అన్వేషించండి

Bathukamma Special Recipes: నువ్వుల సద్ది, సద్దుల బతుకమ్మ స్పెషల్ నైవేద్యం, ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది

బతుకమ్మ పండుగ వచ్చిందంటే తెలంగాణ అంతా సందడే.

రంగురంగుల పూల పండుగ బతుకమ్మ. ఈ పండుగ వస్తోందటే చాలు తెలంగాణ పల్లెలు, పట్టణాలు పూలతో నిండిపోతాయి. పూలను బతుకమ్మగా పేర్చి దేవతగా కొలిచే అందమైన పండుగ ఇది.  బతుకమ్మపై తమలపాకులో లేదా చిక్కుడు ఆకులో పసుపు ముద్దతో గౌరమ్మను పెడతారు. ధూపదీపాలతో పూజించి నైవేద్యాన్ని సమర్పిస్తారు.గౌరమ్మగా చేసిన పసుపును తీసి మంగళసూత్రాలకు అద్దుకుంటారు. తమ పసుపు కుంకాలను, ఇంటిని సకల సౌభాగ్యాలతో చూడమని కోరుకుంటారు. సద్దుల బతుకమ్మనాడు గౌరమ్మకు ప్రత్యేకంగా చేసే నైవేద్యం నువ్వుల సద్ది. నువ్వుల పొడితో దీన్ని తయారు చేస్తారు. 

కావాల్సిన పదార్థాలు: 
వండిన అన్నం - నాలుగు కప్పులు
నువ్వులు - అరకప్పు
ఎండు మిరపకాయలు - నాలుగు
కరివేపాకులు - రెండు రెమ్మలు
మెంతి గింజలు - అరస్పూను
నూనె - మూడు స్పూన్లు
ధనియాలు - రెండు స్పూన్లు
జీలకర్ర - ఒక స్పూను
ఆవాలు - ఒక స్పూన్లు
పసుపు - అర స్పూను
శెనగ పప్పు - ఒక స్పూను

తయారీ ఇలా...
1. ముందుగా ఒక కళాయిలో నువ్వులు, మెంతులు, ధనియాలు, ఎండు మిర్చి వేసి వేయించి మిక్సీలో పొడిలా చేసి పక్కన పెట్టుకోవాలి. 
2. ముందుగా అన్నం వండి పెట్టుకోవాలి. అన్నం పొడిపొడిగా వచ్చేలా చూసుకోవాలి. ఉప్పు వేసి వండుకుంటే ప్రత్యేకంగా కలుపుకోవాల్సిన అవసరం లేదు.  
3. ఇప్పుడు స్టవ్ పై కళాయి పెట్టి నూనె వేయాలి. 
4. జీలకర్ర, ఆవాలు, శెనగపప్పు,కరివేపాకులు, ఎండు మిర్చి వేసి వేయించాలి. 
5. చిటికెడు పసుపు కూడా వేసి కలపాలి. 
6. ఇప్పుడు అందులో అన్నం వేయాలి.
7. అన్నం పైన ముందుగా చేసి పెట్టుకున్న నువ్వుల పొడిని వేసి పులిహోర కలుపుకున్నట్టు కలుపుకోవాలి. 
8. అంతే నువ్వుల సద్ది నైవేద్యం రెడీ అయినట్టే. 

నువ్వులు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిలో బోలెడన్ని పోషకాలు ఉన్నాయి. రక్తహీనతతో బాధపడేవారు, ఐరన్ లోపం ఉన్నవారు నువ్వులతో చేసిన వంటకాలను తింటే మంచిది. నువ్వులు బెల్లం కలిపి తింటే ఈ సమస్యలు త్వరగా పోతాయి. ఎందుకంటే ఈ రెండింటిలోనూ ఇనుము శాతం ఎక్కువే. వీటిలో అమినోఆమ్లాలు, ప్రొటీన్లు కూడా అధికం. మెగ్నీషియం కూడా పుష్కలంగా దొరుకుతుంది. మధుమేహంతో బాధపడేవారు నువ్వుల వంటకాలు తింటే చాలా మంచిది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా అడ్డుకుంటుంది. దీనిలో సెసమాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది చాలా అవసరం. గుండె జబ్బులు రాకుండా అడ్డుకోవడంలో ముందుంటుంది. నువ్వుల నూనెతో వండిన వంటలు తినడం వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఒమెగా 6 ఫ్యాటీ ఆమ్లాలు, కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్స్, మంచి కొవ్వు పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఈ నూనెను ‘పవర్ హౌస్’ అని పిలవచ్చు. ఈ నూనెలో విటమిన్ ఇ కూడా సంపూర్ణంగా ఉంటుంది. 

Also read: సజ్జలతో మసాలా కిచిడీ, డయాబెటిక్ రోగులకు బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్

Also read: ఈ సమయాల్లో తింటే క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ, ముందు జాగ్రత్తలు తీసుకోక తప్పదు

టాప్ హెడ్ లైన్స్

Sink Trap Leak: వంటగది సింక్ నుంచి నీరు కారుతుందా? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో లీక్ అరికట్టవచ్చు! 
వంటగది సింక్ నుంచి నీరు కారుతుందా? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో లీక్ అరికట్టవచ్చు! 
Pillow Cleaning Tips: దిండు కంపుకొడుతోందా? ఈ చిట్కాతో ఉతక్కుండానే క్లీన్ చేయవచ్చు! 
దిండు కంపుకొడుతోందా? ఈ చిట్కాతో ఉతక్కుండానే క్లీన్ చేయవచ్చు! 
Scalp Oiling vs Hair Strand Oiling : స్కాల్ప్ ఆయిలింగ్ Vs జుట్టుకు నూనె.. జుట్టు పెరుగుదలకు, పోషణకు నూనె ఎలా రాస్తే మంచిది?
స్కాల్ప్ ఆయిలింగ్ Vs జుట్టుకు నూనె.. జుట్టు పెరుగుదలకు, పోషణకు నూనె ఎలా రాస్తే మంచిది?
Quitting Job in Midlife : 35 ఏళ్లు దాటాక జాబ్ మానేయాలనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు ఆలోచించకపోతే భారీ నష్టం తప్పదు
35 ఏళ్లు దాటాక జాబ్ మానేయాలనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు ఆలోచించకపోతే భారీ నష్టం తప్పదు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirupati Crime News: తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
US Iran War: చెప్పినట్టుగానే ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా! పేల్చేసిన రైల్వే వంతెనలు వీడియో షేర్‌ చేసిన ట్రంప్! 
చెప్పినట్టుగానే ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా! పేల్చేసిన రైల్వే వంతెనలు వీడియో షేర్‌ చేసిన ట్రంప్! 
Truck Slogan: ట్రక్కుల వెనుక రాత్రిపూట డిప్పర్ వాడండి అని ఎందుకు రాస్తారు? దానికి కండోమ్‌తో సంబంధం ఏంటి?
ట్రక్కుల వెనుక రాత్రిపూట డిప్పర్ వాడండి అని ఎందుకు రాస్తారు? దానికి కండోమ్‌తో సంబంధం ఏంటి?
TDP BJP Silence On Ravan Issue: రావణ్ ఇష్యూ.. కూటమిదా, జనసేనదా? ఉపా చట్టం ప్రయోగంపై చంద్రబాబు, బీజేపీ సైలెన్స్ వెనుక మర్మమేంటి!?
రావణ్ ఇష్యూ.. కూటమిదా, జనసేనదా? ఉపా చట్టం ప్రయోగంపై చంద్రబాబు, బీజేపీ సైలెన్స్ వెనుక మర్మమేంటి!?
Nitin Gadkari on E20 Fuel: E20 పెట్రోల్‌తో ఒక్క వాహనం పాడైనా తీసుకురండి! నితిన్ గడ్కరీ ఓపెన్ ఛాలెంజ్‌!
E20 పెట్రోల్‌తో ఒక్క వాహనం పాడైనా తీసుకురండి! నితిన్ గడ్కరీ ఓపెన్ ఛాలెంజ్‌!
Rajesh Sharma Hospitalised: ఫౌజీ సెట్స్‌లో పురుగు కుట్టలేదు... బాలీవుడ్ నటుడు ఆస్పత్రిలో చేరడానికి అసలు కారణం ఏమిటంటే?
ఫౌజీ సెట్స్‌లో పురుగు కుట్టలేదు... బాలీవుడ్ నటుడు ఆస్పత్రిలో చేరడానికి అసలు కారణం ఏమిటంటే?
Kaleshwaram Project Politics: కాళేశ్వరం రిపేర్ రాజకీయం - నీళ్లు ఎత్తిపోస్తే డ్యామ్‌లు కూలుతాయా? అసెంబ్లీ చర్చకు కేసీఆర్ సిద్ధమేనా?
కాళేశ్వరం రిపేర్ రాజకీయం - నీళ్లు ఎత్తిపోస్తే డ్యామ్‌లు కూలుతాయా? అసెంబ్లీ చర్చకు కేసీఆర్ సిద్ధమేనా?
వంట నుంచి సైన్స్  కోడింగ్ వరకు ప్రాచీన భారతదేశంలో 14 విద్యలు, 64 కళలు: శ్రీకృష్ణుడి అద్భుత జ్ఞాన రహస్యం!
వంట నుంచి సైన్స్  కోడింగ్ వరకు ప్రాచీన భారతదేశంలో 14 విద్యలు, 64 కళలు: శ్రీకృష్ణుడి అద్భుత జ్ఞాన రహస్యం!
Embed widget