అన్వేషించండి

Home Minister on CIBMS: స‌రిహ‌ద్దులు శ‌తృదుర్బేధ్యం-పాక్‌, బంగ్లా స‌రిహ‌ద్దుల్లో యాంటీ డ్రోన్ యూనిట్స్‌

Amit Shah: దేశ స‌రిహ‌ద్దులు మ‌రింత ప‌టిష్ఠం కానున్నాయి. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్ స‌రిహ‌ద్దుల్లో యాంటీ డ్రోన్ యూనిట్లు మోహరించ‌నున్న‌ట్టు హోంమంత్రి అమిత్ షా ప్ర‌క‌టించారు.

Home Minister On CIBMS: భార‌త దేశ స‌రిహ‌ద్దు భ‌ద్ర‌త‌(India Boarders)కు కేంద్రంలోని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ(PM Narendra Modi) నేతృత్వంలోని ప్ర‌భుత్వం అత్య‌ధిక ప్రాధాన్యం ఇస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో తాజాగా స‌రిహ‌ద్దుల‌ను మ‌రింత పటిష్ఠం చేసే దిశ‌గా కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. రాజ‌కీయ క‌ల్లోలం కొన‌సాగుతున్న బంగ్లాదేశ్(Bangladesh), పాకిస్థాన్‌(Pakistan)తో ఉన్న సరిహద్దుల వెంబడి కేంద్రం సమగ్ర ఇంటిగ్రేటెడ్ బోర్డర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్(CIBMS)ను అమలు చేయనున్నట్లు కేంద్ర  హోం శాఖ మంత్రి(Central Home minister) అమిత్ షా(Amit Shah) ప్రకటించారు. ఈ యాంటీ-డ్రోన్  యూనిట్లు పెరుగుతున్న చొర‌బాట్ల‌ను నిరోధించడంతోపాటు.. ఉగ్రవాద దాడుల‌ను గుర్తిస్తారు. వీటితోపాటు సునిశిత ప్రాంతాల‌పై నిఘాను మ‌రింత ప‌టిష్ఠం చేయ‌నున్నాయి. అదే విధంగా సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను బలోపేతం చేయనున్నాయి. ఇటీవ‌ల కాలంలో పొరుగు దేశాల నుంచి మానవరహిత వైమానిక వాహనాల రాక పెరుగుతోంది. ఈ నేప‌థ్యంలో వ‌టి వల్ల ఎదురయ్యే ముప్పులను ఎదుర్కొనేందుకు యాంటీ డ్రోన్ విభాగాన్ని మరింత విస్తరింపజేస్తామని షా తెలిపారు. భారతదేశం లేజర్ టెక్నాలజీ, స్మార్ట్ గన్-మౌంటెడ్ మెకానిజమ్‌లను ఉపయోగిస్తోందని పేర్కొన్నారు.  ఇది సరిహద్దు ప్రాంతాల్లో నిఘా, భద్రతను మ‌రింత మెరుగు ప‌రుస్తుంద‌ని ఆయన వివ‌రించారు.  

Also Read: 2024 గూగుల్‌ సెర్చ్‌లో ఐపీఎల్‌, పవన్ కల్యాణ్‌, కల్కి, సలార్‌ టాప్‌

బీఎస్ ఎఫ్ రైజింగ్ వేడుక‌ల్లో.. 

స‌రిహ‌ద్దు భ‌ద్ర‌తా ద‌ళాల 60వ వ్య‌వ‌స్థాప‌క దినోత్స‌వ(Formation Day) వేడుక‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో.. భార‌త్‌-పాకిస్థాన్(India-Pakistan) సరిహద్దు నుంచి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న బలగాల శిక్షణా శిబిరంలో నిర్వహించిన కార్య‌క్ర‌మంలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. భార‌త స‌రిహ‌ద్దుల‌ను మ‌రింతగా ర‌క్షించుకోవాల్సిన అస‌వ‌రంఉంద‌ని నొక్కి చెప్పారు. ఈ క్ర‌మంలోనే యాంటీ డ్రోన్ల అంశాన్ని ఆయ‌న ప్ర‌స్తావించారు. ఈ సంవత్సరం 260 కంటే ఎక్కువగా విదేశీ డ్రోన్‌లు పంజాబ్(Punjab) స‌రిహ‌ద్దుల వెంబ‌డి గుర్తించిన‌ట్టు తెలిపారు. వాటిని కూల్చి వేశామ‌ని పేర్కొన్నారు. ఇదేస‌మ‌యంలో పాకిస్థాన్‌తో ఉన్న స‌రిహ‌ద్దుల వెంబ‌డి ఏకంగా 202 డ్రోన్ల‌ను స్వాధీనం చేసుకున్నామ‌న్నారు. అయితే 2023లో ఈ సంఖ్య 110 గా ఉండ‌డం గ‌మ‌నార్హం. చాలా డ్రోన్లు పంజాబ్‌లో పట్టుబడగా, రాజస్థాన్, జమ్మూలో కూడా డ్రోన్లు గుర్తించారు. 

పురోగ‌తిలో.. సీఐబీఎంఎస్ 

భార‌త్‌-పాకిస్థాన్ వెంబ‌డి ఉన్న  2,289 కిలోమీట‌ర్ల స‌రిహ‌ద్దు, అదేవిధంగా భార‌త్‌-బంగ్లాదేశ్ మ‌ధ్య ఉన్న 4,096 కిలో మీట‌ర్ల స‌రిహ‌ద్దు ప్రాంతాల ర‌క్షించుకోవ‌డం  నిఘా వ్య‌వ‌స్థ‌ పటిష్ట పరిచేలా చేప‌ట్టే సమగ్ర సమీకృత సరిహద్దు నిర్వహణ వ్యవస్థ(CIBMS) ప‌నులు పురోగ‌తిలో ఉన్నాయ‌ని అమిత్‌షా చెప్పారు. "అసోంలోని ధుబ్రి (భారత్-బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దు)లో నది సరిహద్దులో ఏర్పాటు చేసిన‌ CIBMS నుంచి మంచి ఫలితాలు వచ్చాయి. అయితే కొన్ని మార్పులు చేయాల్సి ఉంది. అనంత‌రం ఈ వ్యవస్థను పాకిస్థాన్, బంగ్లాదేశ్‌తో ఉన్న మొత్తం సరిహద్దులో ఏర్పాటు చేస్తాం`` అని హోం మంత్రి షా ప్ర‌క‌టించారు. దీంతో భార‌త్ శ‌తృదుర్బేధ్యంగా మారుతుంద‌ని వివ‌రించారు.  ఫ‌లితంగా దేశ భ‌ద్ర‌త‌కు ఇక‌పై ముప్పు త‌ప్ప‌నుంద‌ని తెలిపారు. 

Also Read: దేశవ్యాప్తంగా #Mentoo ట్రెండింగ్ - మగజాతిని కదిలించిన ఓ వ్యక్తి ప్రాణత్యాగం- ఆడవాళ్ల నుంచి మగవాళ్లకు రక్షణ అక్కర్లేదా ?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Google Office In Andhra Pradesh: విశాఖలో గూగుల్ ఆఫీస్‌- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం- కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు
విశాఖలో గూగుల్ ఆఫీస్‌- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం- కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు
Mohan Babu Attack On Media: గతి తప్పిన మంచు కుటుంబ వివాదం - మోహన్ బాబు చుట్టూ బిగస్తున్న ఉచ్చు
గతి తప్పిన మంచు కుటుంబ వివాదం - మోహన్ బాబు చుట్టూ బిగస్తున్న ఉచ్చు
Google Trending Searches: 2024 గూగుల్‌ సెర్చ్‌లో ఐపీఎల్‌, పవన్ కల్యాణ్‌, కల్కి, సలార్‌ టాప్‌
2024 గూగుల్‌ సెర్చ్‌లో ఐపీఎల్‌, పవన్ కల్యాణ్‌, కల్కి, సలార్‌ టాప్‌
Mokshagna Debut Movie: వెయ్యి కోట్ల సినిమా దర్శకుడితో నందమూరి వారసుడి మొదటి సినిమా... ప్రశాంత్ వర్మ ఫిల్మ్ క్యాన్సిల్ కావడంతో!
వెయ్యి కోట్ల సినిమా దర్శకుడితో నందమూరి వారసుడి మొదటి సినిమా... ప్రశాంత్ వర్మ ఫిల్మ్ క్యాన్సిల్ కావడంతో!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mohan babu Audio on Manchu Manoj | నా గుండెల మీద తన్నావ్ రా మనోజ్ | ABP DesamMohan babu Attack Media | మీడియా ప్రతినిధిని దారుణంగా కొట్టిన మోహన్ బాబు | ABP DesamManchu Mohan babu Attack | కొడుకును, మీడియాను తరిమి కొట్టిన మోహన్ బాబు | ABP Desamముంబయిలో బస్ బీభత్సం, ఏడుగురు మృతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Google Office In Andhra Pradesh: విశాఖలో గూగుల్ ఆఫీస్‌- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం- కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు
విశాఖలో గూగుల్ ఆఫీస్‌- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం- కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు
Mohan Babu Attack On Media: గతి తప్పిన మంచు కుటుంబ వివాదం - మోహన్ బాబు చుట్టూ బిగస్తున్న ఉచ్చు
గతి తప్పిన మంచు కుటుంబ వివాదం - మోహన్ బాబు చుట్టూ బిగస్తున్న ఉచ్చు
Google Trending Searches: 2024 గూగుల్‌ సెర్చ్‌లో ఐపీఎల్‌, పవన్ కల్యాణ్‌, కల్కి, సలార్‌ టాప్‌
2024 గూగుల్‌ సెర్చ్‌లో ఐపీఎల్‌, పవన్ కల్యాణ్‌, కల్కి, సలార్‌ టాప్‌
Mokshagna Debut Movie: వెయ్యి కోట్ల సినిమా దర్శకుడితో నందమూరి వారసుడి మొదటి సినిమా... ప్రశాంత్ వర్మ ఫిల్మ్ క్యాన్సిల్ కావడంతో!
వెయ్యి కోట్ల సినిమా దర్శకుడితో నందమూరి వారసుడి మొదటి సినిమా... ప్రశాంత్ వర్మ ఫిల్మ్ క్యాన్సిల్ కావడంతో!
Harish Rao News: సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
Prakasam District News: బ్రెయిన్ ట్యూమర్‌ తగ్గాలని 40 రోజులపాటు చర్చిలో ప్రార్థనలు- బాలిక మృతి- ప్రకాశం జిల్లాలో దారుణం
బ్రెయిన్ ట్యూమర్‌ తగ్గాలని 40 రోజులపాటు చర్చిలో ప్రార్థనలు- బాలిక మృతి- ప్రకాశం జిల్లాలో దారుణం
PAN 2.0 - Aadhaar: పాన్ 2.0 కార్డ్‌ను కూడా ఆధార్‌తో లింక్ చేయాలా, సర్కారు ఏం చెప్పింది?
పాన్ 2.0 కార్డ్‌ను కూడా ఆధార్‌తో లింక్ చేయాలా, సర్కారు ఏం చెప్పింది?
RBI Governor Salary: ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌ జీతం ఎంత, ఎలాంటి సౌకర్యాలు లభిస్తాయి?
ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌ జీతం ఎంత, ఎలాంటి సౌకర్యాలు లభిస్తాయి?
Embed widget