమి, కొన్ని రకాల గుండె జబ్బుల వాళ్ళు పెరుగు తీసుకుంటే చాలా మంచిది. అదే విధంగా రక్తస్రావం, కఫా వ్యాధులు, చర్మ రుగ్మతలు, వాపు, మధుమేహం, నోరు, గొంతు వ్యాధులు ఉన్న వాళ్ళు దీన్ని తీసుకోకపోవడమే ఉత్తమం.ః

Also read: మలీద లడ్డూలు, సద్దుల బతుకమ్మ మెచ్చే ప్రసాదం

Also read: నువ్వుల సద్ది, సద్దుల బతుకమ్మ స్పెషల్ నైవేద్యం, ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. 

టాప్ హెడ్ లైన్స్

Saffron Water : ఉదయాన్నే కుంకుమ పువ్వు నీళ్లు తాగితే కలిగే లాభాలు ఇవే.. ఎలా తాగాలో తెలుసా?
ఉదయాన్నే కుంకుమ పువ్వు నీళ్లు తాగితే కలిగే లాభాలు ఇవే.. ఎలా తాగాలో తెలుసా?
Pilates vs Strength Training : పిలేట్సా? స్ట్రెంత్ ట్రైనింగా? వృద్ధాప్యంలో కూడా ఎముకలు బలంగా ఉండాలంటే ఏది మంచిది?
పిలేట్సా? స్ట్రెంత్ ట్రైనింగా? వృద్ధాప్యంలో కూడా ఎముకలు బలంగా ఉండాలంటే ఏది మంచిది?
Healthy Habits : రోజుకు 10 నిమిషాలు కేటాయిస్తే చాలు.. ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సింపుల్ అలవాట్లు ఇవే
రోజుకు 10 నిమిషాలు కేటాయిస్తే చాలు.. ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సింపుల్ అలవాట్లు ఇవే
Kalonji Oil : కలొంజీ ఆయిల్ జుట్టుకు ఉపయోగిస్తే కలిగే లాభాలు ఏంటి? ఎలా వాడాలో తెలుసా?
కలొంజీ ఆయిల్ జుట్టుకు ఉపయోగిస్తే కలిగే లాభాలు ఏంటి? ఎలా వాడాలో తెలుసా?

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
School Holidays: అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
Tirupati DGP IGP Conference: తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
Srikakulam Crime News: విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
Vijay Deverakonda Rashmika : విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
Congress Politics: గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: కాంగ్రెస్ ఎంపీ చామల
గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: ఎంపీ చామల
This Week OTT Movies : ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్
ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్
Mahindra XUV 3XO పెట్రోల్‌తో పోలిస్తే CNG ఎంత ఆదా చేస్తుంది? రియల్ వరల్డ్ మైలేజీ టెస్ట్ పూర్తి వివరాలు
Mahindra XUV 3XO CNG నిజమైన మైలేజీ ఎంత? రియల్ వరల్డ్ టెస్ట్‌లో బయటపడిన అసలు లెక్కలు!
Embed widget