Food Preservatives: ఫుడ్ ప్రిజర్వేటివ్స్ అంటుంటారు కదా... అసలవేంటో తెలుసా?
సూపర్ మార్కెట్లలో దొరికే సగం ఉత్పత్తుల్లో ఫుడ్ ప్రిజర్వేటివ్స్ వాడతారు. ముఖ్యంగా ప్యాకేజ్డ్ ఫుడ్ ను కాపాడేవి కూడా ఇవే.
చాక్లెట్లు, బిస్కెట్లు, ఐస్ క్రీములు, పాస్తాలు, నూడిల్స్... ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రెడీ టు కుక్, రెడీ టు ఈట్ ఉత్పత్తులు సూపర్ మార్కెట్లలో కనిపిస్తూనే ఉన్నాయి. అవన్నీ నెలల తరబడి చెక్కుచెదరకుండా ఉంటాయి. ఎందుకంటే వాటిలో ఫుడ్ ప్రిజర్వేటివ్స్ వాడతారు. ఫుడ్ ప్రిజర్వేటివ్స్ పదాన్ని వినని వారుండరు, కానీ ఎప్పుడైనా ఆలోచించారా... వేటిని ఫుడ్ ప్రిజర్వేటివ్స్ అంటారని?
ఏమిటి ఫుడ్ ప్రిజర్వేటివ్స్?
ఎక్కువకాలం ఆహారాన్ని నిల్వ ఉంచేందుకు ఉపయోగపడేవే ఫుడ్ ప్రిజర్వేటివ్స్. ఆహారపదార్థాల్లో బ్యాక్టిరియా వృద్ధిని ఆలస్యం చేయడం వీటి పని. ఇవి రసాయన పదార్థాలే.
ఏఏ రసాయనాలు?
బెంజోయేట్స్, సోడియం సల్ఫేట్లు, సోడియం బైసల్ఫేట్, సోడియం మెటాబైసల్ఫేట్, ప్రొపియోనేట్స్, నైట్రేట్లు, పొటాషియం సోర్బేట్, కాల్షియం సోర్బేట్, సోడియం సోర్బేట్, విటమిన్ ఇ మొదలైన వాటిని ఫుడ్ ప్రిజర్వేటివ్స్ గా వాడతారు. వీటిని ఆహారం తయారుచేసేటప్పుడే కలపడం లేదా, పైన స్ప్రే చేయడం ద్వారా ఉపయోగిస్తారు.
ఆరోగ్యానికి మంచివేనా?
ప్రిజర్వేటివ్ లు ఆహారం చెడిపోకుండా, రుచిని కోల్పోకుండా ఎక్కువ కాలం ఉండేలా చేస్తాయి. వీటిలో అన్నీ మనకు హానిచేసేవి కాదు. కొన్ని మాత్రం అధికంగా శరీరంలో చేరితో హార్ల్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. అలాగే గుండె కణాలను నీరసించేలా చేస్తాయి. కొన్ని ప్రిజర్వేటివ్స్ లలో BHA, BHT అని పిలిచే పదార్థాలు ఉంటాయి. అవి క్యాన్సర్ కు కారణమవుతాయి. ప్రాసెస్ చేసిన ఆహారాలలో కొవ్వు ఆమ్లాలు కూడా ఉంటాయి కనుక, ప్రిజర్వేటివ్‌లు కొందరిలో ఊబకాయాన్ని కలిగిస్తాయి.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Also read: రోజూ తాగుతున్నారా? బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ
Also read: మెగా సినిమా షూటింగ్ కు ముహూర్తం పెట్టేశారు
Also read: ఒత్తయిన జుట్టు కావాలా... ఈ మూడూ తినండి చాలు
Also read: కోవిడ్ తరువాత పెరుగుతున్న కోపం... ఇలా తగ్గించుకోండి
Also read: డయాబెటిస్ రోగులు కూడా హ్యాపీగా తినొచ్చు... తింటే ఎన్ని లాభాలో
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి