Viagra for Cancer: వయాగ్రాతో క్యాన్సర్‌కు చికిత్స? పరిశోధనలో ఊహించని ఫలితాలు
పురుషుల్లో అంగస్తంభన సమస్యలను ఎదుర్కొనేందుకు ఉపయోగించే వయాగ్రా.. క్యాన్సర్ నివారణకు కూడా సహకరిస్తోందట.
పురుషుల్లో అంగస్తంభనకు ఉపయోగించే ‘వయాగ్రా’కు క్యాన్సర్ వ్యాధిని నయం చేసే శక్తి కూడా ఉందట. కిమోథెరపీ కంటే పవర్‌ఫుల్‌గా వయాగ్రా పనిచేస్తుందట. యూకేకు చెందిన ఓ క్యాన్సర్ రీసెర్చ్ సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది.
క్యాన్సర్ కణానికి రక్షణ కవచంగా ఉండే ఎంజైమ్లను వయాగ్రా నాశనం చేసిందని, దాని వల్ల కిమో డ్రగ్స్.. క్యాన్సర్ గడ్డలను సులభంగా నాశనం చేయగలిగాయని పరివోధకులు వెల్లడించారు. గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగులపై ఇది మరింత ప్రభావంతంగా పనిచేస్తుందన్నారు.
ఎలుకలపై జరిపిన పరిశోధనల్లో ఊహించని ఫలితాలు వచ్చాయని, వయాగ్రాను క్యాన్సర్ సంబంధిత ఔషదాలతో కలిపినట్లయితే మనుషుల్లో ఏర్పడే మరిన్ని క్యాన్సర్లను మరింత బాగా ఎదుర్కోవచ్చని వెల్లడించారు. లింగబేధం లేకుండా స్త్రీ-పురుషులిద్దరికీ ఈ ఔషదాలు పనికొస్తాయన్నారు. పైగా, ఈ ఔషదాలు ఎలాంటి అవాంఛిత ఉద్వేగానికి దారితీయవన్నారు.
పరిశోధనలో భాగంగా నిపుణులు ఎసోఫాగియల్ అనే క్యాన్సర్ కణాలపై కీమోథెరపీతో కలిపి ‘PDE5 ఇన్హిబిటర్స్’ అనే వయాగ్రాను ఎలుకలపై ప్రయోగించారు. దీంతో క్యాన్సర్ కణాలకు రక్షణగా ఉండే ఎంజైమ్‌ల స్థాయిలు తగ్గాయి. క్యాన్సర్ కణాలు.. నేరుగా కిమోకు గురయ్యేందుకు సహకరించాయి. ఎలుకల్లోని కణితులు.. నేరుగా ఇచ్చే కిమో కంటే వయాగ్రాతో కలిపి ఇచ్చిన కిమోకే ఎక్కువ శాతం కుచించుకుపోయినట్లు సెల్ రిపోర్ట్స్ మెడిసిన్ జర్నల్ వెల్లడించింది.
Also Read: డేటింగ్, వన్ నైట్ స్టాండ్‌కు మధ్య తేడా ఏమిటీ? ఏది సేఫ్?
ఈ నేపథ్యంలో నిపుణులు కిమో, వయగ్రా కాంపినేషన్లో మందులను తయారు చేసే యోచనలో ఉన్నారు. ముందుగా గొంతు క్యాన్సర్ రోగులకు ఈ మందులను అందుబాటులోకి తెచ్చే అవకాశాలున్నాయి. పెద్ద పేగు క్యాన్సర్ కూడా..: రెండేళ్ల కిందట జరిగిన ఓ పరిశోధనలో కూడా వయాగ్రా క్యాన్సర్‌తో పోరాడుతుందని తేలింది. అకా సిల్డెనాఫిల్ అనే వయాగ్రాను నీటిలో కలిపి ఎలుకలు ఇచ్చారు. ప్రతి రోజూ దాన్ని ఔషదంగా ఇవ్వడం వల్ల ఎలుకల్లో కొలొరెక్టల్(పెద్ద పేగు) క్యాన్సర్ ప్రమాదం తగ్గినట్లు పరిశోధకులు వెల్లడించారు.
Also Read: శృంగారం ఇంత సేపు చేస్తే మీరే కింగ్స్, భారతీయుల సరాసరి టైమ్ ఇదే!
గమనిక: పరిశోధనల్లో పేర్కొన్న అంశాలను మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ కథనం వైద్యానికి ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి సందేహాలున్నా.. మీరు డాక్టర్‌ను సంప్రదించాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.