Manchu Mohan Babu Family Issue: మా నాన్న భుజంపై తుపాకీ పెట్టి కాలుస్తున్నారు-సాయంత్రం గుట్టు విప్పుతా: మంచు మనోజ్
Manch Manoj News : మంచి కోసం, ప్రేమించిన అమ్మాయికి అండగా నిలబడినందుకు తనపై దాడి జరుగుతోందన్నారు మంచు మనోజ్. తన తండ్రి భుజంపై తుపాకీ పెట్టి కాల్చాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Manchu Manoj And Mohan Babu: మంచు ఫ్యామిలీ జరుగుతున్న పరిణామాలపై ఆవేదన వ్యక్తం చేసిన మంచు మనోజ్ తన అన్నపై పరోక్షంగా మండిపడ్డారు. తాను ప్రేమించిన పెళ్లి చేసుకున్న అమ్మాయి కోసం, బంధువుల కోసం నిలబడినందుకు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం జరిగిందో పూర్తిగా చెప్పాల్సిన టైం వచ్చిందని సాయంత్రం ప్రెస్‌మీట్ పెట్టి అన్ని కూలంకుషంగా చెప్పేస్తానని అన్నారు.
ఇంకా మంచు మనోజ్ ఏమన్నారంటే..." నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. ఆ అమ్మాయి కోసం పోరాడాను. దాంట్లో తప్పేంటీ నాకు అర్థం కావడం లేదు. ఇవాళ పది మంది కోసం నిలపబడినప్పుడు నేను చెడ్డవాడిని అయిపోయాను. ఎక్కడ సైన్ పెట్టమంటే పెట్టాను. రమ్మంటే వచ్చాను. పొమ్మంటే పోయాను, ఎన్ని సినిమాలు చేయమంటే చేశాను. అన్న కంపెనీల్లో పని చేశాను. సాంగ్స్ చేశాను. రికార్డింగ్స్ చేశాను. ఫైట్స్ చేశాను గొడ్డులా కష్టపడ్డాను. నేను ఒక్కరూపాయి అడిగింది లేదు. ఆశించిందీ లేదు. నేను పని చేసిందానికి కూడా అడగడం లేదు. "
తల్లి ఆసుపత్రిలో చేరిందని తప్పుడు ప్రచారం చేశారు: మనోజ్
సాయంత్రం ఐదు గంటలకు అన్ని విషయాలు చెప్పేస్తానన్నారు మంచు మనోజ్. తనకు భార్య బిడ్డలు ఉన్నారని రేపు వారు తనను ప్రశ్నించకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పుకొచ్చారు. మనోజ్ ఇంకా ఏమన్నారంటే " దొంగతనం చేసి వేరే వాళ్ల కడుపులు కొట్టి నా పిల్లలను పెంచలేను. మా నాన్ని నన్ను అలా పెంచలేదు. మా అమ్మ అలా పెంచలేదు. మధ్యలో మా అమ్మ నలిగిపోతోంది. మా అమ్మ ఆసుపత్రిలో అడ్మిట్ అయినట్టు ప్రచారం చేశారు. ఆమె ఆసుపత్రికి వెళ్లి చెక్ చేయించుకొని వచ్చింది. నువ్వు మంచిగా ఉంటే వీడిని ఇంట్లో నుంచి పంపేస్తామని చెబితే ఆవిడ చెక్ చేయించుకోవడానికి వెళ్లింది. అక్కడ నుంచి అన్న ఇంటికి వెళ్లి అక్కడే పడుకున్నారు. మీకు ప్రతీది తెలుస్తుందని ఏదీ దాచలేరు. మరీ ఇంత క్యారెక్టర్ అసాసినేషన్ చేయందానికి ఏదేదో చెప్పారు. " అని పేర్కొన్నారు.
సొంతంగా పైసా పైసా అప్పు చేసి బిజినెస్ చేస్తున్నా: మనోజ్
కరోనా టైంలో సినిమాలు ఆపేసి చెనై వెళ్లిపోయాయని అన్నారు మంచు మనోజ్. ఫ్రెండ్స్ సహాయంతో బిజినెస్ పెట్టుకొని ఎదుగుతున్నామని అన్నారు. "నా భార్య వచ్చినందుకు నేను చెడ్డవాణ్ణి అయ్యాను. అదే వాళ్ల తల్లిదండ్రులు ఉంటే గమ్మునుంటారా... ఇవాళ తల్లైనా తండ్రి అయిన అన్నీ నేనే కదా. తను తన ఇంటివారిపై ఆధార పడదు. నేను మా ఇంటి వాళ్లపై ఆదారపడను. నేను నా సినిమా చేసుకుంటున్నాను. తను సొంతంగా టాయ్ షాప్ పెట్టుకుంది. లాక్‌డౌన్ మా ప్రేమ కోసం అహం బ్రహ్మాస్మి సినిమా ఆపేశాం. చెన్నైకు వెళ్లిపోయాం. ఆత్మరనిర్భర భారత్‌లో భాగంగా నేను కథలు రాస్తూ బొమ్మలు గీస్తూ అప్పులు చేసుకొని పెట్టుబడులతో బిజినెస్ చేస్తున్నాం. ఒకరినొకరం కాపాడుకొని నేను నా భార్య నిలదొక్కున్నాం. తను, నేను మరో ముగ్గురితో కలిసి బిజినెస్‌ను ఇంత దూరం తీసుకొచ్చాం.
కొట్టి గాయపరిచారు: మనోజ్
బంధువుల కోరిక మేరకు చెన్నై నుంచి ఇంటికి తిరిగి వచ్చానని అన్నారు మనోజ్. " ఇప్పుడు నేను సినిమాలకు వచ్చేశాను. ఇప్పుడు నేను నిలబడకపోతే పిల్లలకు ఏం సమాధానం చెబుతాం. పిల్లలకు కరెక్ట్ కాదు. ఎవరికీ కరెక్ట్ కాదు. వాళ్ల నాన్న ఆస్తుల కోసం కొట్లాడుతున్నాడా మంచి కోసం నిలబడుతున్నాడా అనేది వాళ్లకు తెలియాలి. ఇవాళ సాయంత్రం ప్రూప్స్‌తో సహా చూపిస్తాను. మా నాన్నపై గన్‌పెట్టి కాల్చే వినయ్‌కి మా అన్నకి సాయంత్రం అన్నింటికీ సమాధానం చెబుతాను. పోలీసుల ఎదటు హాజరు అవ్వమని చెప్పారు. మొదటి రోజు జరిగిన గొడవలో నా మెడ, నా కాలికి గాయమైంది. నొప్పిగా ఉంది. మూడు వారాల క్రితం నాకు ఫైట్‌లో నా రైట్ లెగ్‌కు గాయమైంది. ఇప్పుడు జరిగిన గొడవలో నా లెఫ్ట్ లెగ్‌కు గాయమైంది. చికిత్స నడుస్తోంది. అందుకే పోలీసులకు టైం అడుగుతున్నాను.
మద్యం తాగి ఎవరినైనా కొట్టానా: మనోజ్
మద్యానికి బానిసై తన కుమారుడు ఇదంతా చేస్తున్నాడని మోహన్ బాబు విడుదల చేసిన ఆడియోపై కూడా మీడియా ప్రశ్నించింది. దీనికి మనోజ్ సమాధానం చెబుతూ... "మద్యానికి బానిసై ఎవర్ని కొట్టాను. నా భార్యను కొట్టానా, నా పిల్లల్ని కొట్టానా, నా తల్లిని కొట్టానా, నా తండ్రిని కొట్టానా, సీసీ టీవీ ఫుటేజ్ తెప్పించండి. అప్పుడు మాట్లాడదాం. ఎవరు ఎవర్ని కొట్టారో. ఎవరు దొంగతనం చేశారో. నేను ఆ దొంగతనం చేయలేదు సార్" అని అన్నారు.