Periods: ఆ మూడు రోజులు...వీటికి దూరంగా ఉంటే ఉత్తమం
నెలసరి ప్రతి నెలా వచ్చేదే అయినా... ఆ సమయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి.
నెలసరి అందరకీ ఒకేలా ఉండదు. కొందరికీ ఇలా వచ్చి, అలా పోయినట్టు ఉంటుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్టులు కనిపించవు. కానీ కొంతమందిలో మాత్రం పొత్తి కడుపు నొప్పి, రొమ్ముల్లో నొప్పి వేధిస్తాయి. కొంతమందిలో ఏ పనీ చేయలేక ఒళ్లంతా నీరసంగా, బరువుగా అనిపిస్తుంది. ఇవన్నీ నెలసరి ఇబ్బందులు. ఆ సమయంలో కొన్ని రకాల ఆహారపదార్థాలకు దూరంగా ఉండడం ద్వారా ఈ సమస్యల తీవ్రతను తగ్గించుకోవచ్చు. అలాగే కొన్ని పదార్థాలు తినడం ద్వారా మేలు పొందవచ్చు. నెలసరి సమయంలో ఏం తినాలి? ఏం తినకూడదు? తెలుసుకుందాం రండి.
ఏం తినాలి?
నెలసరి సమయంలో రక్తస్రావం కొందరిలో అధికంగా ఉంటుంది. అదేమీ చెడు రక్తం కాదు. పోతే పోయింటి అని పట్టించుకోకుండా వదిలేయడానికి. మన శరీరానికి అవసరమయ్యే మంచి రక్తమే. కోల్పోయిన రక్తాన్ని మళ్లీ పొందాలంటే తప్పకుండా మంచి ఆహారాన్ని తినాలి. ముఖ్యం ఇనుము అధికంగా ఉండే పదార్థాలను స్వీకరించాలి. పాలకూర, బచ్చలకూర వంటివి ఆ మూడు రోజుల పాటూ రోజూ తింటే మంచిది. వీటిలో మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉంటుంది. పెరుగును కూడా తినడం చాలా మంచిది. ఇందులో ఉండే ప్రోబయాటిక్స్ మంచి బ్యాక్టిరియాను పెంచి జననేంద్రియాలలో ఎలాంటి ఇన్ఫెక్ష్లను రాకుండా కాపాడతాయి. నీటిని కూడా అధికంగా తాగాలి. నెలసరి సమయంలో డీ హైడ్రేషన్ సమస్య ఎదురవ్వచ్చు. నీరు అధికంగా ఉండే పుచ్చకాయ, కీరాదోస వంటివి తినాలి. పసుపు, అల్లం, వేసి వంటకాలు, డార్క్ చాకొలెట్ వంటివి తింటే మంచింది.
ఏం తినకూడదు?
కూల్ డ్రింకుల్లాంటివి ఈ మూడు రోజులు దూరంగా పెట్టడం మంచిది. నెలసరి నొప్పులు వీటి వల్ల మరింత పెరుగుతాయి. కాఫీనీ కూడా ఈ మూడు రోజులు పాటూ తాగకుండా ఉండడం ఉత్తమం. ఇవి రక్తనాళాలు కుచించుకుపోయేలా చేసి నొప్పిని పెంచుతుంది. ఉప్పును కూడా తగ్గించి తినాలి. లేకుండా కడుపుబ్బరంలాంటివి రావచ్చు. కొవ్వు పదార్థాలకు కూడా దూరంగా ఉండాలి. కొవ్వులు ఈస్ట్రోజన్ హార్మోన్ మీద ప్రభావం చూపిస్తాయి. దీనివల్ల ప్రోస్టాగ్లాండిన్స్ అనే హార్మోన్ ఉత్పత్త పెరిగి రొమ్ముల్లో నొప్పి, మూడ్ స్వింగ్స్ లాంటివి కలుగుతాయి.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Also read: ప్యాకెట్ పాలను మరగబెట్టాల్సిన అవసరం ఉందా? నేరుగా తాగొచ్చా?
Also read: ఈ ఆహారాలను మళ్లీ మళ్లీ వేడి చేసుకుని తింటున్నారా? ప్రమాదం తప్పదు
Also read: ఇలాంటి వారికి కరోనా సోకితే మరణించే అవకాశాలు ఎక్కువ... తేల్చిన కొత్త అధ్యయనం