Diabetes: డయాబెటిస్ ఉన్న వారు కచ్చితంగా తినాల్సిన నాలుగు కూరగాయలు ఇవే
డయాబెటిస్ వచ్చిన వారు ఏం తినాలన్న భయపడుతూనే ఉంటారు.
అన్ని శరీరారాలు ఒకేలా ఉండవు, వారు తినే ఆహరాన్ని బట్టి వారి శరీరాలు ప్రతిస్పందిస్తుంటాయి. డయాబెటిస్ తో బాధపడుతున్న వారి పరిస్థితి కూడా అంతే. వారి వ్యాధిని బట్టి వారు ఆహారం ఆధారపడి ఉంటుంది. వారు తినే ఆహారాన్ని బట్టి శరీరం స్పందిస్తుంది. డయాబెటిస్ ఉన్న వారు కచ్చితంగా తినాల్సిన కూరగాయలు కొన్ని ఉన్నాయి. ఆ కూరగాయలు వారి రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నిరోధిస్తాయి. మధుమేహాన్ని నియంత్రించకపోతే అది మూత్ర పిండాల వ్యాధికి, కంటి దెబ్బతినడానికి కారణమవుతుంది. అలాగే నాడీ వ్యవస్థ, ఇతర అవయవాలనుక కూడా దెబ్బతీస్తుంది. అందుకే కచ్చితంగా రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువ ఉండేలా చూసుకోవాలి.
లెట్యూస్
ఇది సూపర్ మార్కెట్లలో అధికంగా దొరుకుతుంది. దీనిలో విటమిన్ కె సమృద్ధిగా ఉంటుంది. ఇది ఇన్సులిన్ నియంత్రణకు మెరుగుపరుస్తుంది. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నియంత్రణలో ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ కె, ఏదైనా గాయం తగిలినప్పుడు రక్తం స్రావం కాకుండా వెంటనే రక్తం గడ్డకట్టేలా చేయడంలో కూడా సహాయపడుతుంది.
వంకాయలు
వంకాయలను చాలా మంది తినడానికి ఇష్టపడరు కానీ ఇది ఉత్తమ కూరగాయలలో ఒకటి. దీనిలో ఫైబర్, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తంలోకి పిండి పదార్ధాలను గ్రహించే ప్రక్రియను నెమ్మదించేలా చేస్తుంది. దీని వల్ల రక్తంలో గ్లూకోజ్ అమాంతం పెరగవు. తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
బ్రకోలీ
ఈ కూరగాయలో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. ఇది కూడా వంకాయ లాగే రక్తంలో పిండి పదార్థాలను శోషణను మందగించేలా చేస్తుంది.అందుకే రక్తంలో చక్కెర స్థాయిలను మెరుగుపరుస్తుంది. అలాగే, ఇది పొట్ట, పేగు ఆరోగ్యానికి అవసరమయ్యే మంచి బ్యాక్టిరియాను పెంచి పోషిస్తుంది. దీని వల్ల పొట్ట, పేగులు ఆరోగ్యంగా ఉంటాయి.
కాలీ ఫ్లవర్
కాలీఫ్లవర్లో పురుగు పడుతుందని ఎక్కువ మంది దీన్ని కొనక్కుండా వదిలేస్తారు. నిజానికి ఇది డయాబెటిస్ రోగులకు వరంతో సమానం. ఇది క్రూసిఫెరస్ కూరగాయల కుటుంబానికి చెందినది. ఈ కూరగాయల్లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఈ ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా మెయింటేన్ చేయడంలో ముందుంటుంది. అంతే కాదు కాలీప్లవర్ తినడం వల్ల ఎక్కువసేపు పొట్ట నిండుగా ఉన్నట్టు ఉంటుంది.
Also read: భూమ్మీద ఇప్పటివరకు పుట్టినవాళ్లలో అత్యంత ధనవంతుడు ఈయనే, పనివారికి కూడా బంగారు వస్త్రాలే
Also read: దోసకాయ మటన్ కర్రీ, వేడివేడి అన్నంతో తింటే ఆ రుచే వేరు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.