Optical Illusion: ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌లో మీకు కనిపిస్తున్న నెంబర్ ఎంత? మీ కంటి చూపుకు ఇది సవాలే
సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా వైరల్ అవుతున్న ఆప్టికల్ ఇల్యూషన్ ఇది.
ఆప్టికల్ ఇల్యూషన్ (Optical Illusion)... కంటిచూపుకు, దృష్టి సామర్థ్యానికి సవాలు విసిరే ప్రక్రియ. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చూపించడంలో ఆప్టికల్ ఇల్యూషన్ ప్రక్రియ ఆరితేరింది. కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో ఒక ఆప్టికల్ ఇల్యూషన్ వైరల్ గా మారింది. అందులో ఉన్న నెంబర్ కనిపెట్టేందుకు నెటిజన్లు తెగ కష్టపడుతున్నారు. ఒక్కోసారి ఒక్కో నెంబర్ కనిపిస్తూ తికమకపెడుతోంది ఆ ఆప్టికల్ ఇల్యూషన్.
ట్విట్టర్లో @benonwine అనే ఖాతా నుంచి ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌ను పోస్టు చేశారు. అందులో తెలుపు,నలుపు వృత్తాల మధ్యలో ఇరుక్కున్నట్టు కనిపిస్తున్న కొన్ని అంకెలు ఉన్నాయి. ఆ నెంబర్ ఏంటో చెప్పమని క్యాప్షన్ పెట్టారు. దీంతో నెటిజన్లు ఆ ఆప్టికల్ ఇల్యూషన్ ను పరిష్కరించేందుకు ప్రయత్నించారు. మీరు కూడా ఆ ఫోటోలో ఉన్న అంకెను కనిపెట్టేందుకు ప్రయత్నించండి. అందులో తొలిసారి చూస్తే 528 కనిపిస్తుంది. మరోసారి పరీక్షగా చూస్తే 15283 కనిపిస్తుంది. తరువాత మళ్లీ మళ్లీ చూస్తుంటే... 45283, 3452839 కూడా కనిపిస్తుంది. నెటిజన్లలో ఒక్కొక్కరికి ఒక్కో నెంబర్ కనిపించడం దీని ప్రత్యేకత. కావాలంటే మీరూ ఓ లుక్కేయండి.
DO you see a number?
— Benonwine (@benonwine) February 16, 2022
If so, what number? pic.twitter.com/wUK0HBXQZF
ఆప్టికల్ ఇల్యూషన్ అనేది ‘కాంట్రాస్ట్ సెన్సిటివిటీ’కి కొలమానంగా తెలుస్తోంది. కాంట్రాస్ట్ సెన్సిటివిటీ అంటే ఒక వస్తువు, దాని వెనుక ఉన్న నేపథ్యం మధ్య ఉన్న తేడాను గుర్తించే సామర్థ్యం అని చెబుతారు. కాంట్రాస్ట్ సెన్సిటివిటీ అనేది చూపు తీక్షణతకు భిన్నతమైనది. ఇచ్చిన దూరాన్ని బట్టి మీ దృష్టి ఎంత స్పష్టంగా ఉందో కొలిచే ఒక ప్రక్రియ.
ఒక నెటిజన్ ‘వామ్మో నా కంటి చూపును ఒకసారి చెక్ చేయించుకోవాలా? నాకు కేవలం 45283 నెంబర్ మాత్రమే కనిపిస్తోంది’ అని కామెంట్ చేశారు. మరొకరు ‘నాకు 528 కనిపిస్తోంది. మరే అంకెలు కనిపించడం లేదు. నా చూపు సామర్థ్యం బాగనే ఉందా’ అని రాశాడు. ఈ ట్వీట్ కు వందల కొద్దీ ఇలాంటి కామెంట్లు వచ్చాయి. మీకు ఏ నెంబర్ కనిపిస్తుందో మాకు కింద కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Also read: మధుమేహుల సంఖ్య పెరుగుతోంది, తెల్ల అన్నాన్ని మాని దంపుడు బియ్యం తినాల్సిన సమయం ఇదే
Also read: అరిటాకులో తింటే ఎన్ని ఆరోగ్యప్రయోజనాలో, తెలిస్తే ప్లేటులో తినడం మానేస్తారు